హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

దసరా వస్తే చాలు అందరి చూపు అటువైపే.. తలలు పగిలి రక్తం కారాల్సిందే..!

దసరా వస్తే చాలు అందరి చూపు అటువైపే.. తలలు పగిలి రక్తం కారాల్సిందే..!

దేవరగట్టులో

దేవరగట్టులో బన్నీ ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి

Kurnool: బన్నీ ఉత్సవానికి పెద్ద చరిత్రే ఉంది. దసరా వచ్చిందంటే అక్కడి భక్తుల్లో భక్తి కట్టలు తెంచుకుంటుంది. కర్రలు స్వైర విహారం చేస్తాయి. ఉత్సవమూర్తుల కోసం వేలాది మంది సమరానికి సై అంటారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  కళ్లలో భక్తి పరవశం.. కర్రల్లో పౌరుషం.. వెరసి రక్తాభిషేకం..! అదే దేవరగట్టు బన్నీ ఉత్సవం..! ప్రతి ఏటా భక్తి పేరుతో విజయదశమి రోజు కర్రల సమరం జరుగుతుంది. ఈ సమరంలో కర్రలు కరాళ నృత్యం చేస్తాయి. దసరా అంటే దేశమంతా సంబరం. కానీ అక్కడ మాత్రం సమరం! ఒళ్లు విరుచుకునే వీరావేశం! పూనకంతో తలలు బద్దలు కొట్టుకునే ఆచారం. అందుకు ఈ ఏడాది కూడా అతీతం కాదు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) దేవరగట్టులో తరతరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని కొనసాగిస్తామంటున్నారు నిర్వాహకులు. ఈ క్రమంలోనే ఈసారి బన్నీ ఉత్సవ ఏర్పాట్లపై గ్రామస్తులతో అధికారులు సమావేశమయ్యారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సారి కూడా బన్ని ఉత్సవాలను ప్రశాంతంగా జరిపేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు.

  కర్రలతో తలపడే ఈ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా, ఎలాంటి రక్తపాతాలకు తావులేకుండా జరుపుకోవాలని ప్రజలకు అధికారులు సూచించారు.

  ఇది చదవండి: ఇంద్రకీలాద్రికి వెళ్లే భక్తులకు అక్కడ మరో ముఖ్యమైన మునేశ్వరుడు ఉన్నాడని తెలుసా..!

  దేవరగట్టు మాల మల్లేశ్వరస్వామి బన్నీ ఉత్సవాలు (కర్రల సమరం) నిర్వహణపై కర్నూలు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ భవనంలో అధికారులు సమీక్ష నిర్వహించారు. బన్నీ ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. బన్నీ ఉత్సవాల్లో (కర్రల సమరంలో) పాల్గొనే వివిధ గ్రామాల ప్రజలు సంప్రదాయం ప్రకారం ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని జిల్లా అధికారులు సూచించారు.

  ఇది చదవండి: కోర్కెలు తీర్చే కొంగు బంగారం కనకదుర్గ.. ఇంద్రకీలాద్రికి అంతటి విశిష్టత ఎందుకు..?

  కర్నూలు జిల్లాలో బన్నీ ఉత్సవానికి పెద్ద చరిత్రే ఉంది. దసరా వచ్చిందంటే అక్కడి భక్తుల్లో భక్తి కట్టలు తెంచుకుంటుంది. కర్రలు స్వైర విహారం చేస్తాయి. ఉత్సవమూర్తుల కోసం వేలాది మంది సమరానికి సై అంటారు. దేవరగట్టుకొండ ప్రాంతంలోని 11 గ్రామాల ప్రజలు సంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. దసరా పండుగ రోజు అర్థరాత్రి కొండపై ఉన్న మాలమల్లేశ్వస్వామికి కళ్యాణం జరుగుతుంది. అనంత మాల సహిత మల్లేశ్వరస్వామి విగ్రహాలను పల్లకిలో ఊరేగింపుగా తీసుకెళ్తారు.

  ఇది చదవండి: అక్కడికి ఒక్కసారి వెళ్తే మీ ఇల్లు నందన వనమే..! అందుకే మహిళలు క్యూ కడతారు..!

  ఆ విగ్రహాలకు మూడు గ్రామాల ప్రజలు రక్షణగా నిలుస్తారు. ఒక వర్గం వారు విగ్రహాల్ని తీసుకు వెళ్తుంటే.. మరో వర్గం వారిని ఆపే ప్రయత్నం చేస్తారు. ఇలా రెండు వర్గాల మధ్య కర్రల సమరం నడుస్తుంది. అనంతరం విగ్రహాల్ని తిరిగి దేవరగట్టు మీద ఉంచటంతో ఉత్సవం పూర్తి అవుతుంది. ఇందులో వందలాది మంది తలలు పగులుతాయి.

  అయినా లెక్క చేయకుండా కర్రల సమరానికి సై అంటారు. ఈ సారి బన్నీ ఉత్సవాలను ఈ నెల 30 నుంచి 6 వరకు నిర్వహించాలని నిర్వాహకులు నిర్ణయించారు. మరి అధికారులు తీసుకునే కఠిన చర్యలు వల్ల అయినా ఈ సారి కర్రల సమరంలో ప్రశాంత వాతావరణంలో బన్నీ ఫైట్ జరుగుతుందో లేదో వేచి చూడాలి మరి.

  Kurnool Devaragattu Temple Map

  ఎలా వెళ్లాలి: కర్నూలు నుంచి కోడుమూరు మీదగా ఆలూరు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఆలూరు బస్టాండ్ అంబేద్కర్ సర్కిల్ నుంచి కుడివైపు 15 కిలోమీటర్లు దూరంలో ఉంటుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Dussehra 2022, Kurnool, Local News

  ఉత్తమ కథలు