Murali Krishna, News18, Kurnool
వైసీపీ (YSRCP) ప్రభుత్వంపై పై మండిపడ్డారు జనసేన (Janasena) నేత నాగబాబు (Konidela Nagababu). కర్నూలు జిల్లా (Kurnool DIstrict) పర్యటనలో భాగంగా జనసేన విర మహిళా సమావేశానికి హాజరైన నాగబాబు.,. వైసీపీ రాజకీయాలపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పాలన చెత్తగా ఉందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి వైస్సార్సీపీ పార్టీ గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో అరాచకం, రౌడీ రాజ్యం, గుండాయిజం, బుకబ్జాలు ఎక్కువయ్యాయి. మధ్యపాన నిషేధం అని చెప్పి మద్యంపై పక్కరాష్ట్రంతో పోలిస్తే 4 రేట్లు ఎక్కువగా మద్యం ధరలు పెంచారు. తమ పార్టీ నాయకులకు లబ్ది చేకూరే విధంగా మద్యం అమ్మకాలు చేపట్టారు. రాష్ట్రాన్ని గంజాయి రాష్ట్రంగా మార్చేశారు అని మండి పడ్డారు.
అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికలో గెలుపే లక్ష్యంగా జనసేన కార్యరూపం దాల్చింది అని తెలిపారు. వచ్చే ఎన్నికలో నియోజకవర్గాలో పోటీపై కూడా నాగబాబు కొంత క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ సోలోగా వెళ్తే కచ్చితంగా రాష్ట్రంలో ఉండే అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తుందని.. ఆలా కాకుండా పొత్తు ఉంటే పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు పోటీ ఉంటుందని తెలిపారు. ఎన్నికలో పార్టీ పోతులపై పార్టీ అధిష్టానం, పార్టీ ప్రెసిడెంట్ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని.. పార్టీ ఏ విధంగా నిర్ణయం తీసుకుంటే దానికి తగ్గట్లుగా నడుచుకుంటామని చెప్పారు. పార్టీ పొత్తులపై త్వరలోనే నిర్ణయం తీసుకుని వెళ్లాడిస్తామని తెలిపారు.
శ్రీకాకుళంలో జరిగిన యువశక్తి ప్రోగ్రాంతో రాష్ట్రంలో జనసేన నాయకులపై వైసీపీ కన్నేసి ఉంచారని.. మనం మరింత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ ఎలా ముందుకెళ్లాలనే దానిపై జనసైనికులతో చర్చిస్తున్నామని నాగబాబు వెల్లడించారు. ఇక పవన్ కళ్యాణ్ పై పోటీకి సిద్ధమన్న అలీ కామెంట్స్ పై.. నాగబాబు నో కామెంట్స్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Janasena party, Kurnool, Local News, Nagababu