Home /News /andhra-pradesh /

KURNOOL KURNOOL GIRL WON BRONZE MEDAL IN TENNIS AT DEAFLYMPICS FULL DETAILS HERE PRN KNL NJ

Kurnool Girl: ఆంధ్రా అమ్మాయికి ఒలింపిక్ మెడల్..! సత్తా చాటిన కర్నూలు యువతి..!

బదిరుల

బదిరుల ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన షేక్‌ జాఫ్రీన్‌

Deaflympics: ఆమె అంగవైకల్యం ముందు అంతర్జాతీయ వేదిక సైతం చిన్నబోయింది. ఆమె ప్రతిభకు ఒలిపింక్ బ్రాంజ్‌ మెడల్‌ దాసోహమదిం. ఆటే శ్వాసగా..ఆటే ధ్యాసగా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న టెన్నిస్‌ ప్లేయర్‌ జాఫ్రీన్‌ ఖాతాలో ఇప్పుడు మరో పతకం వచ్చి చేరింది.

ఇంకా చదవండి ...
  Murali Krishna, News18, Kurnool

  కొంతమందికి పట్టుదల ముందు వారిలో ఉన్న లోపాలు కనిపించవ్. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతూ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఆమె అంగవైకల్యం ముందు అంతర్జాతీయ వేదిక సైతం చిన్నబోయింది. ఆమె ప్రతిభకు ఒలిపింక్ బ్రాంజ్‌ మెడల్‌ దాసోహమదిం. ఆటే శ్వాసగా..ఆటే ధ్యాసగా ఎన్నో విజయాలు సొంతం చేసుకున్న టెన్నిస్‌ ప్లేయర్‌ జాఫ్రీన్‌ ఖాతాలో ఇప్పుడు మరో పతకం వచ్చి చేరింది. బదిరుల ఒలింపిక్‌(డెఫిలింపిక్స్‌) క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు (Kurnool) క్రీడాకారిణి సంచలనం సృష్టించింది. టెన్నిస్‌ ప్లేయర్‌ షేక్‌ జాఫ్రీన్‌ కాంస్య పతకం సాధించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ విభాగంలో మూడో స్థానం కోసం జరిగిన పోరులో జాఫ్రీన్‌–పృథ్వీ శేఖర్‌ జోడి 6–1, 6–2తో భారత్‌కే చెందిన భవాని కేడియా – ధనంజయ్‌ దూబే జంటను ఓడించింది.

  ఎనిమిదేళ్ల ప్రాయంలోనే టెన్నిస్‌ రాకెట్‌ పట్టిన జాఫ్రిన్‌
  షేక్‌ జాఫ్రిన్‌ 7 సెప్టెంబర్‌ 1997న కర్నూలులో జన్మించింది. ఆమె పుట్టుకతోనే బధిరురాలు. కానీ, జాఫ్రిన్‌ మూడేళ్ల వయసులో ఆమెకు మూగ, చెవుడు అని తల్లిదండ్రులు గుర్తించారు. అయినా నిరాశ చెందకుండా.. ఏనాడు ఆమెలోని ఆత్మవిశ్వాసాన్ని చెదరనివ్వలేదు. ఆమె తండ్రి జాకీర్‌ వృత్తి రిత్యా అడ్వకేట్‌. జాఫ్రిన్‌కు తనలోని లోపాలను మరిచిపోయేలా..అందరిలా స్కూల్‌కు పంపారు. ఆమెకు చిన్నతనంలోనే టెన్నిస్‌పై ఆసక్తి ఉందని తెలుసుకుని ప్రత్యేక ట్రైనింగ్‌ ఇప్పించాలనుకున్నారు. దీంతో ఎనిమిదేళ్ల ప్రాయంలోనే టెన్నిస్ రాకెట్‌ పట్టుకుని కోర్టులో అడుపెట్టింది.

