హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP News: కోస్తాకు సీమకు మధ్య స్వీట్ ఫైట్.. పూతరేకులకు పోటీ.. కాజాకు కాంపిటీషన్

AP News: కోస్తాకు సీమకు మధ్య స్వీట్ ఫైట్.. పూతరేకులకు పోటీ.. కాజాకు కాంపిటీషన్

పాలకోవా తయారీ

పాలకోవా తయారీ

ఆత్రేయపూరం అంటే పూతరేకులు, కాకినాడ అంటే కాజా, బందర్ అంటే లడ్డూ టక్కున గుర్తొస్తుంది. ఇప్పుడు కర్నూలును తలుచుకున్నా టక్కున గుర్తొచ్చే స్వీట్ ఒకటుంది.

Murali Krishna, News18, Kurnool

ఆత్రేయపురం అంటే పూతరేకులు, కాకినాడ అంటే కాజా, బందర్ అంటే లడ్డూ టక్కున గుర్తొస్తుంది. ఇప్పుడు కర్నూలు (Kurnool) ను తలుచుకున్నా టక్కున గుర్తొచ్చే స్వీట్ ఒకటుంది. అదే పాలకోవ. తమ సొంత కాళ్లపై నిలబడి, నోరూరించే పాలకోవాను తయారు చేస్తూ. ఇతర ప్రాంతాలకే కాదు అంతర్జాతీయంగా కూడా ఎగుమతి చేస్తున్నారు పొదుపు సంఘాల మహిళలు. రాయలసీమలో ఎప్పుడూ కరువు తాండవిస్తుండేది. ఉపాధి దొరక్క వలసలు వెళ్లే వాళ్లు ఉంటారు. కానీ, ఆ కరువు ప్రాంతంలోనే కమ్మని కోవాను తయారు చేస్తూ తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు తడికనపల్లె మహిళలు.

కర్నూలు జిల్లా కల్లూరు మండలం తడకనపల్లె గ్రామం పాలకోవ తయారీకి పెట్టింది పేరు. కర్నూలు నుంచి 20 కిలోమీటర్ల దూరంలో మారుమూల కొండల మధ్య ఈ ఊరు ఉంది. రాయలసీమలో ఎవ్వరిని కదిలించిన ఈ తడకనపల్లె పాలకోవ రూచి గురించి అద్భుతంగా చెబుతారు. రుచికి రుచి.., స్వచ్ఛతకు స్వచ్ఛత ఈ పాలకోవా స్పెషల్.

ఇది చదవండి: సీఎం జగన్ లో ఈ యాంగిల్ ఎప్పుడైనా గమనించారా..? వాళ్లంటే ఎంత ఇష్టమో..!


గ్రామంలో పాడి పరిశ్రమ ఎక్కువుగా ఉండటంతో సగం మందికిపైగా ఈ పాలకోవా తయారీ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఈ గ్రామంలో ఏ ఇంటి గడప తొక్కినా.. అక్కడ పాలకోవా వాసనే వస్తుంది. ఎందుకంటే చాలా ఇళ్లు ఈ పాలకోవా తయారీనే జీవనాధారంగా చేసుకున్నాయి. ముఖ్యంగా మహిళలే ముందుండి పాలకోవా తయారు చేస్తున్నారు. చక్కెరతోనే కాదు ఇక్కడ బెల్లంతో కూడా పాలకోవను తయారు చేస్తున్నారు. ఒక్కప్పుడు పొట్టకూటికోసం మొదలుపెట్టిన ఈ ప్రయాణం ఇప్పుడు ఆన్లైన్ మార్కెటింగ్లో ఎగుమతి చేసేవరకు ఎదిగింది. దేశ విదేశాల్లో ఈ తడకనపల్లె పాలకోవాకు మంచి డిమాండ్ ఉంది.

ఇది చదవండి: చేపలమ్మిన రోజా.. మంత్రి అయ్యాక ఎక్కడా తగ్గడం లేదుగా..!


