(T. Murali Krishna, News18, Kurnool)
Crime News: కాస్త ధనవంతులైనా.. లేక రాజకీయ పలుకబడి ఉన్నా.. పోలీసులతో పరిచయాలు.. లేక ఇతర సంబంధాలు ఏవైనా ఉంటే.. ఏ కేసు నుంచి అయినా బయట పడిపోవచ్చన్నది చాలామంది ధీమా.. చాలాచోట్ల ఇలా జరుగుతూనే ఉంది. ఆ మధ్య కర్నూలు జిల్లా (Kurnool)లోనూ అలాంటి ఘటనే జరిగింది. అసలేం జరిగింది అంటే..? 2020లో ఏడాదిలో చిన్న పీరయ్య యాదవ్ శ్రీశైలం (Srisailam) లోని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో.. అదే ఏడాది జులై 6వ తేదీన సున్నిపెంట వేద పాఠశాలలో విద్య నభ్యసించే 13 ఏళ్ల తిరుమల మధుకుమార్ శర్మ అనే బాలుడు మృతి చెందాడు.
గురువులు చెప్పిన మాట వినటంలేదని వేద పాఠశాలకు చెందిన గురువు మానసికంగా వేధింపులకు గురిచేసి చిత్రహింసలకు గురిచేయడంతోనే మధుకుమార్ శర్మ మృతి చెందాడని అప్పట్లో తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ బాలుడు అనుమానాస్పద మృతి కింద ఎస్సై పీరయ్యయాదవ్ కేసు నమోదు చేయటం అప్పట్లో వివాదాస్పదంగా మారింది.
నిజానికి ఈకేసుల్లో 304 (2) సెక్షన్ కింద కేసు నమోదు చేయాల్సి ఉండగా ఎస్ఐ పీరయ్య నిందితులతో కలిసి 174 సెక్షన్ కింద కేసు నమోదు చేయటంపై పలు విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ విషయాన్నికొత్తగా వచ్చిన ఆత్మకూరు డీఎస్పి శృతి దృష్టికి బాలుడి తల్లి దండ్రులు తీసుకెళ్లగా డీఎస్పీ బాధితుల పిర్యాదు మేరకు కేసునుసీరియస్ గా తీసుకుని ఆ కేసును పరిశీలించాల్సింగా..? ప్రస్తుతం నందికొట్కూరు రూరల్ సీఐగా విధులు నిర్వహిస్తున్న సుధాకర్ రెడ్డిని విచారణ అధికారిగా నియమించి వాస్తవాలను వెలికి తీయించారు.
ఇదీ చదవండి : వైసీపీకి కొత్త జిల్లాలు రాజకీయంగా కలిసి రాలేదా..? అసలు సమస్య ఏంటంటే?
విచారణలో భాగంగా వాతలు పెట్టడం వల్లే మధు కుమార్ శర్మ మృతి చెందినట్లు శవ పరీక్షలో తేలింది. సీఐ సుధాకర్ రెడ్డి విచారణలో ఒకే విధంగా రుజువు కావడంతో డీఎస్పీ శృతి నివేదికను ఉన్నతాధికారులకు పంపడంతో ఎస్ఐ పీరయ్యపై సస్పెండ్ వేటు వేశారు. ఇదే తరహాలో ప్రస్తుతం ఆదోని మూడో పట్టణంలో విధులు నిర్వహిస్తున్న సీఐ చంద్రబాబు 2020లో నంద్యాల జిల్లా, బ్రాహ్మణకొట్కూరు ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న సమయంలో దామగట్ల గ్రామానికి చెందిన మాసుంవలి హత్యకు గురి కాగా ఆ హత్యను అప్పట్లో ఎస్సై చంద్రబాబు హెడ్ కానిస్టేబుల్ చేత అనుమానాస్పద మృతి కింద (సీఆర్పీసీ 174) సెక్షన్ కింద ఎస్సై కేసు నమోదు చేయించారు. అయితే వాస్తవంగా హత్యగా కేసు నమోదు చేయాల్సిన సమయంలో ఎస్సై నిందితులతో కుమ్మక్కై అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేశారన్న విమర్శలు వెలువత్తాయి. దీంతో హత్య గురైన బాధితులబంధువుల ఫిర్యాదు మేరకు అధికారులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో బిగ్ ట్విస్ట్.. రెబల్ ఎంపీకి నోటీసులు.. ఎంత ఆఫర్ చేశారంటే..!
ఈ విచారణలో భాగంగా శవపరీక్షలో హత్యగా నిర్ధారణ కావడంతో సీఐ చంద్రబాబుపై కూడా సస్పెండ్ వేటువేస్తూ జిల్లా ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో జిల్లాలోని పోలీసులలో ఒకేసారి సీఐ, ఎస్ఐలపై సస్పెండ్ వేటు పడడంతో పోలీస్ డిపార్ట్మెంట్లో ఈవిషయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Kurnool, Local News