Home /News /andhra-pradesh /

KURNOOL KURNOOL CITY AND HISTORICAL PLACES DECORATED WITH TRI COLORS FULL DETAILS HERE PRN KNL NJ

Kurnool: ఆగస్టు 15న కర్నూలులో ప్రత్యేకతలివే.. తప్పక చూడాల్సిన ప్రాంతాలివే..!

త్రివర్ణ శోభితంగా కొండారెడ్డి బురుజు

త్రివర్ణ శోభితంగా కొండారెడ్డి బురుజు

మన దేశ 75వ స్వాతంత్ర వేడుకలు (75th Independence day Celebrations) దేశవ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఆజాది కా అమృత్ మహోత్సవంలోని (Azadi ka Amrith Mahotsav) భాగంగా దేశంలో ఎటు చూసినా.. త్రివర్ణ పతాక రంగులే.. ఎటు విన్నా దేశభక్తి గీతాలే.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India
    Murali Krishna, News18, Kurnool

    మన దేశ 75వ స్వాతంత్ర వేడుకలు (75th Independence day Celebrations) దేశవ్యాప్తంగా అంబరాన్నంటాయి. ఆజాది కా అమృత్ మహోత్సవంలోని (Azadi ka Amrith Mahotsav) భాగంగా దేశంలో ఎటు చూసినా.. త్రివర్ణ పతాక రంగులే.. ఎటు విన్నా దేశభక్తి గీతాలే. గతంలో ఎన్నడూ లేని విధంగా దేశం మొత్తం మువ్వన్నెల జెండా రంగులను అద్దుకుంది. ప్రతి భారతీయుడు తన ఇంటిపై జెండాలను ఎగరేస్తూ తనకున్న దేశభక్తిని చాటుకుంటున్నాడు. ఇలా దేశ నలుమూలల హర్‌ ఘర్ తిరంగా నినాదమే హోరెత్తుతోంది. మరోవైపు దేశవ్యాప్తంగా ఉన్న చారిత్రక కట్టడాలని మన జాతీయ జెండా రంగులతో ముస్తాబయ్యాయి. ఇందులోని భాగంగా కర్నూలు (Kurnool) లోని చారిత్రాత్మక కట్టడాలు సైతం త్రివర్ణ కాంతులతో వెలిగిపోతున్నాయి.

    చారిత్రాత్మక కట్టడాలు త్రివర్ణ శోభితం..
    400 సంవత్సరాల చరిత్ర గల గోల్ గుమ్మాజ్ మొత్తం త్రివర్ణ కాంతులతో వెలిగిపోతుంది. హంద్రీ నది ఒడ్డున చారిత్రాత్మకమైన గోల్ గుమ్మాజ్‌ను చూడడానికి సందర్శకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు.

    ఇది చదవండి: బాలకృష్ణ-నరసింహస్వామి.. సెంటిమెంట్ మొదలైంది ఇక్కడే..! అందుకే అంత భక్తి..


    త్రివర్ణ వెలుగులతో కొండారెడ్డి బురుజు..!
    కర్నూల్ అంటే ముందుగా గుర్తు వచ్చేది కొండారెడ్డి బురుజు. చారిత్రక కట్టడమైన కొండారెడ్డి బురుజుకు స్వాతంత్ర శోభ సంతరించుకుంది. అజాది కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా కర్నూలు కొండారెడ్డి బురుజును అధికారులు త్రివర్ణ విద్యుత్ కాంతులతో తీర్చిదిద్దారు. దీంతో త్రివర్ణ వెలుగులతో మెరిసిపోతున్న కొండారెడ్డి బురుజును చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.

    ఇది చదవండి: తిరుమలలో అనూహ్య రద్దీ.. టీటీడీ కీలక నిర్ణయం.. భక్తులకు అలర్ట్..


    ఇలా కర్నూలులోని చారిత్రక కట్టడాలే కాకుండా.., ప్రధాన రహదారి కూడళ్లతోనూ అనేక ప్రాంతాలలో త్రివర్ణ వెలుగులతో కూడినటువంటి విద్యుత్ దీపాలను అమర్చారు. కర్నూల్ నగరం మొత్తం త్రివర్ణ కాంతులతో వెలిగిపోతుండడంతో. ప్రజలు పెద్ద ఎత్తున వీటిని తిలకించేందుకు వస్తున్నారు. ఇందులో ముఖ్యంగా ఎన్నడూ లేని విధంగా కర్నూలు కొండారెడ్డి బురుజు, చారిత్రాత్మక కట్టడమైనటువంటి గోల్ గుమ్మజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.

    ఇది చదవండి: వైజాగ్ బీచ్ లో షాకింగ్ సీన్.., నల్లగా మారిన ఇసుక.. కారణం ఇదేనా..?


    అధికారులు సైతం ప్రజలను ఆకట్టుకునే విధంగా కర్నూలు నగరం మొత్తం త్రివర్ణ కాంతులను అద్దినట్లుగా ముస్తాబుచేశారు. జాతీయ జెండా రంగుల విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడంతో ప్రజలు, సందర్శకులు సెల్ఫీలు తీసుకుంటూ తమ మొబైల్ ఫోన్‌లలో పదిలంగా భద్రపరుచుకుంటున్నారు.

    ఇది చదవండి: ఈ దేశమే ఆయన ఇల్లు.. 105 ఏళ్ల వయసులోనూ దేశ సేవే.. స్ఫూర్తినిస్తున్న టీసీ రాజన్ జీవితం..


    ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ – హర్‌ ఘర్‌ తిరంగా’ వేడుకలను ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ఘనంగా జరుపుతోంది. సామాన్య ప్రజలు మొదలు.. ముఖ్యమంత్రి వరకు ప్రతి ఒక్కరూ తమ ఇళ్లపై. వ్యాపార, వాణిజ్య భవనాలపై, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు..ఆఫీస్‌లపై త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేస్తున్నారు. దీని కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు కోటి జాతీయ పతాకాలను ఉచితంగా పంపిణీ చేసింది.



    కర్నూలు నగరానికి తలమానికమైన జగన్నాథగట్టుపై మొదటిసారి 10 అడుగుల వెడల్పు, 30 అడుగుల పొడవున్న జాతీయ పతాకం రెపరెపలాడుతోంది. కర్నూలులో ప్రతి ఇంటిపై జాతీయజెండా గర్వంగా ఎగురుతోంది. చారిత్రక కట్టడాలు, ప్రధాన కూడళ్లు, ఇళ్లు, ఆఫీస్‌లు..ఇలా అన్నిటా ఒకటే జెండా..అదే మన మువ్వన్నెల జెండా.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Independence Day 2022, Kurnool, Local News

    తదుపరి వార్తలు