Love Marriage: వాళ్లిద్దరిది లవ్ మ్యారేజ్.. 6 నెలలు అంతా బాగానే ఉంది.. కానీ ఓ రోజు ఇంట్లో షాకింగ్ దృశ్యం...

ప్రతీకాత్మక చిత్రం (image credit - youtube

ప్రేమించినవాడితో అందమైన జీవితాన్ని ఊహించుకుంది ఆ యువతి. కానీ తాను ఒకటి అనుకుంటే.. పెళ్లి తర్వాత మరొకటి జరిగింది.

 • Share this:
  ప్రేమించుకోవడం.. పెద్దలను ఎదురంచి పెళ్లి చేసుకోవడం. కొన్నాళ్లు కాపురం తర్వాత కలహాలు మొదలవడం. ఇదీ ప్రేమ పెళ్లిళ్లలో చోటు చేసుకునే సీన్. అలా యువతి.. తనకు నచ్చిన వాడిని ప్రేమించింది. అతడినే పెళ్లి చేసకుంటానని తల్లిదండ్రులకు చెప్పింది. వారితో పోరాడి ఒప్పించి అతడ్ని పెళ్లి చేసుకుంది. కానీ తాను ఊహించుకున్నంత అందమైన జీవితం కాదది. పెళ్లైన కొన్నాళ్లకే ఇద్దరి మధ్య కలహాలు మొదలయ్యాయి. ఆ కలహాల కాపురం ఆమె ప్రాణాలను తీసేవరకు వెళ్లింది. వివగాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా గొనెగండ్లకు చెందిన సుభాన్, షేకూన్ బీ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. సుభాన్ చికెన్ వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అతని రెండో కుమార్తె యాస్మిన్ బీ.. అదే గ్రామానికి చెందినబాసన్ కుమారుడు రహీమ్ ను ప్రేమించింది.

  వీరి ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో పెళ్లికి నిరాకరించారు. ఐతే రహీమ్ ను తప్ప ఇంకెవరినీ పెళ్లి చేసుకోనని యాస్మిన్ తన తల్లిదండ్రులకు తెగేసి చెప్పింది. దీంతో ఇరు కుటుంబాలు ఆరు నెలల క్రితం ఇద్దరికీ పెళ్లి చేశారు. ఐతే ఆమె నిర్ణయం ఎంత తప్పో కొన్నిరోజులకే అర్ధమైంది. పెళ్లైన కొన్నాళ్లకే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. యాస్మిన్ ను తన పుట్టింటికి వెళ్లకుండా రహీం కట్టడి చేశాడు. దీంతో వారి మధ్య కలహాలు మొదలయ్యాయి.

  ఇది చదవండి: నాసిరకంగా నాడు-నేడు పనులు.. విద్యార్థుల ప్రాణాలమీదకు తెస్తున్న కాసుల కక్కుర్తి


  ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున భార్య మెడకు తాడు బిగించి హత్య చేశాడు. అతంనరం ఆమె మృతదేహాన్ని చీరతో బిగించి ఇంటి పైకప్పుకు వేలాడదీశాడు. యాస్మిన్ ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు అందర్నీ నమ్మించాడు. ఐతే సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించారు. రహీమ్ ప్రవర్తనపై అనుమానంతో అతడ్ని విచారించగా చేసిన నేరం ఒప్పుకున్నాడు. యాస్మిన్ తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రహీమ్ పై హత్య కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

  ఇది చదవండి: అత్తాకోడళ్ల ఫైటింగ్.. చివరికి పోలీసుల్నే పరుగులు పెట్టించింది.. అసలేం జరిగిందంటే..


  ఇటీవల.., కర్నూలు జిల్లా శిరివెళ్ల మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతికి విశాఖపట్నం జిల్లాకు చెందిన రాజేష్ వరుణ్ అనే యువకుడు టెలిగ్రామ్ ద్వారా పరిచయమయ్యాడు. ఆన్ లైన్ ట్రైడింగ్ పేరుతో అధిక వడ్డీ వస్తుందని ఆమెను నమ్మించి లక్షా యాభై వేల రూపాయలు తీసుకున్నాడు. ఎప్పుడడిగినా డబ్బు విషయం దాటేస్తుండటంతో మోసపోయానని గ్రహించిన యువతి.. తన నగదు తిరిగివ్వాలని నిలదీసింది. డబ్బు తిరిగివ్వాలంటే న్యూడ్ ఫోటోలు, వీడియోలు పంపాలని ఆమెకు కండిషన్ పెట్టాడు. అందుకు ఒప్పుకున్న ఆమె యువకుడికి వాటిని పంపింది. వాటిని తన దగ్గరపెట్టుకొని మరింత డబ్బులివ్వాలని ఆమెను బ్లాక్ మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు వైజాగ్ వెళ్లి రాజేష్ ను అరెస్ట్ చేసి ఆళ్లగడ్డ తీసుకొచ్చారు.
  Published by:Purna Chandra
  First published: