Murali Krishna, News18, Kurnool
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన పిఆర్సీ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కే.సురేష్ కుమార్ డిమాండ్ చేశారు. యూటీఎఫ్ ఉమ్మడి కర్నూలు జిల్లా ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ ధర్నాకు కర్నూలు, నంద్యాల జిల్లా (Nandyal District) ల అధ్యక్షులు జె.ఎల్లప్ప, ప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రకటించిన పీఆర్సీ వల్ల ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఒరిగిందేమీ లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చినటువంటి పీఆర్సీ విధానాన్ని యూటీఎఫ్‌తో పాటు మిగతా ఉపాధ్యాయ సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకస్తున్నాయన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే కుట్రపూరితంగా కొత్తగా తీసుకొచ్చినటువంటి పి ఆర్ సి విధానాన్ని అన్ని సంఘాలు ఒప్పుకున్నాయని వారికీ వారే సొంతంగా ప్రకటించుకుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ లా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తుందని కొత్త కొత్త విధివిధానాలతో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు కావలసినటువంటి బకాయిలను పక్కదారి పట్టించి తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుందని తెలిపారు. అంతేకాకుండా తమకు రావాల్సినటువంటి పెండింగ్‌లో ఉన్నటువంటి బకాయిలను చెల్లించాల్సింది పోయి. తమనే విమర్శించడం దుర్మార్గమైన చర్య అంటూ ఆందోళన చేశారు.
డిసెంబర్లో ఛలో ఢిల్లీ కార్యక్రమం
తమ సమస్యలను పరిష్కరించాల్సినటువంటి మంత్రులే ఈ రోజు ఉపాధ్యాయులు గొంతెమ్మ కోరికలు కోరితే తీర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదంటూ వ్యంగంగా మాట్లాడడం సిగ్గుచేటని తెలియజేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క ఉపాధ్యాయ సంఘాలు కూడా గొంతెమ్మ కోరికలు కూరలేదని కేవలం తమకు రావాల్సినటువంటి వివిధ రకాలైన అలవెన్స్‌ల బకాయిలను మాత్రమే అడుగుతున్నామని తెలిపారు.
ఇకనైనా ప్రభుత్వం స్పందించి ఆసమస్యలను పరిష్కరించాలని లేని పక్షంలోసీపీఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ డిసెంబరులో ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని చేపట్టినట్లు పేర్కొన్నారు. సీపీఎ్‌సను కొన్ని రాష్ట్రాల్లో రద్దు చేస్తూ ఓపీఎస్ విధానంతో ముందుకు వెళ్లాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సీపీఎస్ స్థానంలో జీపీఎ్‌సను తీసుకువచ్చిందని విమర్శించారు. ఈ రెండు విధానాలు ఆమోదయోగ్యమైనవి కావన్నారు.సీపీఎ్‌సను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 30 న రాష్ట్ర రాజధానిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టబోతున్నామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News