Extramarital Affair: భర్త చనిపోవడంతో మరొకరితో సహజీవనం.. వేరే వ్యక్తితో చనువు.. ఇది తెలిసిన ప్రియుడు ఏం చేశాడంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

Affair: భర్త చనిపోయిన ఆమె ఒంటరైంది. ముగ్గురు కుమార్తెలతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో ఓవ్యక్తికి దగ్గరైంది.

 • Share this:
  భర్త చనిపోయిన ఆమె ఒంటరైంది. ముగ్గురు కుమార్తెలతో కలిసి పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో ఓవ్యక్తికి దగ్గరైంది. అతడితో సంబంధం కొనసాగుతుండగానే మరోవ్యక్తితో చనువుగా ఉండటం మొదలుపెట్టింది. ఇది తెలిసిన ప్రియుడు ఆమెను దారణంగా హత్యచేశాడు. చివరికి పోలీసులకు చిక్కాడు. వివరాల్లోకి వెళ్తే.. కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం, బైలుప్పల గ్రామానికి చెందిన చెందిన హరిజన లక్ష్మికి పెళ్లైన తొమ్మిదేళ్లకు భర్త చనిపోయాడు. దీంతో ఆమెకు తన ముగ్గురు కుమార్తెలతో కలిసి పుట్టినిల్లు బైలుప్పలకు వచ్చి అక్కడే నివాసముంటోంది. ఈ క్రమంలో ఆస్పరి మండలం ములుగుందం గ్రామసచివాలయంలో జేఎల్‌ఎంగా పనిచేస్తున్న దేవదాసుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. పరిచయం కాస్తా సహజీవనానికి దారితీసింది. వీళ్ల మధ్య సంబంధం కొనసాగుతుండగానే లక్ష్మి మరో వ్యక్తితో చనువుగా ఉండటం మొదలుపెట్టింది. దీన్ని గమనించిన దేవదాసు ఆమెను నిలదీశాడు. ఆమె నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో కక్ష పుంకున్నాడు. ఆమెను ఎలాగైనా మట్టుబెట్టాలని స్కెచ్ వేశాడు.

  ఇదిలా ఉంటే జూన్ 7వ తేదీన బంధువుల వివాహానికి అని చెప్పి ఆదోని వెళ్లిన లక్ష్మి కా రాకపోవడంతో బంధువులను ఆరా తీశారు. ఆదోనితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో గోనెగండ్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె సెల్ ఫోన్ కాల్ డేటాను పరిశీలించారు. అందులో దేవదాస్ కు ఎక్కువ కాల్స్ వెళ్లినట్లు గుర్తించి అతడ్ని అదుపులోకి తీసుకొని విచారించారు. ఎంతకీ నిజం చెప్పకపోవడంతో తమదైన శైలిలో విచారించారు. దీంతో ఆమెను తానే హత్య చేసినట్లు అంగీకరించాడు.

  ఇది చదవండి: ఈ విషయంలో కూడా భార్యతో గొడవపడాలా...? అకారణంగా ప్రాణం పోయిందే..!


  లక్ష్మిని ఎలాగైనా చంపాలని స్కెచ్ వేసిన దేవదాసు.. జూన్ 7న లక్ష్మి ఆదోని వెళ్తున్న విషయాన్ని తెలుసుకొని ఆమె వెంటవెళ్లాడు. ఆమెవు కలిసి అనంతపురం జిల్లా గుంతకల్ లోని చర్చికి వెళ్తే గొడవలు సమసిపోతాయని మాయమాటలు చెప్పి ఆమెను నమ్మించాడు. లక్ష్మిని తన బైక్ పై ఎక్కించుకోని మార్గమధ్యలో బహిర్భూమికి వెళ్తానంటూ కసాపురం సమీపంలోని జీఎన్ఎస్ఎస్ కాల్వ వద్దకు తీసుకెళ్లాడు. అక్కడ ఇతరులతో చనువుగా ఉంటున్నావంటూ లక్ష్మీతో గొడవపడ్డాడు. ఆమె గొంతు నులిమి చంపేశాడు. మృతదేహాన్ని ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించాడు.

  ఇది చదవండి: ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి...? గవర్నర్ సిఫార్సు.. అసలు నిజం ఇదే...!  అనంతరం అమె దగ్గరున్న బంగారం, వెండి ఆభరాణాలను తీసుకొని పరారయ్యాడు. హత్య చేసిన రోజు నుంచి కనిపించకుండా తిరుగుతున్న దేవదాసును రెండు రోజుల క్రితం అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడి బైక్, లక్ష్మిదగ్గర కాజేసిన బంగారం, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించారు.

  ఇది చదవండి: మత్స్యకారుల వలలో రెండుటన్నుల సొరచేప... పంట పండిందనుకున్నారు కానీ..

  Published by:Purna Chandra
  First published: