Home /News /andhra-pradesh /

KURNOOL KURNOOL FARMER DAUGHTER V MANISHA REDDY GOT ALL INDIA CIVILS 154TH RANK NGS KNL NJ

Civil Ranker: సాధారణ రైతు కూతురు కానీ ఎందిరికో ఆదర్శం.. రెండో ప్రయత్నంలోనే సివిల్ ర్యాంక్

సాధారణ

సాధారణ రైతు కూతురికి ఉత్తమ ర్యాంక్

Civil Ranker: ఆమె ఓ సాధారణ రైతు కూతురు.. కానీ ఇప్పుడు ఎందరికో ఆద్శంగా నిలుస్తోంది.. తన రెండో ప్రయత్నంలోనే అత్యుత్తమ సివిల్ ర్యాంక్ సాధించింది.. ఈ ర్యాంక్ సాధించడానికి ఆమె ఎలా ప్లాన్ చేసుకున్నారు అంటే..?

  Murali Krishna, News18, Kurnool

  Civil Ranker: ఆమెది సాధారణ రైతు కుటుంబ (Farmer Family) నేపథ్యం.. కానీ ఇప్పుడు ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది.. ఎందుకు అంటే..  వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి సివిల్స్‌లో మెరిసింది ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool district)కు చెందిన అమ్మాయి. అయితే తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్ 15 మార్కులతో పోయినా నిరాశ చెందలేదు.. మరింత పట్టుదలతో రెండో ప్రయత్నంలో ఉత్తమ ర్యాంక్‌ సాధించింది. సివిల్స్‌-2021లో జాతీయ స్థాయిలో 154వ ర్యాంక్ సాధించి.. సత్తా చాటింది  మనీషారెడ్డి (Manisha Reddy). నందిపల్లె (Nanipalle) కు చెందిన సర్వేశ్వర్ రెడ్డి (Sarveswar Reddy) మల్లేశ్వరమ్మ (Malleswaramma) ల కుమార్తె వి. మనీషా రెడ్డి. ఆమె నాన్న, బాబాయ్‌ వ్యవసాయం చేస్తూ చదివించారు. అందుకే బాగా చదువుకుని మంచి స్థాయికి చేరుకోవాలనే ఆలోచన బాల్యంలోని కలిగింది. నాన్న, బాబాయ్, పిన్నిల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నా అంటున్నారు మనీషారెడ్డి. సివిల్స్ చదివేందుకు అన్నివిధాలా పిన్ని ప్రోత్సహించారు.
  ఇంటర్వ్యూకి ఢిల్లీకి కూడా వెంట వెళ్లి పరీక్ష రాయించారు.

  నారాయణ ఐఏఎస్ అకాడమీలో హెచ్ పి జి(HPG) గ్రూపును ఎంచుకుని.. ఇంటర్, డిగ్రీ ఎంతో ఇష్టంగా చదివారు. ఇంటర్మీడియటల్‌లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించారు. డిగ్రీ పూర్తి చేసిన తర్వాత సివిల్స్ పై దృష్టి సారించారు. కోవిడ్ సమయంలో ఇంటి వద్దనే ఉంటూ ఆన్లైన్ శిక్షణ తీసుకున్నారు.

  ఇదీ చదవండి : సివిల్స్ లో మెరిసిన తెలుగు తేజం.. ఐదో ప్రయత్నంలో అద్బుతం విజయం.. ఎలా సాధ్యమైందంటే?

  నారాయణ ఐఏఎస్‌ అకాడమీ(Narayana IAS Academy) నుంచి మనీషా రెడ్డి శిక్షణ తీసుకున్నారు. తొలి ప్రయత్నంలో విఫలమైనా రెండో ప్రయత్నంలో విజయం సాధించారు. హిస్టరీ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జియోగ్రఫీ సబ్జెక్టులు ఆప్షనగా ఎంచుకున్నారు. అకాడమీ పుస్తకాలతో పాటు వివిధ పోటీ పరీక్షల పుస్తకాలు జీకే, కరెంటు అఫైర్స్ వంటివి బాగా చదివేవారు.

  ఇదీ చదవండి : మండు వేసవిలో చల్లని ప్రయాణం కోరుకుంటున్నారా? అలలపై తేలిపోండిక.. ఎన్నిరోజుల ప్రయాణం? ఖర్చు ఎంతంటే? పాస్ పోర్ట్ అవసరం లేదు

  పాఠశాల స్థాయిలోనే సామజిక సేవలో ఎక్కువగా పాల్గొనేదాన్ని  మనీషా అంటున్నారు.  నాణ్యమైన విద్యను తన తల్లి తండ్రులు ఇవ్వగలిగారు అదే తనను  ఈ స్థాయికి తీసుకొచ్చిందని..  చదివిన అరుగంటలైన ఇష్టంగా కస్టపడి చదివానన్నారు.  ముఖ్యంగా మానసికంగా దృఢంగా ఉండేదాన్నని. మొదటి ప్రయత్నంలో విఫలమైనప్పుడు తనకో స్పష్టత వచ్చింది. అందుకే రెండో ప్రయత్నంలో దాన్ని అదిగమించి ర్యాంక్ సాదించాను అన్నారు.

  ఇదీ చదవండి :డిప్యూటీ స్పీకర్ కు చుక్కలు.. మందిమార్బలంతో కాదు ఒక్కరు రండి అని నిలదీసిన మహిళ

  సమాజానికి ఏదైనా చేయాలి అన్నదే లక్ష్యం
  ఇష్టంగా చదివితే లక్ష్యం ఎంత పెద్దదయినా సాధించవచ్చు అంటారు మనీషారెడ్డి. తను పుట్టిపెరిగిన వాతావరణమే తనను సివిల్స్‌ వెళ్లేలా చేసిందని మనీషా తెలిపారు. సమాజానికి ఏదైనా చేయాలనే లక్ష్యంతోనే సివిల్స్ ఎంచుకున్నానంటున్నారు. ప్రజలకు నాణ్యమైన విద్యా వైద్యం ఇవ్వాలనదే తన ఆలోచన అన్నారు.

  ఇదీ చదవండి : గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు సర్కార్ షాక్.. నిరసనలకు సిద్ధమయ్యే యోచనలో సిబ్బంది..

   సివిల్స్‌ చదవాలనుకునే వాళ్లకు సూచన

  విద్యార్థులు ప్రతి నిమిషం విలువైనదిగా భావించాలి. యువత నిరాశ నీస్పృహ లకు దూరంగా ఉంటూ ఒకటికి రెండుసార్లు ప్రయత్నించాలి అప్పుడే మంచి ఫలితాలు సాధించి భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయికి చేరుకోగలము అంటున్నారు. మానసికంగా దృఢంగా ఉండాలి అని ఇతర విద్యార్థులకు ఆమె సూచిస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Civil Services, Farmers, Kurnool

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు