KURNOOL KIDS WENT TO POLICE STATION AND DEMAND TO REGISTER CASE ON PENCIL THEFT IN KURNOOL DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN GNT
Police Complaint for Pencil: పెన్సిల్ పోయిందంటూ పోలీస్ కంప్లైంట్... తగ్గేదేలే.. అంటున్న బుడ్డోడు..!
పెన్సిల్ కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లిన పిల్లలు
Police Station: బుడతడు ఓ వైరైటీ కారణంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అంతేకాదు అనుమానితుడ్ని కూడా తీసుకెళ్లి వీడిపై కేసు పెట్టండి అని పోలీసులను ధైర్యంగా అడిగేశాడు. ఆ బుడ్డోడు చెప్పిన కారణం విని పోలీసులు కూడా షాకై.. ఆ తర్వాత నవ్వుకున్నారు.
సాధారణంగా ఇంట్లో దొంగలు పడితే, విలువైన వస్తువులు చోరీకి గురైతే వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తాం. వారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసి దొంగలు దొరికితే సొత్తు రికవరీ చేసి బాధితులకు అప్పగిస్తారు. ఒక్కోసారి పోలీసులకు సీరియస్ కేసులే కాదు సిల్లీ కేసులు కూడా ఎదురవుతుంటాయి. అలాంటి కంప్లైంట్స్ కు ఎలా సమాధానం ఇవ్వాలో తెలియక తలపట్టుకుంటుంటారు. అప్పుడప్పుడు కొందరు ఆకతాయిలు ప్రాంక్ కాల్స్ తో పోలీసులను పరుగులు పెట్టిస్తుంటారు. కానీ ఓ బుడతడు మాత్రం ఓ వైరైటీ కారణంతో పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. అంతేకాదు అనుమానితుడ్ని కూడా తీసుకెళ్లి వీడిపై కేసు పెట్టండి అని పోలీసులను ధైర్యంగా అడిగేశాడు. ఆ బుడ్డోడు చెప్పిన కారణం విని పోలీసులు కూడా షాకై.. ఆ తర్వాత నవ్వుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) పెదకడుబూరు పోలీస్ స్టేషన్ కు ఓ నలుగురు చిన్నపిల్లలు వచ్చారు. వారి ఇద్దరి పేర్లు హనుమంతు. వీరిలో ఒకడు నా పెన్సిల్ దొంగతనం చేశాడు సార్.. అని కంప్లైంట్ ఇచ్చాడు. ఇప్పుడు ఏంచేయాలి అని పోలీసులు అడగ్గా.. కేసు పెట్టండి సార్ అని కోరాడు. ఐతే ఇంత చిన్నకారణానికి కేసు పెడితే వాడి జీవితం పాడవుతుంది.. వాళ్ల అమ్మానాన్న బాధపడతారు.. పెద్దమనసు చేసుకొని ఈ ఒక్కసారికి రాజీ కావాలని సూచించారు. దీంతో ఇద్దరూ చేతులు కలిపారు. ఆ తర్వాత ఏమనుకున్నాడో ఏమో కేసు నమోదు చేయాల్సిందేనని చెప్పాడు. అయితే బెయిల్ కష్టమవుతుందని పోలీసులు జోక్ చేయగా.. వాళ్ల అమ్మానాన్నను పిలిస్తే పిలుచుకురమ్మను.. నేను మాట్లాడుతా కేసు పెట్టాల్సిందేనన్నాడు. పోలీసులు కూడా కాసేపు నవ్వుకొని కేసు పెడతాలే ఇంటికెళ్లమని చెప్పడంతో శాంతించి వెళ్లిపోయాడు.
పెద్దవాళ్లే పోలీస్ స్టేషన్ అంటే భయటపడతారు. అలాంటి చిన్నపిల్లోడు ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ధైర్యంగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కేసు పెట్టాలని కోరడం మాత్రం వైరల్ గా మారింది. గురువారం పెదకడబూరు పోలీస్ స్టేషన్ల ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం బుడతడి వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. చూసిన వారంతా బుల్లి హన్మంతు ధైర్యానికి ఫిదా అవుతున్నారు. సాధారణంగా ఇద్దరు పిల్లల మధ్య గొడవ జరిగితే కొట్టుకుంటారు.. కానీ వీళ్లు మాత్రం మరో ఇద్దర్ని వెనకేసుకోని పోలీస్ స్టేషన్ కు వెళ్లడం అందర్నీ ఆకట్టుకుంటోంది. స్టేషన్లో పోలీసులు కూడా ఈ సరదా సీన్ కు కాసేపు నవ్వుకున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.