అంజుమాన్-ఎ-ఇస్లామియా విద్యాసంస్థ, వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కమీటీ ముఖ్యమైన అంశాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి చర్చింది. ఇందులో భాగంగా.. ప్రస్తుత చట్టవిరుద్ధమైన మేనేజింగ్ బాడీ, మునుపటి అంజుమన్-ఎ- ఇస్లామియా ఉద్దేశ్యాన్ని పూర్తిగా నాశనం చేశారు. దీంతో కొన్ని కళాశాలలు మూసి వేయాల్సిన పరిస్థితి వచ్చింది..ఇప్పటికే న్యాయకళాశాల మూసివేయబడింది. కొన్ని సంస్థలు వీరి అసమర్థనిర్వహణ వల్ల మూతపడ్డాయి.
సెక్రటరీ , కరస్పాండెంట్ నిర్వహణలో లోపం కారణంగా టీచింగ్ , నాన్ టీచింగ్ సిబ్బందికి ఎంపిక చేసిన పోస్టుల జాబితాను కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ద్వారా రద్దు. చేయబడింది. శాశ్వత పోస్టులను తిరిగి భర్తీ చేయడానికి సెక్రటరీ మరియు ఇతరులు ఎటువంటి తదుపరి చర్యలు తీసుకోలేదు.
డా. అబ్దుల్ హఖ్ యునాని హాస్పిటల్ & మెడికల్ కాలేజ్, కర్నూలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని ఏకైక ఎయిడెడ్ యునాని కళాశాల మరియు ఆసుపత్రి. ప్రస్తుతం ఉన్న పోస్టులు కాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో 34 మెడికల్ మెడికల్ ఎయిడెడ్ రెగ్యులర్ పోస్టులను మంజూరు చేసింది. కానీ కరస్పాండెంట్ మరియు సెక్రటరీల అసమర్ధత వల్ల సరైన సమయంలో ఈ పోస్టులను భర్తీ చేయలేదు. దీనివల్ల దాదాపు 34 మంది ఉపాధి కోల్పోయారు. యునాని మెడికల్ కాలేజీ మరియు ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది కేవలం నామమాత్రపు జీతాలపై బతుకుతున్నారని వీటిని సంరక్షించి అభివృద్ధి పరచాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేసారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News