హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఆ కొండపైన రాయి కాదు కదా పూచికపుల్ల పట్టుకోవాలన్నా వణికిపోతారు..! కారణం ఇదే..!

ఆ కొండపైన రాయి కాదు కదా పూచికపుల్ల పట్టుకోవాలన్నా వణికిపోతారు..! కారణం ఇదే..!

ఎమ్మిగనూరు

ఎమ్మిగనూరు నడవలయ్యా స్వామి కొండపై వింత ఆచారం

సాధారణంగా మనం ఏదైనా కొండమీదకో.. గుట్టమీదకో వెళ్లామనుకోండి.. అక్కడ గుడి ఉంటే దేవుణ్ణి దర్శించుకొని అక్కడి నుంచి పూలో, పళ్లో కోసుకొస్తాం. ఏమీ లేకుండా కేవలం అడవి మాత్రమే ఉంటే కాసిన్ని కట్టెలు కొట్టుకొస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కర్నూలు జిల్లా (Kurnool District) లోని ఓ కొండపైకి వెళ్తే పూచిక పుల్లకూడా ముట్టుకోకూడదు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  సాధారణంగా మనం ఏదైనా కొండమీదకో.. గుట్టమీదకో వెళ్లామనుకోండి.. అక్కడ గుడి ఉంటే దేవుణ్ణి దర్శించుకొని అక్కడి నుంచి పూలో, పళ్లో కోసుకొస్తాం. ఏమీ లేకుండా కేవలం అడవి మాత్రమే ఉంటే కాసిన్ని కట్టెలు కొట్టుకొస్తాం. కానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) కర్నూలు జిల్లా (Kurnool District) లోని ఓ కొండపైకి వెళ్తే పూచిక పుల్లకూడా ముట్టుకోకూడదు. ఎమ్మిగనూరు మండలం గుడికల్‌ గ్రామంలో నేటికి ఓ వింత ఆచారం కొనసాగుతోంది. ఆ గ్రామంలోని కొండపై కొలువైన ఆంజనేయ స్వామిని నడవలయ్యగా గ్రామప్రజలు కొలుస్తారు. అసలు రహస్యమంతా ఆ కొండపైనే ఉంది. మామూలుగా మనం ఏ కొండప్రాంతానికైనా వెళితే చేతులు ఊరుకోవు. కనిపించిన పుల్లనో, చెట్టు కొమ్మనో పట్టుకుని ఆడుతూ పాడుతూ కొండ దిగుతాం. కానీ, ఈ కొండ మీద దైవదర్శనానికి వెళ్లి వచ్చే వాళ్లు కనీసం పూచికపుల్ల కూడా తీసుకురాకూడదట.

  ఆ గ్రామంలో పూర్వం నుండి కొనసాగుతోన్న వింత ఆచారం...!

  గుడేకల్ గ్రామంలో కొండపైన ఆంజయనేయ స్వామి వెలిశాడు. ఈ దేవాలయంలో వెలిసిన అంజన్నని గ్రామస్తులందరు నడవలయ్యా స్వామిగా పిలుచుకుంటారు. నిత్యం దూపదీప నైవేద్యాలతో పూజలు చేస్తారు. ఆ కొండ పై అడుగు పెట్టాలన్నా ఎంతో పవితంగ్రా ఉండాలని నాటి నుంచి వస్తున్న ఆచారం. మామూలుగా చాలా మంది కొండలమీద కట్టెపుల్లలు ఏరుకురావడం, కొమ్మలు నరకడం లాంటివి చేస్తూంటారు. కానీ, పూర్వం నుంచే ఆ కొండపై కట్టెలు కొట్టాలన్నా, రాళ్లను ముట్టుకోవాలన్నా గ్రామ ప్రజలు గుండెలు అదురుతాయి. దానికి కారణం లేకపోలేదు.

  ఇది చదవండి: గోదావరి అందాలు చూసేందుకు ఇదే సరైన సమయం.. ఒక్కసారి వెళ్తే మైమరచిపోతారు..!

  ఆ కొండ మీద ఆకులు కానీ, కట్టెలు కానీ, రాళ్లు కానీ ఏది ముట్టుకున్నా దేవుడి ఆగ్రహానికి గురౌతారని, కళ్ళు పోతాయని కులాలకు అతీతంగా అక్కడి గ్రామస్తులు నమ్ముతారు. ఊరిలో ఎంత కరువు వచ్చినా, ఎవ్వరైనా సొంత ఇల్లు కట్టాలనుకున్నా ఆ కొండపై నుంచి చిన్న రాయి ముక్క కూడా తీసుకురారు. అంతేకాదు ఆ కొండ మీద ఒక కట్టేముక్క కూడా నరకరు. ఒకవేళ మూఢనమ్మకం అని కొట్టిపారేసి మొండిగా వ్యవహరిస్తే కళ్ళు పోవడం, కాళ్ళు చేతులు పడిపోవడం, దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడతామని గ్రామస్తులు నమ్ముతున్నారు.

  ఇది చదవండి: విశాఖలో ఈ ఫాస్ట్‌ ఫుడ్‌కు యమ క్రేజ్‌...! తినేందుకు క్యూ కడుతున్న నగరవాసులు..!

  పూర్వం ఈ కొండమీద ఆదీవాసీలు ఉండేవారని గ్రామస్తులు చెబుతున్నారు. ప్రతి ఏడాది శ్రావణమాసంలో రెండో శనివారం ఇక్కడ ఉత్సవం నిర్వహిస్తారని…చుట్టుపక్కల గ్రామాల వాళ్లు కూడా పెద్ద ఎత్తున ఈ వేడుకలకు తరలివస్తారని గ్రామస్తులు చెబుతున్నారు. పూర్వీకుల నుంచి వస్తున్న ఇలాంటి ఆచారం గుడెకల్ గ్రామంలో నేటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఆ గ్రామంలో చదువుకున్న యువకులు, విద్యావంతులు ఎంతో మంది ఉన్నా కూడా ఇదే పద్ధతిని పాటిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో ఆ నడవలయ్యను పూజించి తమ కోర్కేలు తీర్చే కొంగుబంగారంలా కొలుస్తున్నారు.

  అడ్రస్‌: గుడికల్ గ్రామం, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌- 518360

  Kurnool Hill Temple_Gudikallu Map

  ఎలా వెళ్లాలి..!

  కర్నూలు నుంచి కోడుమూరు మీదగా ఎమ్మిగనూరు 80 కిలోమీటర్లు దూరం ఉంటుంది. అక్కడి నుండి గుడికల్ గ్రామానికి 6 కిలోమీటర్లు దూరంలో ఉన్న కొండపై నడవలయ్య స్వామి కొండ ఉంటుంది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News

  ఉత్తమ కథలు