Murali Krishna, News18, Kurnool
మారుతున్న జీవన విధానంలో ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్త కొత్త ఆహారపు అలవాట్ల వలన మానవ మానగడకు గుండె జబ్బులు పెనుముప్పుగా మారుతున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ గుండె జబ్బుల బారిన పడుతున్నారు. ఈ గుండె జబ్బుల బారిన పడటానికి ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు ఉదయం త్వరగా లేవకపోవడం, వ్యాయామాలు చేయకపోవడం, మొదలైన వాటి వలన మనిషికి బద్ధకం అనేది పెరిగి మితిమీరిన ఆలోచన వలన ఈ గుండె జబ్బులు అనేవి వస్తుంటాయని వైద్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ గుండె జబ్బుల బారిన పడిన వారికి స్వస్థత చేకూర్చే దిశగా కర్నూలు (Kurnool) జనరల్ హాస్పిటల్ లోని " కార్డియోథోరాసిక్"అహర్నిశలు కృషి చేస్తుందని కర్నూలు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి కార్డియోథోరాసిక్ సర్జన్ సి ప్రభాకర్ రెడ్డి తెలుపుతున్నారు.
ముఖ్యంగా రాష్ట్రం విడిపోయినప్పటి నుంచి రాయలసీమ (Rayalaseema) ప్రాంత వాసులో గుండె జబ్బులకు చికిత్స చేయించుకునేందుకు హైదరాబాదు (Hyderabad)కు వెళ్లడం కష్టంగా మారుతున్న తరుణంలో వైజాగ్ (Vizag) నుండి తను చదువుకున్న కర్నూలు వైద్య కళాశాలకు వచ్చి ఇక్కడ 7 కోట్ల రూపాయలతో 2 మ్యాథ్లర్ థియేటర్స్, 7 బెడ్స్ కలిగిన ఐసీయూ, 20 పడకల వార్డు, కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే పరికరాలకు దీటుగా కార్డియోథోరాసిక్ వార్డును 2016వ సంవత్సరం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఇప్పటివరకు కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో సుమారుగా 600 పైగా గుండె శాస్త్ర చికిత్సలు సక్సెస్ గానిర్వహించామని తెలిపారు.
ఇందులో భాగంగానే ఫిబ్రవరి 15వ తేదీన కేదారేశ్వరయ్య అనే ఆటో డ్రైవర్ 54 సంవత్సరాలు గల ఆటో డ్రైవర్ అశోక్ నగర్ కు చెందిన వ్యక్తికి "కరోనరీ ఆర్బిటరీ బైపాస్ గ్రాఫ్ట్" మినిమల్ ఇన్వెసివ్ కార్డియాక్ సర్జరీ, చేయడం జరిగిందని, ఫిబ్రవరి 20వ తేదీన పుల్లారెడ్డి అనే రైతు 35 సంవత్సరాల మోక్షగుండం ప్రకాశం జిల్లా (Prakasham District) చెందిన వ్యక్తికి టీబీ వలన ఊపిరితిత్తులు దెబ్బ తినడంతో అతనికి ఎక్కడ వెళ్లిన జబ్బు నయం కాకపోవడంతో కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో వచ్చి చేరడంతో ఈనెల 1వ తేదీన "న్యూమోనక్టమి" అనే ఆపరేషన్ చేయడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా ఈనెల 20వ తేదీన 7 సంవత్సరాల వయసుగల నిహాంత్ అనే అబ్బాయికి అతి క్లిష్టమైన వి.ఎస్.డి. క్లోజర్ మరియు పాత్ రిరూటింగ్ ఆపరేషన్లు విజయవంతంగా పూర్తి చేయడం జరిగిందని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News