Murali Krishna, News18, Kurnool
అల్లరి చేయకుండా మంచిగా ఉంటే చెవికి కమ్మలు తెస్తానంటూ ఆనందంగా పోయిన తల్లికి కడుపుకోతే మిగిలింది.. ఇంటి వద్దనే ఆడుకుంటూ అవ్వ,తాతల మాట వింటే దండిగా చాకెట్లు తెస్తానన్న నాన్నకు ఆ చెవిన చేదు మాటలు వినపడ్డాయి. ముద్దు ముద్దుగా పిల్లలకు తాము చెప్పిన మాటలే చివరివయ్యాయి. కరువు ప్రాంతమైన రాయలసీమ(Rayalaseema) జిల్లాల్లో పొట్టకూటికోసం వలసబాటలు ఆగటంలేదు... కర్నూలు జిల్లా (Kurnool District) లో ఒకపక్క అధిక వర్షాలు మరోపక్క నకిలీ పత్తివిత్తనాలు రైతులను మరో పక్కా కూలీలను తీవ్రంగా నష్టపరిచింది. జిల్లాలో ఉపాధి దొరకకా కొన్ని ఊర్లు పక్కా రాష్ట్రాలకు వలస బాట పట్టాయి...పొట్టకూటికోసం మూతముళ్లు చేతపట్టుకుని పిల్లలను ఇంటి దగ్గరే ముసలి వాళ్ళ దగ్గర వదిలేసి వెళ్ళేపోతున్నారు దీంతో పిల్లలు తల్లితండ్రుల ప్రేమప్యాయతలకు దూరమవుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేములకు చెందిన వీరేశ్, భారతి దంపతులు పొట్టకూటికోసం వలస వెళ్లారు వెళుతు వెళ్తు పిల్లలను ఇంటి పట్టనే వదిలివెళ్లారు.వీరేశ్, భారతి దంపతులకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. గ్రామంలో కూలీ పనులకు వెళ్లి జీవించే వారు. పనులు లేకపోవడంతో ఉపాధి కోసం దంపతులు అక్టోబరులో తెలంగాణ రాష్ట్రానికి వలస వెళ్లారు.
వారి ఇద్దరు పిల్లలను ఇంటి వద్దే అవ్వ, తాత, పిన్ని, బాబాయి వద్ద వదిలి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం చిన్నారి సౌజన్య గుడిసెలో మంచంపై కూర్చొని చరవాణి చూస్తూ అన్నం తింటుండగా విషపురుగు కాటేసింది.తననూ కాటేసింది విషపురుగు అయిన పాము అని చిన్నారికి తెలియక ఏదో ఎలుక కొరికిందని తాత, బాబాయికి చెప్పింది.
కుటుంబ సభ్యులు చిన్నారి కాలుపై పాము కాట్లు గుర్తించడంతో వెంటనే కోడుమూరు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే పాప మృతి చెందినట్లు వైద్యులు చెప్పడంతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ రాష్ట్రంలో బతకడానికి వెళ్లిన తల్లిదండ్రులు విషయం తెలుపగా అక్కడకి నుండి అష్టకష్టాలు మీద స్వగ్రామంకు చేరుకున్న తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురును విగతజీవిగా ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించిన తీరు అందరిని కలిచివేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Kurnool, Local News