హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఆటో కనిపిస్తే చాలు అంతే సంగతులు..

Kurnool: వీళ్లు మామూలోళ్లు కాదు.. ఆటో కనిపిస్తే చాలు అంతే సంగతులు..

వీళ్లకు

వీళ్లకు అటో కనిపస్తే అంతే

Kurnool: వీళ్లంతా మామూలు ముదురులు కాదు.. పొరపాటున వీరికి ఆటో కనిపిస్తే అంతే సంగతులు.. పోలీసులు తాజాగా అరెస్ట్ చేసిన నిందుల విచారణలో సంచలన నిజాలు వెలుగులోకి వచ్చారు. ఈ బ్యాచ్ చేసే పని తెలిస్తే షాక్ అవుతారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

   Murali Krishna, News18, Kurnool.

  వీళ్లు మనుషులు కాదు.. ముదుర్లు.. ఆ విషయంలో స్పెషలిస్టులే అని చెప్పాలి.. ముఖ్యంగా వారికి ఆటో (Auto) కనిపించింది అంటే అంతే సంగతులు.. ఎక్కడైనా  ఇళ్లముందు పార్క్‌ చేసిన ఆటోలే వాళ్ల టార్గెట్‌.. రెక్కీ చేసి అర్థరాత్రుళ్లు వచ్చి ఆటోలను ఎత్తుకెళ్తారు.. ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఈ తరహా  చోరీలు పెరిగినట్టు కేసులు పెరుగుతున్నాయి. వెంటనే రాష్ట్రం దాటించి డిస్పోజల్‌ చేసి ఏ పార్ట్‌కు ఆ పార్ట్‌ అమ్ముకుంటారు. ఇదంతా ఏదో పెద్ద ముఠా చేస్తుందనుకుంటే పొరపాటే. కేవలం ఇద్దరు వ్యక్తులు.. జల్సాలకు అలవాటు పడి డబ్బుకోసం తప్పుదారి పట్టిన యువకులను ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.

  కర్నూలు జిల్లా (Kurnool District) లో ఆటో దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, 14 ఆటోలను రికవరీ చేసిన వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలోని పేరడ్ మైదానంలో కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ సిద్దార్థ్ కౌశల్ (Siddarth Kousal) వెల్లడించారు.

  జిల్లా వ్యాప్తంగా, కర్నూలు పట్టణంలో నేరాల పై ప్రత్యేక దృషి సారించి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేక క్రైమ్ టీం లను ఏర్పాటు చేసి రాత్రి సమయంలో గస్తీని పెంచారు. మద్యానికి అలవాటు పడి ఆటో దొంగతనాలను పాల్పడుతున్న ఇద్దరు యువకులను కర్నూలు నాల్గవ పట్టణ పోలీసులు అరెస్టు చేశారని ఎస్పీ తెలిపారు.

  ఇదీ చదవండి :తొలి సీఎంగా జగన్ కు గుర్తింపు.. వెయ్యేళ్ల చారిత్రక నేపథ్యం ఏంటో తెలుసా..?

  రాత్రి వేళల్లో ఇళ్ళ దగ్గర పార్కింగ్ చేసిన ఆటోల ఇగ్నిషియం మెకానిజంను ట్యాంపర్ చేసి వాటిని దొంగలిస్తారు. కర్నూలు, పక్క జిల్లాలలో కూడా ఆటోలను దొంగలించి హైదరాబాద్‌కు తీసుకెళ్లి అక్కడ డిస్పోజల్ చేస్తారని ఎస్పీ తెలిపారు. నిందితులు హైదరాబాద్‌కు చెందిన సయ్యద్‌ సమీర్‌(33), మహమ్మద్‌ అలీం(26)గా గుర్తించారు. నిందితులను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ పంపామన్నారు. వీరిద్దరిపై మొత్తం 10 కేసులలో 6 కేసులు తెలంగాణ , 4 కేసులు విజయవాడలో ఉన్నాయన్నారు.

  ఇదీ చదవండి : దమ్ముంటే కొడుకుపై ప్రమాణం చేయాలి.. లోకేష్ కు మంత్రి రోజా సవాల్.. ఎందుకో తెలుసా?

  2021లో ఒక కేసు, 2022లో 12 కేసులు, మొత్తం 13 కేసులు ఆటో దొంగతనాల పై కర్నూలు 4 వ పట్టణ పోలీసు స్టేషన్‌లో నమోదయ్యాయి. డోన్ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగిలించబడిన 1 ఆటో ను కర్నూలు వెంకట రమణ కాలనీ లో, కర్నూలు 4 వ పట్టణ పోలీసు స్టేషన్ పరిధిలో దొంగలించినబడిన 13 ఆటోలను హైదరాబాద్‌లో స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్స్‌కు, ఓనర్స్‌కు రికవరీ చేసిన ఆటోలను అందజేస్తున్నామన్నారు. వాటి విలువ సుమారు 17 లక్షల 47 వేల రూపాయలు ఉంటుందన్నారు.

  ఇదీ చదవండి TTD: సాఫ్ట్ వేర్ ఇంజనీర్ కు కొత్త జీవితం ఇచ్చిన టీటీడీ బర్డ్స్.. దేవుడే కాపాడాడంటున్న యువతి కుటుంబం

  ఆటోలకు వీల్ లాక్ గాని, అలారమ్ సిస్టమ్ గాని ఏర్పాటు చేసుకునేవిధంగా ఆటో డ్రైవర్లకు, ఆటో యజమానులకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఆటోలను పార్కింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు పాటించాలన్నారు. ఆటోలకు వీల్ లాక్, అలారమ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలని ఆటో డ్రైవర్లకు, యజమానులకు విజ్ఞప్తి చేశారు. చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న కర్నూలు 4వ పట్టణ పోలీసులకు ఎస్పీ సిద్ధార్థ్‌ కౌశల్‌ రివార్డులు అందజేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime news, Kurnool, Local News

  ఉత్తమ కథలు