హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

అంతరాష్ట్ర దొంగల పట్టివేత.. నిందితులనుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం..

అంతరాష్ట్ర దొంగల పట్టివేత.. నిందితులనుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం..

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు

Andhra Pradesh: కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వరుసగా దొంగతనాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఇళ్లకు తాళం వేసి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం అలాగే ఉన్నా.. ఇంట్లో సామాన్లు మాత్రం మాయమయ్యేవి.

  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వరుసగా దొంగతనాలు ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేశాయి. ఇళ్లకు తాళం వేసి ఇంటి నుంచి బయటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంటి తాళం అలాగే ఉన్నా.. ఇంట్లో సామాన్లు మాత్రం మాయమయ్యేవి.  అలా వరుసగా ఆదోని పట్టణంలో దొంగతనాలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఆదోని పట్టణంలో వారంలో మూడుకు పైగా దొంగతనాల కేసులు రిజిస్టర్ అవడంతోపోలీసులకు ఈ కేసులు పెను సవాలుగా మారాయి.

ఇంటికి తాళం వేసి బయటకు వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో సామాన్లకు గ్యారెంటీలేని పరిస్థితి ఆ ప్రాంతంలో ఏర్పడింది. గడిచిన రెండు నెలలలో సుమారు 30కి పైగా దొంగతనాల కేసులు నమోదు కావడంతో పోలీసులు గట్టిగా ఏర్పాటు చేసి ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేశారు.

నిందితుల వద్ద నుంచి సుమారు 30 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కర్ణాటక రాష్ట్రం భద్రావతి తాలూకా దొడ్డేరి గ్రామానికి చెందిన నిందితులు యోగేష్‌, కెంచెప్పలు వరుసకు అన్నదమ్ములు. కెంచెప్ప చెల్లెలును ఆదే గ్రామానికి చెందిన రవికి ఇచ్చి పెళ్లి చేశారు. యోగేష్‌, కెంచెప్ప, రవి ముగ్గురూ కలిసి కర్ణాటక, మహారాష్ట్ర , గుజరాత్‌, గోవా , ఆంధ్రప్రదేశ్‌తో పాటు పలు రాష్ట్రాల్లో తాము ప్రభుత్వ ఉద్యోగులమని నమ్మిస్తూ చోరీలు చేసేవారు.

ఈ ముగ్గురు కలిసి షిఫ్ట్‌ కారులో గతేడాది జూలై 15వ తేదీన ఆదోని పట్టణంలోని అరుంజ్యోతినగర్‌లో సంధ్యారాణి ఇంటికి వెళ్లారు. తాము మున్సిపల్‌ కార్యాలయం నుంచి వచ్చామని నమ్మించారు. ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన స్వచ్ఛభారత్‌ ప్రోగ్రాంలో భాగంగా ఇంటింటికి తిరిగి డ్రెయినేజీ పైపులు చెక్‌ చేస్తున్నామని చెప్పారు. ఐడీ కార్డులను చూపించడంతో నమ్మిన సంధ్యారాణి ఇంటి వెనక ఉన్న డ్రెయినేజీ వద్దకు యోగేష్‌, కెంచెప్పలను తీసుకెళ్లారు.

వారు పైపులు పరిశీలించేటప్పుడు రవి ఇంట్లోకి దూరి బీరువాలో ఉన్న బంగారు ఆభరణాలను తస్కరించాడు. పైపులు చెడిపోయానని, సిబ్బందితో కొత్తవి వేయిస్తామని చెప్పి యోగేష్‌, కెంచెప్పలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. సంధ్యారాణి ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాను తెరిచి ఉంది. చోరీ జరిగిందని నిర్ధారించుకుని ఆమె త్రీటౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరపగా చోరీ చేసిన వారు యోగేష్‌, కెంచెప్ప, రవి అని తేలింది. వీరు హవేరీ జిల్లా జైలులో ఉండగా వారెంట్‌పై అరెస్ట్‌ చేసి ఆదోనికి తీసుకొచ్చారు. వారి వద్ద నుంచి సంధ్యారాణి ఇంట్లో దొంగలించిన 90 గ్రాముల బంగారు ఆభరణాలను రికవరీ చేసినట్లు ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు