T. Murali Krishna, News18, Kurnool
కర్నూలు జిల్లాలోని నిరుద్యోగులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ (APSSDC&SEEDAP) వారి ఆధ్వర్యంలో 09-12-2022 నాడు ఉదయం 9 గంటల నుండి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుందని జిల్లా ఉపాధి కల్పనాధికారి సోమశివారెడ్డి, PD DRDA శ్రీధర్ రెడ్డి SEEDAP అధికారి కిరణ్ DSDO ప్రతాప్ రెడ్డి తెలిపారు. కళాశాల ప్రిన్సిపల్ శివ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
10వ తరగతి, ఇంటర్మీడియెట్, డిగ్రీ, ఎంబీఏ, డిప్లొమా, మొదలగు అన్ని రకాల విద్యార్హతలు కలిగిన నిరుద్యోగ యువత ఈఉద్యోగ మేళాకు హాజరుకావచ్చు అని తెలిపారు. ఇందులో 12 ప్రముఖ కంపెనీలుఉద్యోగులను ఎంపిక చేసుకోవడానికి ప్రభుత్వంతో అవగాహన ఏర్పరచుకొని ఈ జాబ్ మేళానునిర్వహిస్తున్నాయి.
ఎంపికయిన ఉద్యోగ స్థాయిని బట్టి జీతం రూ.10 వేలనుండి 25 వేలవరకు ఉంటుంది.
1. సంస్థపేరు :- ICICI BANK
ఉద్యోగ పాత్ర :- బ్యాంక్ రిలేషన్షిప్ మేనేజర్
విద్యార్హత :- ఏదైనా డిగ్రీ / బీ.టెక్
ఉద్యోగం చేయవలసిన ప్రదేశం :- ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ
జెండర్ :- పురుషులు/ స్త్రీలు
వయస్సు :-18 - 25 సంవత్సరాలు
ఖాళీల సంఖ్య :- 50
వేతనం :- 16,000 నుంచి 25,000 రూపాయలు నెలకు
2. సంస్థపేరు :- గ్రీన్ టెక్ ఇండస్ట్రీస్
ఉద్యోగ పాత్ర :- CNC మిషన్ ఆపరేటర్
విద్యార్హత :- బీ.టెక్ మెకానికల్/ ఏదైనా డిప్లోమా / ఐటీఐ
జెండర్ :- పురుషులు
వయస్సు :-19 - 30 సంవత్సరాలు
ఖాళీల సంఖ్య :- 150
వేతనం :- నెలకు 11,500 నుంచి 13,000 ఫ్రీ ఫుడ్ అండ్ అకామిడేషన్ సదుపాయం కల్పించబడును
ఉద్యోగం చేయవలసిన ప్రదేశం :- నాయుడుపేట నెల్లూరు డిస్ట్రిక్ట్
3. సంస్థ పేరు :- డైకిన్
ఉద్యోగ పాత్ర :- క్వాలిటీ/ ప్రొడక్షన్
విద్యార్హత :- డిప్లోమా మెకానికల్/ ఆటోమొబైల్ / ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ 2020, 21, 22 పాస్ అయిన వారు అర్హులు
జెండర్ :- పురుషులు
వయస్సు :19 - 25 సంవత్సరాలు
ఖాళీల సంఖ్య :- 100
వేతనం :- మొదటి సంవత్సరం 1. 99 లక్షలు మరియు రెండవ సంవత్సరం 2.43 లక్షలు / మూడవ ఏడది 3.02 లక్షలు వేతనం కల్పించబడును
ఉద్యోగం చేయవలసిన ప్రదేశం :- శ్రీ సిటీ నెల్లూరు
ఉద్యోగ మేళాకు హాజరయ్యే నిరుద్యోగులు రెస్యూమ్, జిరాక్స్ విద్యార్హత పత్రాలు, ఆధార్ కార్డ్ , పాన్ కార్డ్ , పాస్పోర్ట్ సైజ్ ఫోటో తో పాటు ఫార్మల్ డ్రెస్లో రావాల్సి ఉంటుంది. జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు తెలియజేశారు.
ఉద్యోగం మేళా జరుగు ప్రదేశం
నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతుంది.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు :-
1.9652949755
2.9701303790
3.8897694291
4.6303397635
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News