Murali Krishna, News18, Kurnool
Crime News: వీళ్లంతా కేవలం నేరగాళ్లు కాదు.. కేటుగాళ్లు కూడా.. చాలా డేంజర్ అని పోలీసులే చెబుతున్నారు. ఎందుకంటే పదే పదే అదే పని చేస్తూ పోలీసులుకు చిక్కుతున్నారు.. శిక్ష అనుభవిస్తున్నారు. అయినా అదే పని చేస్తున్నారు. దీంతో కర్నూలు జిల్లాలో ఎనిమిది మందిపై పీడీయాక్ట్ కేసు నమోదు చేసినట్లు జిల్లా పోలీసులు తెలిపారు. తరచూ వివిధ నేరాలకు పాల్పడుతూ ఈజీ మనికి అలవాటు పడి నేరాలు చేస్తున్నటువంటి 8 మందిపై కేసు నమోదు చేసి వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించనున్నట్లు పోలీసులు తెలిపారు. వీళ్లకు ఎన్ని సార్లు.. ఎన్ని రకాలుగా శిక్షించినా మార్పు కనిపించడం లేదంటూ పోలీసులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఆ ఎనిమిది మంది ఎవరు.. వారిపై ఏఏ కేసులు ఉన్నాయి.. అయినా ఒక కేసులో దొరికాక.. మళ్లీ ఈజీగా ఎలా బయటకు వస్తున్నారు. పదే పదే అదే పని ఎలా చేస్తున్నారు అనే అనుమానాలు వస్తున్నాయా.. అయితే వీరి కేసుల బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే...
1) బోయ నాగరాజు @ భూంపల్లి నాగరాజు...వయస్సు: 45 సం, తండ్రి: బోయ నరసన్న (లేట్), భావాజీ పేట, వాల్మీకి నగర్, ఆదోని టౌన్, కర్నూల్ జిల్లా. (రౌడీషీట్ నం. 715)ఇతనిపై మొత్తం 14 క్రిమినల్ కేసులు ఉన్నాయి.
ఆదోని ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ లో 2 ప్రోహిబిషన్ కేసులు, ఆదోని రెండవ పట్టణ పోలీసు స్టేషన్లో 3 కేసులు,హాలహర్వి పోలీసుస్టేషన్ లో 1 కేసు ఆదోని సెబ్ పోలీసు స్టేషన్ లో 4 కేసులు, ఆదోని ఒకటవ పట్టణ పోలీసు స్టేషన్ లో 4 IPC కేసులు.
ఇదీ చదవండి : యమలోకానికి షార్ట్ కట్స్ ఇవే..! డేంజర్ అని తెలిసినా.. అధికారులకు పట్దదా..?
2) బోయ కోతుల రామనాయుడు...(రౌడీ షీట్ నెంబర్ 538). క్రిష్ణగిరి పోలీసుస్టేషన్లో ఇతనిపై మొత్తం 6 కేసులు ఉన్నాయి. 3) వడ్డె రామాంజనేయులు @ అంజి...ఇతని పై మొత్తం 10 కేసులు ఉన్నాయి.కర్నూలు 3 వ పట్టణ పోలీసుస్టేషన్లో 1 కేసు.కర్నూలు 4 వ పట్టణ పోలీసుస్టేషన్లో 09 కేసులు ఉన్నాయి. 4) ఎరుకలి పోలేంటి సత్యం...(రౌడి షీట్ నెంబర్ 208) ఇతనిపై మొత్తం 14 కేసులు ఉన్నాయి.కర్నూలు 3 వ పట్టణ పోలీసుస్టేషన్లో 9 కేసులు.కర్నూలు4 వ పట్టణ పోలీసుస్టేషన్లో 05 కేసులు ఉన్నాయి.
ఇదీ చదవండి : లాభాలు రావాలి అంటే ఈ పంట వేయాల్సిందే..? పెట్టుబడి తక్కువే..
5) గుర్రాల క్రాంతి కుమార్...కర్నూల్ టౌన్ కర్నూలు జిల్లా (రౌడీ నం.293). ఇతని పై మొత్తం 15 కేసులు ఉన్నాయి.కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్లో 1 కేస.కర్నూలు 4వ పట్టణ పోలీసుస్టేషన్లో 14 కేసులు ఉన్నాయి. 6) పటాన్ ఇమ్రాన్ ఖాన్ S/O లేట్ పటాన్ నజీర్...వయస్సు: 25 సంలు., కర్నూలు IV టౌన్ PSలో సస్పెక్ట్ షీట్ నం.216,ఇతని పై మొత్తం 17 కేసులు ఉన్నాయి.కర్నూలు నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్ లో 8 కేసులు,
కర్నూలు 3 టౌన్ పోలీసుస్టేషన్ లో 5 కేసులు,ఉలిందకొండ పోలీసుస్టేషన్ లో 3 కేసులు,కర్నూలు తాలుకా పోలీసుస్టేషన్లో 1 కేసు.
ఇదీ చదవండి : సాగరతీరంలో అద్భుత విన్యాసాలు.. అదుర్స్ అనిపిస్తున్న నేవీ రిహార్సల్స్
7) భీసన్నగారి రామాంజనేయులు...వయస్సు: 35సం, కర్నూల్ జిల్లా, ఆంధ్రప్రదేశ్ (రౌడీ షీట్ నంబరు.781) ఇతనిపై 5 క్రిమినల్ కేసులు ఉన్నాయి.వెల్దుర్తి పోలీసుస్టేషన్ లో 4 కేసులు.క్రిష్ణగిరి పోలీసుస్టేషన్ లో 1 కేసు. 8) ఎరుకల జగన్నాథ నాగన్న @ కుంటి నాగన్న, ...కర్నూల్ జిల్లా రౌడీ షీటర్ నెంబర్; 469. ఇతనిపై 13 క్రిమినల్ కేసులు ఉన్నాయి.ఎమ్మిగనూరు యుపిస్ లో 10 కేసులు.ఎమ్మిగనూరు టౌన్ పిస్లో 2 కేసులు. కోడుమూరు పోలీసుస్టేషన్లో 1 కేసు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Crime news, Kurnool, Local News