  ఇది చదవండి: భీముడు కూర్చున్న కుర్చీ ఇక్కడే ఉంది.. పాండవులు నివాసమున్నదీ అక్కడే..!


  సానియా మీర్జా టెన్నిస్‌ అకాడమీలో ప్రత్యేక శిక్షణ
  కర్నూలులో నివాసం ఉంటున్న జాఫ్రీన్‌ తండ్రికి తన కూతురిని టెన్నిస్‌ క్రీడాకారిణిగా చూడాలన్నది కోరిక. ఆమె ఆసక్తికి తండ్రి లక్ష్యం కూడా తోడైంది. దీంతో తన తండ్రి కలను నిజం చేయాలని చిన్ననాటి నుంచి నిరంతరం కృషి చేసింది. తన లోపాన్నే విజయాలకు సోపానాలుగా మార్చుకుంది. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్‌ టెన్నిస్‌ ప్లేయర్‌ సానియా మీర్జీ దృష్టిలో పడింది. ఆ తర్వాత హైదరాబాద్‌లోని సానియామీర్జా టెన్నిస్‌ అకాడమీలో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. ఎన్నో టోర్నమెంట్‌లలో పాల్గొని విజయాలను కైవసం చేసుకుని అంతర్జాతీయ టెన్నిస్‌ క్రీడాకారిణిగా ఎదిగింది.

  ఇది చదవండి: రాయలసీమ రతనాల సీమ ఎలా అయింది..? చరిత్ర తెలియాలంటే అక్కడికి వెళ్లాల్సిందే..!


  చిన్నతనంలోనే సీనియర్లతోనే పోటీపడి ఆడేది. కుమార్తె ప్రతిభను గుర్తించిన జాఫ్రిన్‌ తండ్రి ఆల్‌ ఇండియా టెన్నిస్‌ అసోసియేషన్‌ లో ఆమె పేరును రిజిస్టర్‌ చేయించారు. అండర్‌ 12, 14 జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచింది. 2012లో పంజాబ్‌లో జరిగిన పోటీల్లో పసిడి పతకం సాధించి తన సత్తా చాటింది.

  ఇది చదవండి: బ్యాక్‌ టు రూట్స్‌ అంటున్న ప్రజలు... మిలెట్స్‌ టిఫెన్‌ సెంటర్‌కు పెరుగుతున్న క్రేజ్‌!


  అయితే తనను ఆర్థికంగా ఆదుకోవాలని అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డిని కోరింది. మీడియా ద్వారా ఈ విషయం తెలుసుకున్న టెన్నిస్‌ దిగ్గజం సానియా మీర్జా…జాఫ్రిన్‌కు తన అకాడమీలోనే ఉచితంగా శిక్షణ ఇప్పించారు. అప్పటి నుంచి ఆమె విజయప్రస్థానం అంతర్జాతీయం దిశగా కొనసాగింది. ఒకవైపు శిక్షణ మరోవైపు అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో విజయసోపాలను అధిరోహించింది. ఆమె ప్రతిభకు మెచ్చి సానియా మీర్జా అప్పట్లో ఆర్థికసాయం చేశారు.

  ఇది చదవండి: ఏపీలో టెన్త్ పాస్, ఫెయిల్ అయిన వారికి అలర్ట్.. ఫ్రీ ట్రైనింగ్ తో పాటు జాబ్ గ్యారెంటీ.. 


  డెఫిలింపిక్స్‌ 2021:
  బ్రెజిల్‌ వేదికగా మే నెల ఒకటో తేది నుంచి 15 వరకు డెఫిలింపిక్స్‌ 2021 పోటీలు నిర్వహించారు. 72 దేశాలకు చెందిన దాదాపు 2,100 మంది క్రీడాకారులు ఈ ఈవెంట్‌లో పాల్గొన్నారు. భారత్‌ నుంచి 65 మంది క్రీడాకారులు 11 రకాల క్రీడల్లో ప్రాతినిధ్యం వహించారు. భారత్‌ 16 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. అందులో 8 బంగారు(gold), 1 కాంస్యం(silver), 7 రజత పతకాలు(bronze) ఉన్నాయి. ఈ రికార్డుతో భారత్‌ 1993లో తనకున్న అత్యధిక పతకాల రికార్డులను తిరగరాసింది.

