హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

పోలీస్‌స్టేషన్‌లో చోరీ.. ఏకంగా 75లక్షల నగలు మాయం..

పోలీస్‌స్టేషన్‌లో చోరీ.. ఏకంగా 75లక్షల నగలు మాయం..

పోలీస్ స్టేషన్ లో చోరీ ఘటన

పోలీస్ స్టేషన్ లో చోరీ ఘటన

Andhra Pradesh: కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద సెబ్‌ సీఐ లక్ష్మీదుర్గయ్య 2021 జనవరి 28వ తేదీన వాహనాలు తనిఖీ చేస్తుండగా. అనుమానంతో హైదరాబాద్‌ వైపు నుంచి వస్తున్న తమిళనాడు రిజిస్ట్రేషన్‌ గల కారును ఆపి తనిఖీ చేశారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

కర్నూలు మండలం పంచలింగాల చెక్‌పోస్టు వద్ద సెబ్‌ సీఐ లక్ష్మీదుర్గయ్య 2021 జనవరి 28వ తేదీన వాహనాలు తనిఖీ చేస్తుండగా. అనుమానంతో హైదరాబాద్‌ వైపు నుంచి వస్తున్న తమిళనాడు రిజిస్ట్రేషన్‌ గల కారును ఆపి తనిఖీ చేశారు. అందులో 105 కిలోల వెండి ఆభరణాలు, రూ.2.05 లక్షల నగదును గుర్తించారు. వీటికి ఎలాంటి ఆధార పత్రాలు లేకపోవటంతో తనిఖీ అధికారులు సొత్తును సీజ్‌ చేసి అప్పటి కర్నూలు తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌ సీఐ విక్రమ్‌సింహాకు అప్పగించారు.

వాటిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నగదును ఆభరణాలను వాణిజ్య పన్నుల శాఖకు గాని ఆదాయ పన్నుల శాఖకు అప్పగించలేదు. పోలీసు అధికారులు సదరు సొత్తును పోలీసు స్టేషన్‌లోని బీరువాలో ఉంచారు. పోలీస్ స్టేషన్లోనే ఆ బీరువాను మహిళా కానిస్టేబుల్‌కు పర్యవేక్షణా బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.ఆ తర్వాత తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సీఐ విక్రమ్‌సింహా బదిలీ అయిన తర్వాత సీఐ కంబగిరి రాముడు కొంతకాలం పనిచేసి అవినీతి ఆరోపణల కారణంగా సస్పెండ్‌ అయ్యారు.

ఆతర్వాత 2022 మార్చి నెలలో ఆ స్థానంలో సీఐ శేషయ్య సదరు స్టేషన్‌ సీఐగా బాధ్యతలు చేపట్టారు. 2022 నవంబరులో సీఐ శేషయ్య బదిలీ కాగా ఆ స్థానంలో బదిలీపై సీఐ రామలింగయ్య బాధ్యతలు చేపట్టారు అప్పటి వరకు వెండికి సంబంధించిన వ్యాపారులు స్టేషన్‌కు రాలేదు. కానీ ఈనెల 27వ తేదీన వెండి యజమానులైన వ్యాపారులు శాతనభారతి, మణికందన్‌ న్యాయస్థానం నుంచి అనుమతి పొంది కర్నూలు తాలుకా అర్బన్‌ స్టేషన్‌కు వచ్చి సొత్తు అప్పగించమని అడిగారు. సీఐ రామలింగయ్య బీరువా తెరిచి చూసి కంగుతిన్నారు.బీరువా తెరిచి చూడగా అందులో అసలు బీరువాలో 105 కిలోల వెండిగానీ, ఎలాంటి డబ్బుగానీ లేకపోవటంతో కంగు తిన్నారు.

దీంతో తాలుకా అర్బన్‌ పోలీసుస్టేషన్‌ 105 కిలోల వెండిని తస్కరించిన ఇంటి దొంగలు ఎవరన్నది మిస్టరీగా మారింది. 2021 నుంచి సీఐ విక్రమ్‌సింహాతో సహా ముగ్గురు సీఐలు బదిలీ అయి ప్రస్తుతం నాలుగో సీఐగా రామలింగయ్య పనిచేస్తున్నారు. అధికారులతోపాటు సిబ్బంది పలువురు బదిలీ అయ్యారు. ఏ సీఐ హయాంలో వెండి అపహరణకు గురైందనేది అంత చిక్కనటువంటి పరిస్థితి. గతంలో మద్యం సీసాలు తస్కరించినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న హెడ్‌కానిస్టేబుల్‌పై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెండి అమ్ముకుని సొమ్ము చేసుకుని ఉంటారని అనుమానిస్తున్నారు. కాగా ఈ విషయంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేసి నిందితులను అదుపులోకి తీసుకొని తమ సొమ్మును తిరిగి ఇవ్వాలని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Kurnool, Local News

ఉత్తమ కథలు