హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌..! వెయ్యి నుంచి రూ.25 వేలు పొందే అవకాశం..! త్వరపడండి..!

Kurnool: మైనార్టీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌..! వెయ్యి నుంచి రూ.25 వేలు పొందే అవకాశం..! త్వరపడండి..!

ప్రతీకాత్మకచిత్రం ( Image Credit: Shutter Stock )

ప్రతీకాత్మకచిత్రం ( Image Credit: Shutter Stock )

ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో మైనార్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్, మెరిట్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని కర్నూలు జిల్లా (Kurnool District) మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎస్ మహబూబ్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh) లో మైనార్టీ విద్యార్థులు కేంద్ర ప్రభుత్వ ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్, మెరిట్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని కర్నూలు జిల్లా (Kurnool District) మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎస్ మహబూబ్ బాషా ఓ ప్రకటనలో తెలిపారు. స్కాలర్‌షిప్ పొందాలనుకున్నవారు ఆన్‌లైన్‌లో నేషనల్ స్కాలర్ పోర్టల్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న ప్రీ మెట్రిక్ విద్యార్థులు సెప్టెంబరు 30లోగా.. ఇంటర్, ఆ పైన చదివే పోస్ట్ మెట్రిక్ విద్యార్థులు అక్టోబరు 31 వరకు దరఖాస్తు చేసుకోవాలి. నవంబర్‌ 15లోగా మెరిట్ కమ్ మీన్స్ బేస్డ్ స్కాలర్‌షిప్‌ స్కీమ్‌కు అప్లై చేసుకోవాలి. 2022-23 విద్యా సంవత్సరానికి మైనారిటీ విద్యార్థులు నేషనల్ మైనార్టీస్ ఫ్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ విభాగంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ముస్లిం, సిక్కు, క్రిస్టియన్, బౌద్ధ, జైన, జొరాస్ట్రియన్ (పార్సీ) అల్ప సంఖ్యాక వర్గాల విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.

  1. ప్రీ మెట్రిక్స్ స్కాలర్షిప్ స్కిల్ ఫర్ మైనార్టీస్ :

  ఈ విభాగం కింద 1వ తరగతి నుండి పదో తరగతి వరకు చదువుకునే మైనార్టీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయము 1 లక్ష రూపాయల లోపు ఉండాలి.

  ఆర్థిక సహాయము :-

  1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు : రూ.1000

  6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు:- రూ.5000.

  మైనారిటీ విద్యార్థులకు ఉపకార వేతనాలు

  ఇది చదవండి: ఐటీఐ విద్యార్థులకు శుభవార్త.., ఈ గోల్డెన్ ఛాన్స్ మిస్ అవ్వకండి.. వివరాలివే..!

  2. పోస్ట్ మాట్రిక్స్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ మైనారిటీస్:

  ఈ విభాగం కింద ఉపకార వేతనాల కోసం ఇంటర్మీడియట్ నుంచి పీహెచ్‌డీ గవర్నమెంట్ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ కాలేజీలు, ఐ.టి.ఐ లేదా ఐ.టి.సి టెక్నికల్ కోర్సులు , గ్రాడ్యూయేట్, పోస్ట్ గ్రాడ్యూయేట్, టెక్నికల్, ప్రొఫెషనల్ కోర్సులు చదువుతున్న మైనారిటీ విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయము 2 లక్షల రూపాయల లోపు ఉండాలి.

  ఆర్థిక సహాయము :- రూ :-6,000 నుంచి రూ. 12,000 వరకు

  ఇది చదవండి: ఏయూ పరిధిలోని 18 డిగ్రీ కాలేజీల్లో అడ్మిషన్లకు బ్రేక్‌..! కారణం ఏంటంటే..?

  3. మెరిట్ కం మిన్స్ స్కాలర్షిప్ స్కీమ్ ఫర్ ప్రొఫెషనల్ అండ్ టెక్నికల్ కోర్స్‌కు సాంకేతిక మరియు వృత్తిపరమైన కోర్సులు సంబంధించిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయము రూ -2.5 లక్షల లోపు ఉండాలి.

  ఆర్థిక సహాయము :- రూ. 25,000 నుంచి రూ. 30,000

  4. బేగం హజరత్ మహల్( బాలికలకు మాత్రమే)

  ఈ విభాగంలో కేవలం ఆడపిల్లలకు మాత్రమే స్కాలర్‌షిప్‌ వస్తుంది. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ విద్యార్థుల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2 లక్షల లోపు ఉండాలి.

  ఆర్థిక సాయం : రూ. 5,000 నుంచి రూ. 6,000

  గత ఏడాది ఉపకార వేతనాలు పొందిన విద్యార్థులు ఆ ఉపకార దరఖాస్తు ఐడీతో ఈ ఏడాదికి రెన్యువల్‌ చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని జిల్లాలోని విద్యార్థిని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కర్నూలు జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఎస్ మహబూబ్ బాషా తెలిపారు. విద్యార్థులు http//scholarships.gov.in పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News, Scholarships

  ఉత్తమ కథలు