Murali Krishna, News18, Kurnool
ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) నంద్యాల పట్టణంలో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది ఎంతో పవిత్రమైనది. ఈమహానంది పుణ్యక్షేత్రంలో దశాబ్దాల కాలం నుంచి వస్తున్న ఆచారాన్ని భక్తులు నేటికీ ఆనవాయతీగా పాటిస్తున్నారు. ఈ పుణ్యక్షేత్రానికి వచ్చిన భక్తులందరు స్వామి దర్శనంతరం మందిరం వెలుపల ఉన్నటువంటి గోమాతను దర్శించుకోవటం ఆనవాయతీగా వస్తున్నటువంటి ఆచారం. మహానంది పుణ్యక్షేత్రంలో స్వామి వారు పుట్టాకారంలో భక్తులకు దర్శనం సౌభాగ్యం కలిగిస్తుంటారు. పూర్వం స్వామి వారు పుట్టలో సేదటిరుతున్న సమయంలో ఒక గోవు ప్రతి రోజు ఆ పుట్టపై క్షీరాదార ప్రవహింపజేసేదని అలా ఆ గోవు యొక్క పాద స్పర్శ వలన స్వామి వారు శిలా రూపం పొంది భక్తులకు దర్శం ఇస్తున్నారనిగుడిలోని అర్చకులు తెలియజేస్తున్నారు.
ఇందులో భాగంగానే మహానంది పుణ్యక్షేత్రంలో స్వామి వారు పుట్టలో ఉన్నట్లుగా చుట్టూ నీళ్లతో ఉంటారు. ఆ నీటినే పూర్వం గోవు పుట్టలో ఉన్నటువంటి స్వామి వారిపై పోసిన క్షీరధారగా భావిస్తూ ఉంటారనిఆలయా అర్చకులు తెలియచేస్తున్నారు. ఆలయంలో ఉన్నటువంటి కోనేటిలోని నీరు కూడా స్వచ్ఛమైనదిగా తేటగా ఆ నీటిలో ఒక రూపాయి కాయిన్ వేసినా కూడా కనిపించేంత తేటగా ఉంటాయని చెబుతున్నారు.
అందుచేతగుడికి వచ్చే ప్రతి ఒక్కరు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నా తరువాత గుడిలో ఉన్నటువంటి గోమాత కింద నుంచి దూరి గోమాత ఆశీర్వాదం తీసుకుంటారు. ఆలా గోమాత ఆశీర్వాదం తీసుకోవడం వలన సకల పాపాలు దోషాలు తొలగుతాయని భక్తుల యొక్క నమ్మకం.
హిందూ సాంప్రదాయం ప్రకారం గోవులో సకల దేవతలు కొలువై ఉంటారనేది మన హిందూ ధర్మం తెలుపుతుందని వేద పండితులు తెలుపుతున్నారు. గోవు శాఖహరి కావున గోవు యొక్క మూత్రం సేవించిన సకల రోగాలు నయామవుతాయానేది హిందువులు నమ్మకం. ఇందులో భాగంగానే ఆలయంలో తొమ్మిదినదులు ఉండడం వలన ఈమహానంది క్షేత్రానికి నవనంది క్షేత్రం అని కూడా అంటారు.
మహానంది క్షేత్రానికి వెళ్లే మార్గం
కర్నూలు నుంచి నంద్యాల 70 కిలోమీటర్లు దూరం ఉంటుంది. అక్కడి నుంచి మహానంది 20కిలోమీటర్లు దూరం ఉంటుంది. నంద్యాల నుంచి మహానంది పుణ్యక్షేత్రానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం కూడా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Nandyala