హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: మీరు డిగ్రీ పూర్తి చేశారా..? అయితే మీకో శుభవార్త.. పూర్తి వివరాలు ఇవే

Kurnool: మీరు డిగ్రీ పూర్తి చేశారా..? అయితే మీకో శుభవార్త.. పూర్తి వివరాలు ఇవే

డిగ్రీ పూర్తైన వారికి చక్కటి అవకాశం..  వివరాలు ఇవే..!

డిగ్రీ పూర్తైన వారికి చక్కటి అవకాశం.. వివరాలు ఇవే..!

Kurnool: మీరు డిగ్రీ పూర్తి చేశారా.. మంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా.. చేస్తున్న పని కన్నా ఇంకా మంచి ఉద్యోగం కావాలి అనుకుంటున్నారా..? అయితే మీకు ఓ శుభవార్త.. అదిరిపోయే అవకాశాలు అందిస్తోంది ఓ సంస్థ..

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India

Murali Krishna, News18, Kurnool

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నిరుద్యోగులకు (Unemployees) శుభవార్త.. ముఖ్యంగా డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నా.. మంచి ఉద్యోగం కోసం ఎదరు చూస్తున్న వారికైనా ఇది గుడ్ న్యూసే.. ఎందుకంటే.. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు (Degree Completed Students) చక్కటి అవకాశం కల్పిస్తున్నారు రాంకో సిమెంట్ ప్రైవేట్ లిమిటెడ్ వారు. డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగం కోసం ఎదురు చూసే నిరుద్యోగ యువకులు హాజరు కావచ్చని అధికారులు తెలియజేసారు. ఈ మేరకు కర్నూల్ పట్టణంలోని సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో జనవరి 10వ తేదీన రాంకో సిమెంట్ వారి సహకారంతో కళాశాలలో ప్లేస్మెంట్ నిర్వహిస్తున్నట్లు సెయింట్ జోసెఫ్ (St Josef ) డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ తెలియజేశారు.

ఈ ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెస్యూమ్, జిరాక్స్ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటోతో పాటు ఫార్మల్ డ్రెస్లో రావాల్సి ఉంటుంది. కావున డిగ్రీ పూర్తి చేసిన వారు అలాగే డిగ్రీ చదువుతున్న వారు కూడా ఈ ప్లేస్మెంట్ డ్రైవ్ లో పాల్గొనవచ్చుననికళాశాల సిబ్బంది తెలియజేసారు.మరిన్ని వివరాలకు కళాశాలలో సిబ్బందిని సంప్రదించవచ్చని తెలియజేశారు.

ఉద్యోగి పాత్ర :-

ట్రైనీ కెమిస్ట్ / డిప్యూటీ ఆఫీసర్

ట్రైనీ అకౌంట్స్ / అసిస్టెంట్ ఆఫీసర్

విద్య :-

2021,2022 మరియు 2023

డిగ్రీలో బీ.ఎస్సీ కెమిస్ట్రీ, బీ.కాం కంప్యూటర్స్

ఇదీ చదవండి : ఆర్థిక రాజధాని విశాఖలో మరో మెగా ఈవెంట్.. విదేశాల నుంచి ప్రముఖ వైద్యుల హాజరు.. ఎందుకో తెలుసా?

అర్హతలు :-

ఈ ప్లేస్మెంట్ రైతు హాజరయ్యే విద్యార్థులు డిగ్రీలో అన్ని సెమిస్టర్లలో 60% మాటలతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి

అదేవిధంగా 10వ తరగతి,ఇంటర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన వారు లేక 60% మార్కులతో మొదటిసారి పాస్ అయిన వారు అర్హులు.

ఇదీ చదవండి : ఏపీలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ ఏర్పాట్లు.. జాతీయ ప్రధాన కార్యదర్శి ఎవరంటే..?

అడ్రస్ :-

సెయింట్ జోసెఫ్ డిగ్రీ కాలేజ్,

సుంకేసుల రోడ్డు,

కర్నూలు .

సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు :-

1. 7798211245

2.9032222412

రిజిస్ట్రేషన్ కొరకు :-

https://ramcocements.net/RECAPPS

First published:

Tags: Andhra Pradesh, Ap jobs, AP News, Kurnool, Local News

ఉత్తమ కథలు