(T.Murali Krishna,News18,Kurnool)
ఈ రోజుల్లో ఏదైనా వ్యాధి వచ్చిందంటే ఆ వ్యాధి కంటే దాని చికిత్సకయ్యే ఖర్చును తలచుకుని ఆందోళన, దిగులు చెందే పరిస్థితి ఏర్పడింది. ప్రభుత్వ ఆసుపత్రులు దవాఖానాలు ఉన్నా, తక్కువ ధరలో లభ్యమయ్యే మందులు ఉన్నా వాటిపై అవగాహన ఉండేది కొద్దిమందికి మాత్రమే.బ్రాండెడ్తో మందులతో పోలిస్తే జనరిక్ మెడిసిన్(Generic medicine)చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. నాణ్యత కూడా బ్రాండెడ్(Branded)మందులకు ఏ మాత్రం తగ్గకుండా ఉంటుంది. కర్నూలు(Kurnool)ప్రభుత్వ సర్వజన వైద్యశాల(Government General Hospital)లో మూడు మెడికల్ షాపులు(Medical shops)జీవన ధార ,వైస్సార్ ఆరోగ్య సిరి వంటి దవాఖానలు ఉన్నాయి.
మంచి మందులు తక్కువ ధరకే..
2014 నుంచి ఈ మూడు దుకాణాలను జనరిక్ మందుల విక్రయశాలలుగా మార్చారు. ప్రస్తుతం జీవనధార మందుల దుకాణాలుగా ఇవి ప్రజలకు తక్కువ ధరలకే మందులను అందుబాటులో ఉంచాయి .వీటితో పాటు ప్రైవేటుగా కేంద్ర ప్రభుత్వ సహాయంతో పలువురు వ్యక్తులు జనరిక్ మందుల దుకాణాలను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇవి 10కి పైగా మెడికల్ షాపులు ఉన్నాయి. అయితే వైద్యుల ప్రోత్సాహం లేని కారణంగా వీటికి ఆదరణ తక్కువగా ఉంటోంది. జనరిక్ మందులు నాణ్యత ఉండవని కొంతమంది ప్రైవేట్ డాక్టర్స్ చెబుతూ అధికంగా బ్రాండెడ్ మందులనే వైద్యులు రోగులకు సూచిస్తున్నారు. ఎవరైనా రోగం తగ్గించుకునేందుకు ఎంత ఖర్చుకైనా వెనుకాడటం లేదు. దీన్ని ఆసరాగా చేసుకుని వైద్యులు బ్రాండెడ్ మందులనే రోగులకు సూచిస్తున్నారు.
జనరిక్ మెడిసినే బెటర్..
బ్రాండెడ్ మందులు రోగులకు రాస్తే ఆయా బ్రాండెడ్ ఫార్మాకంపెనీలు వైద్యులకు భారీగా కమీషన్లు ముట్టజెబుతున్నాయన్నది బహిరంగ రహస్యం. ఈ కారణంగానే వారు తక్కువ ధరకు లభించే జనరిక్ మందులను ప్రోత్సహించడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. భారతీయ వైద్య విధాన మండలి సైతం జనరిక్ మందులే రాయాలని పలుమార్లు హెచ్చరించినా ప్రైవేట్ వైద్యుల్లో మాత్రం ఎలాంటి మార్పు రావడం లేదు. ఆఖరికి కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని కొంతమంది ప్రభుత్వ వైద్యులు సైతం ఆసుపత్రికి వచ్చే రోగులకు జనరిక్ మందులను సూచించాల్సింది పోయి బ్రాండెడ్ మందులే రోగులకు రాస్తున్నారు. జనరిక్ మందులు రాస్తే రోగులకు 70 నుంచి 80 శాతం ఖర్చు తగ్గుతుందని తెలిసినా వారు మాత్రం ఆ పనిచేయకపోవడంపై తీవ్రమైన విమర్శలు వెలువెత్తుతున్నాయి.
రోగులకు బాసట..
బ్రాండెడ్ మందులకు జనరిక్ మందులకు ఎలాంటి మార్పూ ఉండదు.బ్రాండెడ్, జనరిక్ మందుల్లో ఉండేది ఒకే రకమైన ఔషధమే. బ్రాండెడ్ మందులకు ఉత్పత్తి ఖర్చుతో పాటు డీలర్, హోల్సేల్, రిటైల్ల లాభాలు, వైద్యుల కమీషన్లు అందులోనే ఉంటాయి కాబట్టి వాటి ధర అధికంగా ఉంటుంది .ఉదాహరణకు డోలో 650mg అనేది బ్రాండెడ్ మందు. పారాసిటమాల్ అనేది దాని జనరిక్ పేరు వీటిని తీవ్రమైన జ్వరం కానీ వొళ్ళు నొప్పులు ఉన్నపుడు వీటిని ఎక్కువగా ఉపయిగిస్తుంటారు వైద్యులు పారాసిటమాల్ అని రాయాలి కానీ అలా చేయడం లేదు. నోవామాక్స్ అనేది బ్రాండెడ్ కాగా అందులోని అమాక్సిలిన్ జనరిక్ మందు పేరు. అయితే కొన్ని ఫార్మాకంపెనీలు ఏది బ్రాండెడ్ మందో, ఏది జనరిక్ మందో తెలియనంతాగా మందులు తయారు చేస్తూ వైద్యులనే అయోమయానికి గురిచేస్తున్నాయి.
వైద్యుల సూచన..
వీటిపై స్పందించిన కర్నూలు మెడికల్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ చింత ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు బ్రాండెడ్ వాడుతుని రోగాలు తాగుతాయని అపోహలను విడి జనరిక్ మందులను వాడాలని సూచించారు. బ్రాండెడ్ మందులకు జనరిక్ మందులకు మధ్య ఎలాంటి తేడా ఉండదని బ్రాండెడ్ మందులు వాడితేనే రోగం నయమవుతుందని అపోహను వీడి తక్కువ ధరలో లభించే జనరిక్ మందులను వాడాలని కోరారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Kurnool, Local News