T.Murali krishna, News 18, Kurnool
నంద్యాలలో కలకలం రేపిన కానిస్టేబుల్ హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిందితులను(criminals) అరెస్ట్ చేసి మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ నెల ఏడో తేదిన కానిస్టేబుల్ సురేంద్రనాథ్‌ను చెరువుగట్టు మీదకు తీసుకెళ్లి కొందరు దుండగలు హత్య చేసిన సంగతి తెలిసిందే. పోలీసులు తెలిసిన వివరాల ప్రకారం… ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) గూడూరు సురేంద్రనాథ్ నంద్యాల డీఎస్పీ ఆఫీస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. ఏడో తేది రాత్రి సమయంలో మిరాకిల్ టాటూ షాప్ దగ్గర తొమ్మిది మంది ముద్దాయిలు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో అటుగా బ్యాగ్ కుట్టించేందుకు వెళ్లిన కానిస్టేబుల్ సురేంద్రనాథ్లో గొడవపడ్డారు. మద్యం తాగుతూ ఎందుకు ఇలా గొడవ చేస్తున్నారంటూ కానిస్టేబుల్ వాళ్లను ప్రశ్నించారు. నువ్వు కానిస్టేబుల్‌వి కదా అంటూ రెచ్చిపోయి. మాకు సంబంధించిన సమాచారం పై అధికారులకు చేరవేస్తూ.. తమని ఇబ్బంది పెట్టడే కాకుండా మళ్లీ మమ్మల్నే అంటావా?’ అంటూ సురేంద్రనాథ్‌పై అందరూ కలిసి దాడి చేశారు.
అతనిని కొట్టి వెంబడించి.. తిరుమల ఫర్నిచర్ షాపు దగ్గర పట్టుకొని… దారిలో వెళ్తున్న ఒక ఆటోను ఆపి ఆటో డ్రైవరును కత్తితో బెదిరించారు. అదే ఆటోలోకి సురేంద్రనాథ్‌ను బలవంతంగా ఎక్కించుకొని కిడ్నాప్ చేసి ఆటొలో కత్తులతో పొడిచి.. కొట్టుకుంటూ మహానంది రోడ్డులో గల చెరువు కట్ట వద్ద ఉన్న బంగారు పుట్ట దగ్గరకు తీసుకెళ్లి అక్కడ పిడి బాకులతో విచక్షణ రహితంగా పొడిచారు. తరువాత ముద్దాయిలు ఆటో డ్రైవరు ను బెదిరించి చనిపోయిన సురేంద్రనాథ్‌ను ఆటోలో నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లమన్నారు.
మృతుడి తమ్ముడి ఫిర్యాది మేరకు నంద్యాల్ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి DIG కర్నూలు రేంజ్ సెంథిల్ కుమార్, నంద్యాల SP కే. రఘువీర్ రెడ్డి పర్యవేక్షణలో,డీస్పీ ఆద్వర్యంలో ఆదివారం ఉదయం 11.45 గంటలకు కర్నూలు రింగు రోడ్డులో ఉన్న టిడ్కో ఇళ్ల వద్ద..8 మంది ముద్దాయిలను అరెస్టు చేశారు. వారి నుంచి మూడు పిడి బాకులు, ఐదు మోటార్ సైకిళ్ళు, 8 సెల్ ఫోనులు( accused), Deceased cell phoneలను స్వాధీనం చేసుకున్నారు.
ముద్దాయిల వివరాలు:
కల్లూరి వెంకట సాయి(26) అలియాస్ కవ్వ, దైవందిన్నె మౌళికిశోర్(25), గోసుల విజయ్(23), ఆళ్లగడ్డకు చెందిన దూదేకుల సుభాన్‌బాషా(24), నంద్యాలలోని బొమ్మలసత్రంకాలనీకి చెందిన మాలిక్‌బాషా అలియాస్ చిన్నబాషా(26), సంజీవనగర్‌కు చెందిన బండి మహేంద్ర(32), బంతలవీధికి చెందిన షేక్ మహబూబ్‌బాషా అలియాస్ మాబాషా(23), సరస్వతినగర్‌కు చెందిన యడవలి కల్యాణ్(25)
Read this also: Vizag: తెల్లవారుజామున వాకింగ్ వెళ్తున్నారా..? బీకేర్ ఫుల్ అంటున్న వాకర్స్..? అక్కడ ఏం జరుగుతోంది?
పోలీసులకే రక్షణ లేకుండా పోయిందంటూ ప్రజల్లో భయాందోళనలు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. పోలీసులు చాలా సీరియస్‌గా తీసుకుని కేసును వేగవంతంగా దర్యాప్తు చేశారు. కర్నూలు రింగురోడ్డు వద్ద ఎనిమిది మంది నిందితులను అరెస్ట్ చేశామని..మరో నిందితుడు పెద్ద రాజశేఖర్ పరారీలో ఉన్నాడని, అతన్నీ త్వరలోనే అరెస్ట్ చేస్తామని డీఐజీ సెంథిల్ కుమార్ తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Crime news, Kurnool, Local News