Karthika Somavaaram: కార్తీక మాసం (Karthika Masam) అంటే శివుడి చాలా ప్రీతికరమైన మాసం.. అందులోనే కార్తీక సోమవారం (Karthika Somavaram) అంటే హిందువులు (Hindus) చాలా ప్రత్యేకంగా చూస్తారు.. సోమవారం శివాలయాలకు వెళ్లి.. అభిషేకాలు, రుద్రాభిషేకాలు.. పూజలు చేస్తుంటారు. ఇక ఈ కార్తీక మాసంలో ఇవాళే చివరి రోజు కావడంతో శివాలయాలన్నీ రద్దీగా మారాయి. తెల్లవారు నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. ఓ నమ: శివాయ పేరుతో శైవాలయాలు (Lord Shiva Temple) శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. భక్తులు ఉదయాన్నే నదీ స్నానమాచరించి కార్తీక దీపాలను వెలిగించి నీటిలో వదులుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని త్రిపురాంతకం, భైరవకోన, సోపిరాల, ఒంగోలు కాశీ విశ్వేశ్వర స్వామి, రాజరాజేశ్వర స్వామి, పొదిలి శ్రీ నిర్మామహేశ్వరస్వామి దేవస్థానానికి భక్తులు భారీగా తరలివచ్చారు. కార్తీక దీపాలు వెలిగించి.. అభిషేకాలతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అటు ప్రకాశం జిల్లాలోని కనిగిరిలో పవిత్ర కళ్యాణ మండపం లో కార్తీక సోమవారం సందర్భంగా ఇష్కాన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇక పంచారామ క్షేత్రాలు సామర్లకోట చాళుక్య కుమార రామ భీమేశ్వరాలయం, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. అన్నవరం సత్యదేవుని ఆలయంలో భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకుని అర్ధరాత్రి ఒంటి గంట నుంచి దర్శనానికి అనుమతినిచ్చారు ఆలయ సిబ్బంది. పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పంచరామ క్షేత్రం శ్రీ ఉమా సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.
ఇదీ చదవండి : ఏపీని మళ్లీ భయపెడుతున్న వాయుగుండం.. ఈ జిల్లాల్లో ఈదురు గాలులు.. భారీ వర్షాలు!
పాలకొల్లు శ్రీ క్షీరరామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో భక్తులు అభిషేకాలు, దీపారాధనలు నిర్వహిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో భక్తులతో పుష్కరఘాట్, మార్కండేయ ఘాట్, కోటిలింగాల ఘాట్, గౌతమి ఘాట్లు కిక్కిరిసిపోయాయి. కోటిలింగాల ఘాట్ లో ఇవాళ సాయంత్రం కార్తీక లక్షదీపోత్సవం నిర్వహణ ఉంది. విజయనగరం జిల్లా శృంగవరపుకోట మండలం పుణ్యగిరి లోని ఉమాకోటిలింగేశ్వరి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శ్రీశైలం దేవాలయంలో మల్లన్న దర్శనానికి వేలాదిమంది భక్తులు తరలివస్తుండడంతో రద్దీ దృష్ట్యా అలంకార దర్శనానికి అనుమతి ఇచ్చారు.
ఇదీ చదవండి: ఆస్పత్రుల తీరు ఇంతేనా..? వైద్యుల, సిబ్బంది నిర్లక్ష్యంతో రోడ్డుపైనే శిశువు జననం
పరమ పవిత్రమయిన కార్తీక మాసం త్వరలో ముగియనుంది. దీంతో ఇవాళ శ్రీశైల క్షేత్రం భక్తులతో కిక్కిరిసిపోతోంది. శ్రీగిరి మల్లన్న ఆలయం ముక్కంటీశుని దర్శనానికి ఆరు గంటల సమయం పడుతోంది. కార్తీక దీపాలు వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు భక్తులు. శ్రీశైలంలో కార్తీకమాసం నాలుగోవ చివరి సోమవారం కావడంతో ముక్కంటి క్షేత్రం భక్తులతో కిక్కిరిసింది. శ్రీ భ్రమరాంబ మల్లికార్జును స్వామి అమ్మవార్ల దర్శనానికి భక్తులు వేలాదిగా శ్రీశైలం తరలివచ్చారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు ఆరు గంటల సమయం పట్టే అవకాశముంది.
భక్తులు తెల్లవారుజాము నుండే పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి వేకువజాము నుంచే కార్తీక దీపాలను వెలిగిస్తున్నారు. ఆలయం ముందు భాగంలో గల గంగాధర మండపం దగ్గర, ఉత్తర శివమాఢవీధిలో భక్తులు కార్తీక దీపాలను వెలిగించి కార్తీక నోములు నోచుకుంటున్నారు. కార్తీకమాసంలో భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ముందస్తు ఆలోచనతో మల్లన్న భక్తులకు ఆది, సోమ, పౌర్ణమి, ఏకాదశి రోజులలో అలంకార దర్శనం మాత్రమే కల్పిస్తున్నట్లు ఆలయ ఈవో లవన్న తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ శివా క్షేత్రం శ్రీశైలం ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. పాతాళగంగలో భక్తులు భక్తిశ్రద్ధలతో కార్తీక పుణ్య స్నానాలను ఆచరిస్తున్నారు. కార్తీకమాసం చివరి సోమవారం కావడంతో మల్లన్న దర్శనానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి దర్శనం కోసం వేకువజాము నుంచే భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీ కారణంగా అధికారులు స్వామివారి గర్భాలయ స్పర్శ దర్శనాలు రద్దు చేశారు. భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనం కల్పిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Hindu Temples, Kartika masam, Lord Shiva