Murali Krishna, News18, Kurnool
మారుతున్న నేటి ఆహారపు అలవాట్లు అందులోనూ రసాయనాలు వాడి పండించినటువంటి పంటలు మనిషియొక్క జీవనవిధానంపై తీవ్రమైన ప్రభావాన్నికలిగిస్తున్నాయి. వీటిలో భాగంగా చాలా వరకు అందరూ రకరకాలైన వ్యసాయం పద్ధతులను పాటిస్తున్న తరుణంలో కళాశాలలో విద్యార్థులకు వ్యసాయంపై అవగాహన కల్పించే విధంగా హైడ్రోఫోనిక్ పద్దతిని ఒక పాఠంగా విద్యార్థులకు నేర్పిస్తున్నారు. కర్నూలు (Kurnool) లోని కె.వి.ఆర్. మహిళా డిగ్రీ కళాశాల అధ్యాపకులు. ఇందులో భాగంగా కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపకులు మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో రసాయనాల వినియోగించి పంటలు పండించడం ఎక్కువైంది అన్నారు. చివరికి తక్కువ పెట్టుబడితో పండించేటటువంటి ఆకుకూరలు పండించేందుకూ ఎక్కువ మోతాదులో వాడుతుండటంతో జనం రోగాలబారిన పడుతున్నారని అన్నారు. వీటి నుంచి బయట పడి ఆరోగ్యకరమైన, మంచి పోషక విలువలున్న పంటలను స్వయంగా సాగు చేసుకుంటే ఖర్చు తగ్గడంతోపాటు మంచి ఆరోగ్యం లభిస్తుందని నగరంలోని కేవీఆర్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు చెబుతున్నారు.
కర్నూలుకు చెందిన ఎస్.సుబ్బలక్ష్మి సాంకేతిక సహకారంతో కేవీఆర్ కళాశాలలో ప్రిన్సిపల్ ఇందిరాశాంతి, బోటనీ డిపార్ట్మెంట్ అధ్యాపకులు డేవిడ్ ఆధ్వర్యంలో కళాశాలలో హైడ్రోపోనిక్ పద్ధతిలో మొక్కల సాగు చేపట్టారు. బి.జెడ్.సి విద్యార్థినులకు ఇంటర్న్ షిప్ లో భాగంగా కళాశాల ఆవరణలో అదేవిధంగా వాటిని డిపార్ట్మెంట్ గదిలో ఈ హైడ్రోపోనిక్ పద్ధతి ద్వారా మొక్కల సాగు చేపట్టారు.కళాశాలలో ఉన్నటువంటి బోటనీ విభాగం ఆధ్వర్యంలో గ్రీన్ స్టాటప్ ప్లాంట్ ఏర్పాటు చేశారు. సూర్యరశ్మి తగలకుండా కేవలం విద్యుత్ శక్తి ద్వారా కాంతి ఆ మొక్కలపై పడే విధంగా ఒక స్టాండ్ వంటిది ఏర్పాటు చేసుకొని అందులోనే సుమారుగా వివిధ రకాలైన మొక్కలను పెంచుతున్నారు .
ఇందులో ఎర్రతోట కూర, బేసిల్, పాలకూర.. ఇలా 24 మొక్కలు ఉన్నాయి. దీనికిగాను సుమారు రూ.24 వేలు వెచ్చించారు. దీంతోపాటు కళాశాల ఆవరణలో ప్రత్యేకంగా తయారు చేసిన ట్రేల్లో పొన్నగంటి, పాలకూర, చెర్రి టమోట, ఎర్రతోట కూర మొక్కలు సాగు చేశారు. దీని కోసం సుమారు రూ.65 వేలు వెచ్చించినట్లు ప్రిన్సిపల్ ఇందిరాశాంతి తెలిపారు. క్రిమి కీటకాల నుంచి రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా తయారు చేయించిన దోమ తెర ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ పద్ధతి ద్వారా మనం తక్కువ స్థలంలో ఎక్కువ మొక్కలను పెంచుకొనే వీలుంటుందని తెలిపారు.
అంతేకాకుండా ఈ హైడ్రోపోనిక్ పద్ధతి ద్వారా ఎక్కడైనా మనం కూరగాయలు ఆకుకూరలు పండించుకోవచ్చు అని తెలిపారు అపార్ట్మెంట్లలో ఇంటి పైన ఇలాంటి ఒక స్టాండ్ ఏర్పాటు చేసుకొని అందులో దాదాపు మనకు కావలసినటువంటి అన్ని కూరగాయల మొక్కలను సాగు చేసుకోవచ్చన్నారు.
వివరాలు :
డేవిడ్
బొటని అధ్యాపకులు
కె.వి.ఆర్ మహిళా డిగ్రీ కళాశాల,
సెల్ :-94934 39686
కర్నూలు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Agriculture, Andhra Pradesh, Kurnool, Local News