(T. Murali Krishna, News18, Kurnool)
కులాల పేరుతో ప్రేమ వివాహాలను కొందరు విచ్చినం చేస్తున్నారు. వివాహానికి కులం అడ్డంకి అవుతుంది. దీంతో ఈ ప్రేమ వివాహల కారణంగా ఎవరో ఒకరు బలి కావాల్సి వస్తోంది. ఈ రోజుల్లో కూడా ఇలాంటి ఘటనలు తరచూ కనిపిస్తూనే ఉన్నాయి. అబ్బాయి అమ్మాయి కులాలు వేరు కావడంతో వారి పెళ్లికి పెద్దలు నిరాకరించడం. పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకోవడం లేక ప్రేమ పెళ్లికి పెద్దలు నిరాకరించారని నెపంతో ప్రేమికులు చనిపోవడం ఇలా వివిధ రకాలైన నేరాలు తరచూ దర్శనమిస్తున్నాయి. తాజాగా కర్నూలు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి యువకుడి ప్రాణం మీదకు వచ్చింది.
కర్నూలు జిల్లా పెద్దక్కడబురు మండలం హెచ్. మురవణి గ్రామానికి చెందిన వీరేష్ అదే గ్రామానికి చెందిన సుకన్య గత కొన్నేలుగా ప్రేమించుకున్నారు. ఈ నేపథ్యంలోనే పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. వీరి ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్ళికి పెద్దలు పెద్దలు నిరకరించారు. కానీ వీరేష్, సుకన్యలు మాత్రం పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. దీంతో అమ్మాయి తరుపు బంధువులు వారి మీద కోపంతో ప్లాన్ ప్రకారం వీరేష్‌ను హత్య చేయాలని కుట్ర పన్ని వీరేష్ ను విచక్షణ రహితంగా వేటకుడవలతో దాడి చేసి పొలాల్లో పడేశారు.
అటుగా వెళుతున్న కొంతమంది స్థానికులు గమనించి బాధితుడుని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వీరేష్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేయడంతో. వీరేష్ భార్య అయినటువంటి సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన వారైనా అమ్మాయి తరపు బంధువులు 10 మందిపై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు.
ఇదీ చదవండి : సింహాచల లక్ష్మీనరసింహ దీక్షలు ప్రారంభం.. ఎలా పాటించాలంటే..!
ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి తన భర్త బలవాల్సి వచ్చిందని బాధితుని భార్య సుకన్య బోరున విలపించడం చుట్టుపక్కల వారిని కలచివేసింది. వెంటనే తనకు న్యాయం చేయాలని.. తన భర్తపై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. కేవలం వేరే కులానికి చెందిన వాడనే కారణంతోనే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రేమించి పెళ్లి చేసుకోవడం నేరమనేలా కొందరు రాక్షసుల్లా మారుతున్నారని ఆయన మండిపడ్డారు.. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడికి యత్నించిన పదిమందిని అదుపులోకి తీసుకొనిదాడి చేయడానికి గల కారణాలను తెలుసుకునే ప్రయత్నంలో పడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Kurnool, Local News