హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Wife and Husband: పెళ్లై ఏడాది కాలేదు.. అప్పుడే పాడుబుద్ధి పుట్టింది.. చివరికి ఏం జరిగిందంటే..!

Wife and Husband: పెళ్లై ఏడాది కాలేదు.. అప్పుడే పాడుబుద్ధి పుట్టింది.. చివరికి ఏం జరిగిందంటే..!

సుధాకర్, లక్ష్మీదేవి (ఫైల్)

సుధాకర్, లక్ష్మీదేవి (ఫైల్)

భార్యాభర్తల బంధం (Wife And Husband) అనేది నమ్మకం అనే పునాదిపై నిలబడుతుంది. ఒకరిపట్ల ఒకరికి ప్రేమ, నమ్మకం ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరిలో అనుమానం మొదలైనా ఆ కాపురం కలహాలతో నిండిపోతుంది.

Anna Raghu, Guntur, News18

భార్యాభర్తల బంధం (Wife And Husband) అనేది నమ్మకం అనే పునాదిపై నిలబడుతుంది. ఒకరిపట్ల ఒకరికి ప్రేమ, నమ్మకం ఉండాలి. ఇద్దరిలో ఏ ఒక్కరిలో అనుమానం మొదలైనా ఆ కాపురం కలహాలతో నిండిపోతుంది. అంతేకాదు జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తోంది. కొన్నిసార్లు ప్రాణాలు కూడా తీస్తుంది. అలా అనుమానం పెనుభూతమైన ఓ భర్త అగ్నిసాక్షిగా తీళికట్టిన భార్యను అంతమొందిచ్చాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని కర్నూలు జిల్లా (Kurnool District) డోన్ పట్టణంలోని కొత్తపేటకు చెందిన చౌడప్ప, లక్ష్మి దేవిల కుమార్తె బాల లక్ష్మిదేవికి ఏడాది క్రితం వెల్దుర్తి మండలం గువలకుంట్లకు చెందిన సుధాకర్కి ఇచ్చి పెళ్లి చేశారు. సుధాకర్ నంద్యాలలోని వార్డు సచివాలయ సంక్షేమ సహాయకుడిగా పనిచేస్తున్నాడు. లక్ష్మి దేవి వెంకటనాయుని పల్లె గ్రామా సచివాలయంలో మహిళా పోలీస్ గా విధులు నిర్వర్తిస్తోంది.

పెళ్లైన కొత్తలో వీరి కాపురం సజావుగానే సాగింది. ఐతే కొంతకాలానికి లక్ష్మి దేవిపై అనుమానం పెంచుకున్న సుధాకర్ తరుచూ ఆమెను వేధిస్తున్నాడు. ఐతే తనపై అతి ప్రేమతోనే అలా చేస్తున్నాడని భావించిన ఆమె భర్త వేధింపులను భరిస్తూ వస్తోంది. అయినా అతడిలో ఎలాంటి మార్పు రాలేదు. దీంతో తన ఆవేదనను తల్లిదండ్రులతో చెప్పుకుంది. వారు పెద్దల సమక్షంలో పలుసార్లు సుధారక్ కు నచ్చజెప్పారు. ఆయినా సుధాకర్లో మార్పు రాలేదు.

ఇది చదవండి: ఊరిచివర పొదల్లో యువతి డెడ్ బాడీ.. పోస్ట్ మార్టం రిపోర్ట్ చూసి షాకైన పోలీసులు..!


వేధింపులు మరింత ఎక్కువ కావడంతో కొన్నినెలల క్రితం డోన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత సుధాకర్ మరింత రెచ్చిపోయాడు. తనమీదే పోలీస్ కంప్లైంట్ ఇస్తావా అంటూ రెండుసార్లు దాడికి యత్నించాడు. బెదిరిపోయిన ఆమె ఇక అతడితో తెగదెంపులు చేసుకోవడమే బెటర్ అని భావించింది. ఈ క్రమంలో మంగళవారం లక్ష్మీదేవి తన విధులు ముగించుకొని బైక్ పై ఇంటికి వస్తుండగా.. డోన్ శివారులో ఆమెను అడ్డుకొని దాడికి యత్నించాడు. డ్డుకోబోయిన సహోద్యోగిని బెదిరించడంతో అతడు పారిపోయాడు. అప్పటికే తన వెంట తెచ్చుకున్న కత్తితో ఆమె గొంతు కోశాడు. దీంతో లక్ష్మీ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఇద్దరూ మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. మంచి జీతం, జీవితం. అన్నీ బావున్నా సుధాకర్ మెదడులో పుట్టిన అనుమానపు పురుగు నిండు జీవితాన్ని బలితీసుకుంది.

ఇది చదవండి: బాలుడితో యువతి లవ్ ఎఫైర్.. లేచిపోయి గుడిలో పెళ్లి.. సాయంత్రానికి ఊహించని ట్విస్ట్..


ఇదిలా ఉంటే అనంతపురం జిల్లాలో నరేష్ అనే వ్యక్తి.. నందిని అనే యువతిని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకుంటానని నమ్మించి గర్భవతిని చేశాడు. తీరా ఆమె పెళ్లి చేసుమని నిలదీయడంతో గ్రామశివారులోకి పొదల్లోకి తీసుకెళ్లి నోట్లో పురుగుల మందు తాగించి.. గొంతు నులిమి హత్య చేశాడు. ఐతే పోలీసుల తన కోసం వెతుకుతున్నారని తెలిసి లొంగిపోయాడు.

First published:

Tags: Andhra Pradesh, Crime news, Husband kill wife, Kurnool

ఉత్తమ కథలు