Home /News /andhra-pradesh /

KURNOOL KURNOOL BOY EFFECTED WITH RARE DISEASE THAT COSTS 18 MILLION RUPEES FOR TREATMENT PER YEAR FULL DETAILS HERE PRN

Rare Disease: యువకుడికి అరుదైన వ్యాధి.. వైద్యానికి ఏడాదికి రూ.2 కోట్లు ఖర్చు..

విజయ్ కుమార్ (ఫైల్)

విజయ్ కుమార్ (ఫైల్)

Kurnool Boy: కోట్లమందిలో దురదృష్టవంతులకు అలాంటి అరుదైన వ్యాధులు వస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లాకు చెందిన ఓ యువకుడికి అలాంటి వ్యాధే వచ్చింది.

  ఈ రోజుల్లో వైద్యం చాలా ఖరీదు. చిన్నపాటి అనారోగ్యం వచ్చి ఆస్పత్రికి వెళ్తే బిల్లు కట్టేందుకు ఆస్తులమ్ముకోవాల్సిన పరిస్థితి. ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో పేదలకు ఖరీదైన వైద్యం అందుబాటులోకి వచ్చింది. ఐతే కొన్ని అరుదైన వ్యాధుల చికిత్స అందించాలంటే ఆ ఖర్చు ఊహలకందదు. కోట్లాది రూపాయల ఆస్తులున్నవారు ట్రీట్ మెంట్ చేయించుకున్నా.. పేదలైతే జీవితంపై ఆశలు వదులుకోవాల్సిందే. లక్షలో ఒకరికి, కోట్లమందిలో దురదృష్టవంతులకు అలాంటి అరుదైన వ్యాధులు వస్తుంటాయి. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) కు చెందిన ఓ యువకుడికి అలాంటి వ్యాధే వచ్చింది. దురదృష్టం వెంటాడటంతో పుట్టినప్పుడే ఆ వ్యాధిని గుర్తించలేకపోయారు. ఇప్పుడా వ్యాధికి చికిత్స చేయాలంటే ఏడాదికి అక్షరాల రెండుకోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.

  కర్నూలు జిల్లా ఆలూరు మండలం మనేకుర్తి గ్రామానికి చెందిన పేదరైతు వి.లక్ష్మీకాంత్‌ కుమారుడు విజయ్‌కుమార్‌ కు అరుదైన వ్యాధి సోకింది. పుట్టిన ఏడాది లోపు నడవాల్సిన వాడు సరిగా నడవలేదు. నడక నేర్చినా మధ్యలో కిందపడుతుండేవాడు. దీంతో తల్లిదండ్రులు అతడ్ని కర్నూలు, హైదరాబాద్ లోని పలు ఆస్పత్రులకు తీసుకెల్లి చికిత్స అందించారు.

  ఇది చదవండి: ఏపీలో మరో బెస్ట్ టూరిస్ట్ స్పాట్.. గోదారమ్మ మణిహారానికి అదనపు హంగులు


  ఎంతమంది డాక్టర్లకు చూపించినా, ఎన్ని మందులు వాడినా విజయ్ మాత్రం కోలుకోలేదు. ఐతే ఇటీవల ఆదోనికి వెళ్లిన న్యూరో ఫిజీషియన్ డాక్టర్ హేమంత్ కుమార్ ఆ యువకుడి గురించి తెలుసుకున్నారు. అతడి వ్యాధి లక్షణాలను అధ్యయనం చేసి జెన్యుపరమైన పరీక్షలు చేయించారు. దీంతో అతడికి అత్యంత అరుదైన స్పైనల్ మస్కులర్ అట్రోఫీ సోకినట్లు గుర్తించారు. ఈ వ్యాధి అన్ని వయసుల్లో ఒకేలా ఉండదు. గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు, పుట్టిన తర్వాత ఏడాదిలోపు, ఏడాదిన్నర లోపు, 30 ఏళ్ల లోపు, 30 ఏళ్ల వయసు తర్వాత ఇలా వివిధ దశలుగా విభజిస్తారు. ఈ వ్యాధికి చికిత్స దాదాపు అసాధ్యమనే చెప్పాలి. పుట్టిన రెండేళ్ల లోపు గుర్తిస్తే జొల్గోన్ స్మా అనే ఇంజెక్షన్ ఇస్తే కోలుకుంటారు. ఐతే దాని ధర లక్ష కాదు రెండు లక్షలు కాదు అక్షరాల 16 కోట్ల రూపాయలు.

  ఇది చదవండి: ఛార్జీలు పెంచినా గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ.. ఇకపై ఆ కష్టాలకు ముగింపు


  ఐతే విజయ్ కుమార్ పుట్టినప్పుడు ఈ వ్యాధిని గుర్తించలేదు. ప్రస్తుతం అతడి వయసు 18ఏళ్లు. ఈ వయసులో 16 కోట్లు పెట్టి ఇంజెక్షన్ తెచ్చినా పనిచేయదని డాక్టర్లు తేల్చారు. ఐతే ఈ వయసులో వ్యాధికి చికిత్స అందించేందుకు స్విట్జర్లాండ్ కు చెందిన ఓ కంపెనీ రిస్టిపాల్మ్ అనే పౌడర్ ను రెండేళ్ల క్రితం కనుగొంది.

  ఇది చదవండి: విద్యార్థులకు అలర్ట్.. అమ్మఒడికి కొత్త రూల్స్ ఇవే..! లేకుంటే డబ్బులు రావు..!


  ఈ మందు కూడా అంత ఆషామాషీగా దొరకదు. 60 మిల్లీ గ్రాముల ప్యాకెట్ ధర రూ.6లక్షలుగా ఉంది. దీనిని రోజుకి 5గ్రాముల చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెలకు రూ.15లక్షలు, ఏడాదికి కోటీ 80 లక్షల వరకు ఖర్చవుతుంది. ఈ మందును దీర్ఘకాలంపాటు రోగికి ఇవ్వాల్సి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. అంతేకాదు ఈ మెడిసన్ బాడీ ఇచ్చే రియాక్షన్స్ ను బట్టి ట్రీట్ మెంట్ కొనసాగిస్తారు. ఈ వ్యాధి ఇప్పటికి దేశంలో 800 మందికి మాత్రమే ఉందని.. జన్యుపరమైన లోపాల వల్ల ఇలాంటి వ్యాధులు వస్తాయని డాక్టర్లు చెబుతున్నారు. ముఖ్యంగా మేనరిక వివాహాలు చేసుకోవడం వల్ల వచ్చే అవకాశముందని పేర్కొన్నారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool

  తదుపరి వార్తలు