దాదాపు 50 ఏళ్లకు పైగా ఈ పాలకోవా తయారు చేస్తున్నారు తడకనపల్లె గ్రామస్తులు. ఒకరిని చూసి మరొకరు ఇలా ఇప్పుడు ఆ ఊరంతా పాలకోవా తయారీలో క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు. ఆ ఇంట్లో ఉండే వారందరికి చేతినిండా పనే. పాలు సేకరించడం, పాలకోవా తయారు చేయడం, చేసిన దాన్ని మార్కెట్ చేయడం..ఇలా ఎంతమంది ఉంటే అంతమంది ఉపాధిని పొందుతున్నారు.

ఇది చదవండి: పవర్ కట్స్ తో ఇబ్బంది పడుతున్నారా..? ఈ టిప్స్ పాటిస్తే విద్యుత్ ఆదా..


మహిళా సాధికారతలోనూ ఈ గ్రామం ముందంజలో ఉంది. ఇక్కడ మహిళలు తయారు చేసే పాలకోవా ఒక్కసారి రూచి చూశారంటే చాలు.. తమ ఇళ్లలో ఏ ఫంక్షన్ జరిగినా ఆ పాలకోవాను ఆర్డర్ ఇవ్వకుండా ఉండలేరు. డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువగా ఉండటంతో చేతితో తయారు చేసే మహిళలు యంత్రాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఆ మెషిన్ల కొనుగోలుకు ప్రభుత్వం సబ్సీడీ ఇస్తుంటే.., మరికొన్ని బ్యాంకులు ముందుకొచ్చి రుణాలు ఇస్తున్నాయి.

ఇది చదవండి: నిమ్మకాయ సోడా, పులిహోరను మర్చిపోవాల్సిందేనా..! కొనాలంటే జేబు గుల్లే..


గ్రామంలో గేదెల హాస్టల్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పొదు సంఘాల ఆధ్వర్యంలో ఈ హాస్టల్ను నిర్వహిస్తున్నారు. హాస్టల్ లో ఉండే గేదెల నుంచి పాలనను తీసుకొని గ్రామంలో స్వచ్ఛమైన పాలకోవా తయారు చేస్తున్నారు. ఎటువంటి కల్తీ లేకుండా స్వచ్ఛమైన పాలు చక్కెరతో ఇక్కడ పాలకోవా తయారు అవుతుంది.

ఇది చదవండి: తిండే కాదు తినేప్లేస్ కూడా వెరైటీగా ఉండాలా..! వైజాగ్ లో వావ్ అనిపించే రెస్టారెంట్..!


ఈ పాలకోవాకు అంత రుచి రావడం.. స్వచ్ఛమైన పాలనే వాడటం. దీంతో ఆ గ్రామంలో పాడి పరిశ్రమ కూడా అభివృద్ధి చెందింది. అంతేకాదు ఎవరి పశువులకు వాళ్లు వేసే పశుగ్రాసాన్ని సేంద్రీయపద్ధతిలో పండిస్తారు. ఈ తడకనపల్లె పాలకోవాకు ఆన్లైన్ ఆర్డర్ సౌకర్యం కూడా కల్పిస్తే తమకు మరింత ఉపయోగపడుతుందంటున్నారు తయారీదారులు.


ఇది చదవండి: సాయిబాబా ఆలయం ఇలా ఎక్కడా ఉండదు.. చూస్తే మైమరచిపోతారు..!


పాలకోవా తయారీ దారి జుబేదాబీ మాట్లాడుతూ “ మేం 50 ఏళ్లుగా కోవా తయారు చేస్తున్నాం. మా నాయన ఉన్నప్పటి నుంచి మా ఒక్క కుటుంబమే చేసేది. మొదట మా అన్న వాళ్లు, మా అక్కవాళ్లు మేమూ తరువాత కొంత మందికి విజయ్మోహన్ కలెక్టర్ సార్ ఉన్నప్పుడు మా గ్రూపులో ఉన్నవాళ్లకి కొంతమందికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. అంటే ఈ కోవాకు వేరే కోవాకు తేడా ఏంటంటే.. మాది స్వచ్ఛమైన పాలతో తయారు చేస్తాం. పాలు చక్కెర మాత్రమే వేస్తాం. ఎలాంటి ఫ్లేవర్ ఫుడ్లు కలపం..అందుకే మా పాలకోవాకు అంత డిమాండ్ “ అని చెప్పుకొచ్చారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool

ఉత్తమ కథలు