హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్..! ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి..

AP SSC Exams: టెన్త్ విద్యార్థులకు అలర్ట్..! ఈ రూల్స్ గుర్తుపెట్టుకోండి..

కర్నూలు జిల్లాలో టెన్త్ ఎగ్జామ్స్ కు ఏర్పాట్లు

కర్నూలు జిల్లాలో టెన్త్ ఎగ్జామ్స్ కు ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో టెన్త్ ఎగ్జామ్స్ (AP SSC Exams) కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టూడెంట్స్ కూడా ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో టెన్త్ ఎగ్జామ్స్ (AP SSC Exams) కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టూడెంట్స్ కూడా ప్రిపరేషన్ లో బిజీగా ఉన్నారు. పదో తరగతి పరీక్షలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పకడ్బందీగా, ప్రశాంతంగా నిర్వహించాలని కర్నూలు జిల్లా (Kurnool District) కలెక్టర్ పి.కోటేశ్వరరావు అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో పరీక్షల నిర్వహణపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఏప్రిల్ 03 నుండి 17 వ తేదీ వరకు జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని డీఈఓ రంగా రెడ్డి ని కలెక్టర్ ఆదేశించారు. పరీక్ష కేంద్రంలోకి మొబైల్ని తీసుకెళ్లరాదని, పరీక్ష కేంద్రాల వద్ద 100 మీటర్లలోపు ఎంట్రీ ఇవ్వకుండా స్ట్రిక్ట్ గా ఉండాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

144 సెక్షన్ అమలు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగర ఆర్మ్స్ గార్డ్స్ ని ఏర్పాటు చేయాలని, పేపర్ డిస్ట్రిబ్యూషన్కి ఎస్కార్ట్ తో వెళ్లాలని, పరీక్ష కేంద్రాల పరిధిలో ఉన్న జీరాక్స్ సెంటర్లు మూసివేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరంతరాయంగా విద్యుత్ సౌకర్యం ఉండాలన్నారు. విద్యార్థులు ప్రత్యేకంగా పరీక్షకేంద్రాలకు సరైన సమయానికి చేరుకునే విధంగా అవసరమైన బస్సు సదుపాయాలు కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు.

ఇది చదవండి: యువతకు కేంద్రం గుడ్ న్యూస్.. సబ్సిడీతో రూ.20లక్షల లోన్.. వివరాలివే..

అదేవిదంగా కేంద్రాల దగ్గర మెడికల్ కిట్లు, ఓఆర్ఎస్, 108 ఎమర్జెన్సీ వెహికల్స్, పారా మెడికల్ సిబ్బందిని ఉంచాలని డీఎంహెచ్ ను కలెక్టర్ ఆదేశించారు. ఫ్లైయింగ్ స్క్వాడికి సంబంధించిన ఉత్తర్వులు త్వరితగతిన జారీ చేయాలని డీఈఓ రంగారెడ్డి ఆదేశించారు.

డీఈఓ రంగారెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో పదోవ తరగతి పరీక్షలకు సంబంధించి 149 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.10వ తరగతి పరీక్షలకు జిల్లాలో 32,780 మంది విద్యార్థులు హాజరుకానున్నట్లు వివరించారు.విద్యార్థులు తప్పనిసరిగా పరీక్ష కేంద్రాలకు సరైన సమయానికి హాజరు కావాలని తెలిపారు. పరీక్షలు సమీపిస్తున్న తరుణంలో విద్యార్థులు సమయాన్ని వృథాచేసుకోకుండా బాగా చదివి పరీక్షల్లో మంచి మార్కులతో ఉత్తీర్ణతసాధించాలని తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, AP SSC board exams, Kurnool, Local News