T.Murali krishna, News 18, Kurnool
ఆరులైన్ల రోడ్డు కోసం భూములు తీసుకున్న రైతులకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌కు ఏపీ రైతు సంఘం నేతలతో కలిసి బాధితులు సామూహిక అర్జీలను అందించారు. వందలాది మంది రైతులు వచ్చి తమకు న్యాయంగా దక్కాల్సిన నష్టపరిహారాన్ని అందించాలని కోరారు. జిల్లా కలెక్టర్, ఆర్డీవోలకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ మాట్లాడుతూ… బాధిత రైతులకు ప్రభుత్వం న్యాయంగా ఆలోచించి సరైన పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులకు పాక్షికమైన నష్టపరిహారం ఇచ్చి మోసం చేయడం సరికాదని ఆయన అన్నారు, ఇప్పటికే రైతులు అతివృష్టి, అనావృష్టి వలన మరియు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
కర్నూలు, కల్లూరు తదితర మండలాలలోని 12 గ్రామాల నుండి 386 ఎకరాల భూమిని ఆరు లైన్ల రోడ్డు (six line road) కోసం తీసుకుంటూ సరైన నష్టపరిహారం (Compensation) ఇవ్వకపోతే రైతులకు ఆత్మహత్యలే శరణ్యం తప్ప మరొకటి కాదని రామకృష్ణ అన్నారు.
Read this also ; Vizag: ఐడియా అంటే ఇది.. అంబాసిడర్ కారులో టేస్టీ చికెన్.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు
రైతు సంక్షేమ రాజ్యం అని చెప్పుకుంటున్నటు వంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్య పేద రైతులకు న్యాయం చేయడం మరచిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేవారు. భూములు సేకరించేటప్పుడు భూసేకరణ చట్టాలు ఉన్నాయని, వాటిని అమలు జరపడంలో అధికారులు వైఫల్యం చెందారని తెలిపారు.
Read this also ; Vizag: తెల్లవారుజామున వాకింగ్ వెళ్తున్నారా..? బీకేర్ ఫుల్ అంటున్న వాకర్స్..? అక్కడ ఏం జరుగుతోంది?
నోటీసులు ఇవ్వడం, గ్రామ సభలు ఏర్పాటు చేయడం, రైతుల ఆమోదం తీసుకోవడం వంటి ప్రక్రియను ఏ మాత్రం కూడా ఆరు లైన్ల రోడ్డు ప్రాజెక్టులో చేయలేదని రామకృష్ణ ఆరోపించారు. భూములు పోతున్నాయనే విషయం తెలుసుకొని గత సంవత్సరం ఆర్డిఓ (RDO) కి రైతులందరూ లిఖిత పూర్వకంగా అర్జి పెట్టుకున్నారు.
తమ భూములకు రెండు కోట్ల రూపాయలు నష్టపరిహారం ఇచ్చిన తర్వాతే తమ భూముల్లో అధికారులు కాలు పెట్టాలని లేకపోతే.. ఇవ్వమని చాలా స్పష్టంగా తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి కోసం రైతలన్నలు తమ భూములను గౌరవంగా ఇచ్చినప్పుడు…వాళ్లకు నామమాత్రంగా నష్టపరిహారం ఇవ్వడం దుర్మార్గమన్నారు.
Read this also ; Kurnool: అక్కడ చదువుకోవడమే వాళ్లు చేసుకున్న పాపం.. ఎవరూ పట్టించుకోకపోతే ఎలా..?
రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వకపోతే 12 గ్రామాల రైతులను కూడగట్టి దశల వారి ఆందోళనకు పునుకoటామని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ప్రభుత్వం కూడా రైతుల పట్ల సానుభూతితో ఆలోచించి సరైన నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రామకృష్ణ కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Farmers Protest, Kurnool, Local News