హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

మీ మొబైల్‌ ఫోన్‌ పోయిందా.. అయితే ఇలా చేయండి..! మీ ఫోన్ కచ్చితంగా దొరుకుతుంది..!

మీ మొబైల్‌ ఫోన్‌ పోయిందా.. అయితే ఇలా చేయండి..! మీ ఫోన్ కచ్చితంగా దొరుకుతుంది..!

సెల్

సెల్ ఫోన్ రికవరీకి కర్నూలు పోలీసుల వినూత్న కార్యక్రమం

కర్నూలు జిల్లా (Kurnool District) వ్యాప్తంగా మొబైల్ ఫోన్‌ (Mobile Phones) లు పోగొట్టుకున్న భాదితులకు..వాళ్ల వాళ్ల ఫోన్‌లను రికవరీ చేశారు పోలీసులు. దాదాపు 564 ఫోన్లు రికవరీ చేశారు జిల్లా పోలీసులు.

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  కర్నూలు జిల్లా (Kurnool District) వ్యాప్తంగా మొబైల్ ఫోన్‌ (Mobile Phones) లు పోగొట్టుకున్న భాదితులకు..వాళ్ల వాళ్ల ఫోన్‌లను రికవరీ చేశారు పోలీసులు. దాదాపు 564 ఫోన్లు రికవరీ చేశారు జిల్లా పోలీసులు. ఎవరి ఫోన్‌ను వాళ్లకు జాగ్రత్తగా అప్పగించారు. సెల్ ఫోన్‌ల చోరీ, వాటి పరిష్కారంపై కర్నూలు జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి రుసుము చెల్లించకుండా ఉచితంగా కూడా కర్నూలు పోలీసు వెబ్ సైట్‌కు వెళ్ళి పొగొట్టుకున్న సెల్‌ఫోన్ వివరాలు అందజేస్తే రికవరీ చేసేందుకు కృషి చేస్తామన్నారు. డీజీపీ ప్రభుత్వం ఆదేశాల మేరకు మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. నేరాల నివారణకు పోలీసు పెట్రోలింగ్ ముమ్మరం చేసి, తనిఖీలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నెల మొబైల్ రికవరీ మేళా నిర్వహిస్తామన్నారు.

  ప్రజల్లో అవగాహన పెంచేందుకు మొబైల్ ఫోన్ పోతే మీ – సేవాకు వెళ్ళి ఎలా కంప్లైంట్‌ చేయాలో కర్నూలు జిల్లా పోలీసులు తెలియజేయనున్నారు. మొబైల్ ఫోన్‌పోతే మీ – సేవాకు వెళ్ళి ఎలా అఫ్లై చేయాలో వాల్ పోస్టర్‌తో ఆవిష్కరణ చేశారు. లాస్ట్ మొబైల్ ట్రాకింగ్ సర్వీస్ (Lost Mobile Tracking Service) పోస్టర్‌ను ప్రతి గ్రామా సచివాలయాల్లో మహిళా పోలీసులచే అతికించనున్నారు.

  ఇది చదవండి: దోశ ప్రియులకు అదిరిపోయే న్యూస్‌..! అక్కడ దొరికే వెరైటీ దోశలు చూస్తే మతిపోవాల్సిందే..!

  కర్నూలు పోలీసు సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీకి, పోలీసు యంత్రాంగానికి బాదితులు కృతజ్ఞతలు తెలిపారు. సెల్‌ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం ఆనందంగా ఉందని మిట్టకందాల గ్రామానికి చెందిన స్కూల్ టీచర్ విశ్వప్రసాద్, కర్నూలుకు చెందిన శ్రీ లక్ష్మీ తెలిపారు.

  ఇది చదవండి: వరదలొస్తే వాళ్లకు పండగే..! ఎర్రనీళ్లలో ఎన్నో రకాల చేపలు..! తింటే ఎన్నో లాభాలు..!

  మీ మొబైల్ ఫోన్ పోయిందా ..అయితే దగ్గర్లోని మీ సేవా కేంద్రాలకు వెళ్ళి ఈ క్రింది వివరాలు అందించినట్లయితే మీ మొబైల్‌ను పోలీసులు రికవరీ చేసేందుకు ఉపయోగపడుతుంది.

  ఇది చదవండి: అక్కడ పండే మొక్కజొన్న టేస్ట్ మరెక్కడా రాదు.. అంత ఫేమస్ ఎందుకంటే..!

  1) మీ - సేవా నందు ఎలా అప్లై చేయాలి…?1) మీ - సేవా నందు ఎలా అప్లై చేయాలి…?

  • మీరు పోగొట్టుకున్న ప్రదేశం, తేదీ వివరాలు

  • మీరు పోగొట్టుకున్న మొబైలు/సెల్ ఫోన్ యొక్క IMEI వివరాలు.

  • మీరు పోగొట్టుకున్నప్పుడు ఉపయోగించిన మొబైలు నెంబర్ వివరాలు

  • మీకు సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు కార్డ్, చిరునామా ,పేరు మొదలగు వివరాలు

  • మిమ్మల్ని సంప్రదించడానికి మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న కాంటాక్ట్ వివరాలు (మీది కానీ, మీ కుటుంబసభ్యులది కానీ)

  ఈ వివరాలు మీరు మీ-సేవా నందు సమర్పించి Missing /lost articles రుసుమును చెల్లించి , సదరు మీ-సేవా రసీదును తమ పరిధిలోని సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఇవ్వాలి.

  ఇది చదవండి: అందమైన బుట్ట బొమ్మలు..! మనసును దోచే వయ్యారిబొమ్మలు..! కావాలంటే అక్కడికెళ్లాల్సిందే..!

  2) LOST MOBILE TRACKING SERVICE LINK…

  kurnoolpolice.in/mobiletheft ఈ లింకును క్లిక్ చేసి ఆ వివరాలను ఎంటర్‌ చేయండి. మీ మొబైల్‌ను తిరిగి పొందండి.

  ఇచ్చిన లింక్ ను క్లిక్ చేసి మొబైల్ LOST కాలమ్ నందు ఈ క్రింది వివరాలను… మీ పేరు, మీ జిల్లా , మీ పోలీస్ స్టేషన్ పరిధి, మీ మొబైల్‌ కు సంబంధించిన IMEI-1, IMEI- 2 వివరాలు, మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్న మొబైలు నంబర్ /Alternate కాంటాక్ట్ వివరాలు ఎంటర్‌ చేసి సబ్మిట్‌ చేయాలి.

  ఈ విధంగా మీరు ఫిర్యాదు చేస్తే.. పోలీసులు మీ మొబైల్‌ను మీకు తిరిగి తెప్పించి ఇవ్వగలరని జిల్లా ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News

  ఉత్తమ కథలు