  ఇది చదవండి: వేపచెట్టుకు వందేళ్లు..! గ్రాండ్ గా బర్త్ డే సెలబ్రేషన్.. ఆ వేడుకను మీరూ చూడండి..!


  ప్రధాని మోదీ అభినందనలు
  బ్రాంజ్ మెడల్ సాధించిన వారిలో కర్నూలు జిల్లాకు చెందిన షేక్ జాఫ్రిన్ ఒకరు. డెఫిలింపిక్స్‌ పోటీల్లో మంచి ప్రతిభ కనబరిచినందుకు ప్రధాన మంత్రి తన నివాసంలో క్రీడాకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి అందరినీ అభినందించారు. జాఫ్రిన్‌ పేరు చెబుతూనే నమస్తే అంటూ నవ్వుతూ పలకరించారు మోదీ. టెన్నిస్‌ కోర్టులో తన పార్టనర్‌తో ఎలా కోఆర్డినేట్‌ చేస్తావంటూ జాఫ్రిన్‌ను మోదీ అడిగితెలుసుకున్నారు.

  ఇది చదవండి: ఈ ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్ అవసరం లేదు.. ఫుడ్ ఆర్డర్ ఇస్తే చాలు..


  షేక్‌ జఫ్రీన్‌ ఖాతాలో ఎన్నో విజయాలు
  2013లో ఔరంగాబాద్‌లో జరిగిన జాతీయ పోటీల్లో రజతం
  2013లో బల్గేరియాలో జరిగిన డెఫిలింపిక్స్‌లో భారత్‌ తరుపున ప్రాతినిథ్యం
  2014 జర్మనీలో జరిగిన హంబర్గ్‌ టెన్నిస్‌కప్‌లో సింగిల్స్‌, మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజత పతకం
  అమెరికాలో జరిగిన ప్రపంచ డెఫ్‌ ఛాంపియన్‌షిప్‌లో ఐదో స్థానం
  2015లో జరిగిన ఎనిమిదో ఆసియా పసిఫిక్‌ గేమ్స్‌లో కాంస్య(Silver) పతకం
  2016లో హైదరాబాద్‌లో జరిగిన జాతీయ పోటీల్లో గోల్డ్‌మెడల్‌
  2017లో డెఫిలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్ లో రజత పతకం
  2022లో డెఫిలింపిక్స్‌లో మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజత పతకం
  2013, 2017 డెఫిలింపిక్స్‌లో భారత్‌ తరుపున ప్రాతినిధ్యం వహించింది. 2013లో తొలిసారి అంతర్జాతీయ వేదికపై అడుగుపెట్టిన జాఫ్రిన్‌కు ఓటమి ఎదురైనా…2017 సమ్మర్‌ డెఫిలింపిక్స్‌లో బ్రాంజ్‌ మెడల్‌ సాధించి మనదేశ కీర్తి ప్రతిష్టలను అంతర్జాతీయ వేదికపై రెపరెపలాడించింది.

  ఢిల్లీ నుంచి కర్నూలుకు వచ్చిన జాఫ్రీన్‌ను జిల్లా కలెక్టర్ కోటేశ్వరరావు కలిసి అభినందించారు. కర్నూలు పేరు ప్రఖ్యాతలు ప్రపంచ పటాన చాటి చెప్పినందుకు కర్నూలు వాసులు జాఫ్రీన్‌కు కృతజ్ఞతలు చెబుతున్నారు. జాఫ్రీన్‌ భవిష్యత్‌లో మరిన్ని పతకాలు అందుకోవాలని కోరుకుంటున్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Tennis

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు