Andhra Pradesh: పొలం దున్నేందుకు డబ్బుల్లేక రైతు వినూత్న ఆలోచన... ఏం చేశాడంటే…!

పొట్టేలుతో పొలం దున్నుతున్న రైతు

వ్యవసాయం చేయాలంటే తేలికైన విషయం కాదు. ముందుగా నారా పోసి ఉంచుతారు. తరువాత గట్టి నేలను ఎడ్లు లేదా ట్రాక్టర్తో దున్నుతారు.

  • Share this:
    GT హేమంత్ కుమార్, తిరుపతి ప్రతినిధి, న్యూస్18

    వ్యవసాయం చేయాలంటే తేలికైన విషయం కాదు. ముందుగా నారా పోసి ఉంచుతారు. తరువాత గట్టి నేలను ఎడ్లు లేదా ట్రాక్టర్తో దున్నుతారు. ఆ తర్వాత అదే పొలానికి నీరుపెట్టి దమ్ము చేయాసి నారు నాటాలు. ఇదంతా పొలంలో పంట వేయడానికి చేసే ఓ నిరంతర ప్రక్రియ ఉంటుంది. కరోనా పుణ్యమా అని ప్రజలు తల్లడిలిపోతున్నారు. కనీసం మింగను మెతుకు లేకుండా ఖాళీకడుపులో నిద్రిస్తున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. అయితే పొలం దున్నేందుకు ఆ రైతు వద్ద డబ్బులు లేకపోవడంతో వినూత్న రీతిలో ఆలోచించాడు. ట్రాక్టర్లు, కాడెద్దులు లేకుండా పొలాన్ని దున్నాడు. అయితే గతంలోనూ వినూత్న రీతిలో పొలం దున్నిన సంఘటనలు లేకపోలేదు. ఓ రైతు తన ఇద్దరు కుమార్తెలతో పొలాన్ని దూన్నన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలం రేకెత్తించింది. ఇక తెలంగాణాలో గేదెలతో పొలం దున్నిన సందర్భాలు ఉన్నాయి. వీటికి బిన్నంగా కర్నూలు జిల్లా యెమ్మిగనూరు మండలం వెంకటగిరిలో పత్తి చేనులో సాళ్లు సరిచేస్తున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

    కర్నూలు జిల్లాలోని వెంకటగిరికి చెందిన రంజాన్ కు ఒక ఎకరా పొలం ఉంది. కరోనా తగ్గుముఖం పట్టడంతో సాగుభూమిలో పత్తి పంట నాటేందుకు పూనుకున్నాడు. అయితే పంట వేయాలంటే ముందుగా పొలాన్ని దున్నాల్సి ఉంటుంది. పొలం దున్నాలంటే ట్రాక్టర్ లేదా ఎద్దుల అవసరం. దింతో ముందుగా ట్రాక్టర్ యజమానిని సంప్రదించిన రంజాన్ కు షాక్ తగిలింది. పొలం గంట దున్నాలి అంటే 2 వేలు చొప్పున చెల్లించాలని ఆ యజమాని పేర్కొన్నాడు.

    ఇది చదవండి: ఆన్ లైన్లో రెండు తలల పాములు... ధర తెలిసి షాకైన పోలీసులు..



    అసలే డబ్బులు లేక సతమతం అవుతున్న ఆ రైతు అక్కడ నుంచి వెనుదిరిగాడు. ఇక ఎద్దుల ద్వారా దున్నించాలని భావించాడు. కానీ ఒక్కో ఎద్దుకు 1000 రూపాయల చొప్పున చెల్లించాలని, ఎద్దుల ద్వారా దున్నించిన తనకు మరో ఐదు వందల రూపాయలు ఇవ్వాలని ఎద్దుల యజమాని తెలపడంతో అంత డబ్బు ఇవ్వలేనని ఇంటికి వచ్చేశాడు. అప్పటికే నారు నాటిన అనంతరం అవి మొలకెత్తడంతో సాళ్లు సరిచేయడానికి సమయం మించిపోతోంది. దీంతో ఏమి చేయాలో తెలియని రంజాన్ దిగాలుగా ఇంటి పెరట్లో కూర్చొని ఉన్నాడు. అప్పుడే అతడికి ఒక బ్రిలియంట్ ఐడియా వచ్చింది.

    ఇది చదవండి: చెల్లెలితో రాసలీలలు.. అక్క మెడలో తాళి.. వీడు మాములోడు కాదు..


    పెరట్లో కూర్చొని ఆలోచిస్తున్న రంజాన్ కు తాను పెంచుతున్న పొట్టేలు కనిపించిదిం. వెంటనే తన మెదడుకు ఉపాయం తట్టింది. పొట్టేలుతో పొలం దున్నించాలని భావించి వెంటనే దాని సైజుకు సరిపడా నాగలిని తగిలించాడు. పొలంలో దిగిన పొట్టేలు అటు..ఇటు వెళ్లిపోకుండా ఉండేందుకు తన పిల్లలకు ఆకులు ఇచ్చి పొట్టేలు ముందు నడిచివెళ్లమని సూచించాడు. చిన్న నాగలిని పొట్టేలు మెడకు కట్టి ముందర పిల్లలు వెళ్తుంటే.. వారి వెనుకే పొట్టేలు వెళ్తూ పొలాన్ని దున్న సాగింది. ఇదంతా పక్కనే ఉన్న కొందరు రైతులు వీడియో తీశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

    ఇది చదవండి: పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ ఏపీ..? కేంద్రం గెజిట్ తో సీమకు ఒరిగేదేం లేదా..?

    Published by:Purna Chandra
    First published: