ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు నిర్వహించి తీరుతామని ఏపీ సీఎం జగన్ స్పష్టం చేశారు. తమ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యమన్నారు. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయమని డిమాండ్ చేయడం సులభమని.. కానీ అలా చేస్తే విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఉన్నత చదువల కోసం ప్రయత్నించినా.. ఉద్యోగాల వేటలో ఇంటర్వ్యూకు వెళ్లినా పది, ఇంటర్ పరీక్షల్లో మార్కులే పరిగ;ణలోకి తీసుకుంటారని.. కేవలం సర్టిఫికేట్ పై పాస్ అని ఉంటే వారి భవిష్యుత్తు ఏంటని సీఎం జగన్ ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రతి విద్యార్థికి భరోసా కల్పిస్తూ పరీక్షలు నిర్వహిస్తామన్నారు సీఎం జగన్..
సీఎం జగన్ నిర్ణయంపై విపక్షాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి. జగన్ కు అంత మొండి పట్టుదల ఎందుకని ప్రశ్నిస్తున్నారు వివిధ రాజకీయ పార్టీల నేతలు. ఇప్పటికే టీడీపీ దీనిపై భారీ ఉద్యమం కూడా చేపట్టింది. పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలంటూ మొదట సీఎం జగన్, తరువాత గవర్నర్ కు లేఖలు రాశారు నారా లోకేష్. అటు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అభిప్రాయ సేకరణ తీసుకున్నారు. దాదాపు 2 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లి దండ్రులు పరీక్షలను రద్దు చేయాలని కోరారని టీడీప నేతలు అంటున్నారు. తాజాగా పది, ఇంటర్ పరీక్షలపై కేఏ పాల్ స్పందించారు.
కరోనా ఉద్ధృతి రోజురోజుకీ భారీగా పెరిగిపోతున్నప్పటికీ పదో తరగతి, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్పడం పట్ల కేఏ పాల్ మండిపడ్డారు. కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఆయన నిలదీశారు. కరోనా కేసులు భారీగా విజృంభిస్తున్న నేపథ్యంలో ఇతర రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలు వాయిదా వేశాయని ఆయన గుర్తు చేశారు. విద్యార్థుల న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఏపీలో పరీక్షలు వాయిదా వేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు ఆయన వివరించారు. సీఎం జగన్, ఏపీ మంత్రుల పిల్లలవే ప్రాణాలా? సామాన్యుల పిల్లల ప్రాణాలు పట్టవా అంటూ పాల్ నిలదీశారు. ప్రస్తుతం సునామీ కన్నా కరోనా ప్రమాదకరంగా మారిందన్నారు.
పదో తరగతి, ఇంటర్ పరీక్షలపై ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని, లేదంటే విద్యార్థులు కరోనాకు బలైపోయే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ విద్యార్థుల భవిష్యత్, ప్రాణాల గురించి ఆలోచించాలని కోరారు. అలాగే దేశ వ్యాప్తంగా పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీకి ఆక్సిజన్, వాక్సిన్లు, కిట్లు పంపించాలని తాను పొరుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు విదేశీ నేతలను కోరానని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్లో కరోనా చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. విశాఖలో ఏడాది పాప కరోనాతో ఆసుపత్రికి వెళ్లి అక్కడే మృతి చెందడం కలిచివేసిందన్నారు పాల్.
ఏపీ ప్రభుత్వంపై కెఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వివేకంతో ఆలోచించడం లేదని విమర్శించారు. కరోనా విజృంభిస్తున్న వేళ రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తాం అనడం అవివేకం అన్నారు. కరోనా సోకితే విద్యార్థుల ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. పొరుగు రాష్ట్రాల్లో సరీక్షలు వాయిదా వేసిన వేళ పరీక్షలు నిర్వహించడం మంచిది కాదని హితవు పలికారు. ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. కరోనా మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని తరగతుల పరీక్షలను వాయిదా వేసింది. అయితే టెన్త్, ఇంటర్ పరీక్షలు కొనసాగుతాయని స్పష్టం చేసింది. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా రగడ కొనసాగుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.