హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: IIITDMలో ఘనంగా నాలుగో స్నాతకోత్సవ వేడుకలు..టాపర్స్‌కు గోల్డ్‌మెడల్స్‌తో సత్కారం..!

Kurnool: IIITDMలో ఘనంగా నాలుగో స్నాతకోత్సవ వేడుకలు..టాపర్స్‌కు గోల్డ్‌మెడల్స్‌తో సత్కారం..!

ఘనంగా

ఘనంగా కర్నూలు ట్రిపుల్ ఐటీ స్నాతకోత్సవం

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఇన్‌ఫర్మమేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ (IIITDM) కర్నూలు (Kurnool) నాలుగో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆప్‌ ఇన్‌ఫర్మమేషన్‌ టెక్నాలజీ డిజైన్‌ అండ్‌ మాన్యుఫాక్చరింగ్‌ (IIITDM) కర్నూలు (Kurnool) నాలుగో స్నాతకోత్సవం ఘనంగా నిర్వహించారు. భారత ప్రభుత్వ రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారులు మరియు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మాజీ చైర్మన్, డా. జి. సతీష్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భగా ఆయన ప్రసంగిస్తూ శాస్త్ర సాంకేతిక రంగాలలో విన్నూత్న రూపకల్పనకు మరియు తయారీకి వున్న ప్రాముఖ్యతను వివరించారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ ఇచ్చిన "మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్, మేక్ ఫర్ వరల్డ్" నినాదానికి అనువుగా, మన శాస్త్ర సాంకేతిక రంగాలలో ఎన్నో ఆవిష్కరణలు చేసినప్పుడే మన భారతదేశం స్వావలంబన దిశగా ముందుకు వెళ్లగలదని తెలిపారు.

  ఆనతి కాలంలోనే ఐఐఐటీడీమ్(IIITDM) కర్నూలు యొక్క అభివృద్ధి చూస్తుంటే గర్వంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేసారు. విద్యార్థులందరూ మన దేశాన్ని ప్రపంచ అగ్రగామిగా మార్చేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారంతా వైట్‌ అండ్ వైట్‌ దుస్తులే ధరించారు. స్నాతకోత్సవం సందర్భంగా కాలేజీ ఆవరణాన్ని పుష్పాలతో అందంగా అలంకరించారు. ముందుగా విద్యార్థుల గీతాలాపనతో కార్యక్రమం మొదలైంది. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు.

  ఇది చదవండి: ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు గుడ్ న్యూస్.. జాబ్‌తో పాటు ఉన్నతచదువులకు ఛాన్స్.. వివరాలివే..!

  ఈ సందర్భంగా గ్రాడ్యుయేషన్‌ కోర్సు పూర్తిచేసిన విద్యార్థులను ముఖ్యఅతిథి సతీష్‌ రెడ్డి అభినందించారు. డైరెక్టర్, ప్రొఫెసర్ డివిఎల్ఎన్ సోమయాజులు, 2021-2022 విద్యా సంవత్సరానికి డిజైన్ అండ్ మ్యాను ఫ్యాక్చరింగ్ రంగంలో ఇన్‌స్టిట్యూట్ ప్రగతిని వివరించారు. IIITDM కర్నూల్లోని కోర్సులు మరియు పాఠ్యాంశాలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్, IoT, క్వాంటం కంప్యూటింగ్, డిజైన్ మరియు మాన్యుఫ్యాక్చరింగ్ మొదలైన ఇంజనీరింగ్ మరియు సైన్స్‌లో సంబంధిత పరిజ్ఞానాన్ని ప్రోత్సహిస్తాయి.

  ఇది చదవండి: అక్కడ పుస్తకాలన్నీ సగం ధరకే..! A to Z ఏ పుస్తకం కావాలన్నా దొరుకుతుంది..!

  వివిధ కోర్సులలో ఈ ఏడాది ఉత్తీర్ణులైన 104 మంది బీటెక్‌ (B.Tech) మరియు 09 మంది ఎం.టెక్ (M.Tech) విద్యార్థులందరికీ ఈ స్నాతకోత్సవంలో డిగ్రీలు ప్రదానం చేశారు. బి. టెక్ సీఎస్‌ఈ, ఈసీఈ, మెకానికల్ బ్రాంచ్‌లలో టాపర్స్‌గా నిలిచిన విద్యార్థులకు బంగారు పతకాలు (Gold medals) అందజేశారు. అన్నీ విభాగాలలో ఓవరాల్‌ టాపర్‌గా నిలిచిన విద్యార్థికి కూడా బంగారు పతకం అందజేశారు. CSE డిపార్ట్‌మెంట్‌లో అతుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థినికి దుర్వాసుల మాణిక్యాంబ స్మారక బంగారు పతకం బహుకరించారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News

  ఉత్తమ కథలు