Murali Krishna, News18, Kurnool
నిరుద్యోగులకు జాబ్ చాలా ముఖ్యం. అందుకే ఏ నోటిఫికేషన్ పడినా వెంటనే దరఖాస్తు చేస్తుంటారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగులకు వేలాది మంది అప్లై చేశారు. కానీ ఓ చోట మాత్రం ఇంటర్నెట్ సెంటర్ నిర్వాహకుడి చేతిలో దారుణంగా మోసపోయారు. ఉమ్మడి కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గంలో యువతను బురిడీ కొట్టించాడు నెట్ కేఫ్ నిర్వాహకుడు. కొందరు నిరుద్యోగులు పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి నందికొట్కూరులోని అమీర్ నెట్ సెంటర్ కు వెళ్లారు. అదే సమయంలో సర్వర్ రావడం లేదు, సర్వర్ బిజీ వస్తుంది, డబ్బులు కట్టేసి వెళ్ళండి నేను అప్లై చేసి మీకు పిడిఎఫ్ ఫైల్ పంపిస్తానంటూ నెట్ సెంటర్ నిర్వాహకుడు చెప్పాడు. కానీ అతడు మాత్రం వారిని అడ్డంగా మోసం చేశాడు.
నందికొట్కూరు నియోజకవర్గం పరిధిలోని గ్రామీణ పట్టణ ప్రాంతంలోని నిరుద్యోగ యువతీ యువకులు సుమారు 25 మందికి పైగా ఈ నెట్ కేఫ్ సెంటర్ ద్వారా ఆన్లైన్లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు. దాన్ని అలుసుగా తీసుకున్న నేటి కేఫ్ నిర్వాహకుడు వారిని బురిడి కొట్టించాడు. అభ్యర్థులు దరఖాస్తు చేయడానికి వచ్చిన సమయంలో నెట్ రావడం లేదు సర్వర్ బిజీగా ఉందంటూ చెప్పి వారి దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి అప్లై చేసినట్లుగా నఖిలీ ధ్రువపత్రాలను వారికి పంపాడు. పరీక్షలు సమర్పిస్తున్న సమయంలో హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవడానికి వెళ్ళిన అభ్యర్థులకు హాల్ టికెట్లు రాకపోవడంతో మోసపోయామని గ్రహించారు.
దీంతో చేసేదేమీ లేక సుమారు 25 మందికి పైగా బాధితులు నందికొట్కూర్ పోలీసులను ఆశ్రయించారు. తమకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ అభ్యర్థించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. అదే విధంగా నిరుద్యోగ యువత తొందరపడి ఇలాంటి నెట్ కేఫ్ సెంటర్ల నుంచి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యోగాలకు అప్లై చేసుకునే సమయంలో తగు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap police jobs, Kurnool, Local News