Murali Krishna, News18, Kurnool
ఎందరో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాట వేసేందుకు పునాదులుగా వ్యవహరించే ఉపాధ్యాయులు ఆందోళన గురవుతున్నారు. 25 సంవత్సరాల అనుభవం ఉన్న తమకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా ప్రభుత్వంచూపిస్తున్న వైఖరిని నిరసిస్తూ ఉపాధ్యాయులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు కర్నూలు జిల్లా (Kurnool District) లోని విద్యాశాఖ కార్యాలయం ఎదుట మెట్లపై కూర్చుని తమ నిరసనను తెలియజేశారు. వర్క్ అడ్జస్ట్ మెంట్ వలన ప్రాథమిక పాఠశాలలు దెబ్బ తినకుండా చూడాలి. రాష్ట్రంలో వర్క్ అడ్జస్ట్ మెంట్ వలన అనేక మంది సెకండరీ గ్రేడ్ టీచర్లు సబ్జెక్టు ఎక్స్ పర్ట్ లు గా ఉన్నత పాఠశాలకు కేటాయిస్తున్నారు. దీనివలన ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు భోధన సౌకర్యాలు మెరుగు పడుతున్నాయి. ఈ విషయంలో ప్రభుత్వము తీసుకొంటున్న చర్యలు ప్రశంసనీయం.
కోర్టు కేసులు వున్నాయనే కారణంతో తెలుగు, హిందీ వారికి అదేశాలు ఇవ్వడం లేదు. అందువలన ఉన్నత పాఠశాలలో విద్యార్థులు తెలుగు మరియు హిందీ భాషల విషయంలో వెనుకబడే అవకాశాలు ఉన్నాయి కావున ప్రభుత్వం వారు కోర్టు నుండి ప్రత్యేక అనుమతి తీసుకొని వారికి అవకాశాలు కల్పించి వలసి ఉన్నది. ప్రస్తుతం వర్క్ అడ్జస్ట్మెంట్ వలన ప్రాథమిక పాఠశాలలో సిబ్బంది కొరత ఏర్పడుతోంది. కొన్ని ప్రాథమిక పాఠశాలల్లో వున్న అందరు సెకండరీ గ్రేడ్ టీచర్లకు ఆదేశాలు వచ్చిన పరిస్థితి ఏర్పడింది.
అందువల్ల అలాంటి పాఠశాలల్లో ప్రాథమిక విద్యాభోధన కుంటుపడకుండా మెర్జింగ్ సందర్భంలో ఉన్నత పాఠశాలకు తరలించిన సెకండరీ గ్రేడ్ టీచర్ లను వెంటనే మండల స్థాయి ప్రాథమిక పాఠశాలలో సర్దుబాటు చేయాలి.మరియు 1998 డి.ఎస్.సి అభ్యర్ధుల కు వెంటనే నియామక ఉత్తర్వులు ఇవ్వాలి. అవసరం అయిన చోట ప్రత్యేక డి ఎస్ సి ద్వారా సెకండరీ గ్రేడ్ టీచర్ ల నియామకం చేపట్టాలి. విద్యా వ్యవస్థలో ప్రాథమిక విద్య పునాది వంటిది.కాబట్టి విద్యా అనే భవనం పటిష్టంగా ఉండాలి అంటే ప్రాథమిక విద్యను బలోపేతం చేయాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News, Teachers