• Home
  • »
  • News
  • »
  • andhra-pradesh
  • »
  • KURNOOL GANJIHALLI VILLAGE NOT SELLING MILK BECAUSE OF THE CURSE OF A PRIEST IN KURNOOL DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Andhra Pradesh: ఆ ఊళ్లో పాలు అమ్మితే అంతే సంగతులు… ఆయన శాపమే కారణమా..?

ప్రతీకాత్మక చిత్రం

దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం ఆ ఊళ్లో ఓ పెద్దాయన ఉండేవారు. ఆయన శాపంతోనే గ్రామస్తులు ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది.

  • Share this:
    పాలు. ప్రతి ఒక్కరి జీవితంలో నిత్యాసవరం. పాలు లేకుంటే ఏ ఇంట్లోనూ పూటగడవదు. టీ, కాఫీ, పెరుగు, మజ్జిగ ఇలా రోజువారీ ఆహారంలో భాగమైన అతి ముఖ్యమైన పదార్ధాలాన్నింటికీ మూలం పాలే. ప్రస్తుతం లీటర్ పాల ధర క్వాలిటీని బట్టి మార్కెట్లో రూ.60 నుంచి రూ.80 వరకు ఉంది. కానీ ఓ గ్రామంలో మాత్రం స్థానికులకు లీటర్ పాల ధరంతో తెలియదు. అసలు వాళ్లు పాలు కొనరు. అమ్మరు. కావాలంటే ఫ్రీగా పోస్తారు. ఈ రోజుల్లో పాలు ఫ్రీగా ఇచ్చేవారు కూడా ఉన్నారా అని ఆశ్యర్యపోతున్నారా. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా, గోనెగండ్ల మండలం గంజిహళ్లి గ్రామంలో పాలతో వ్యాపారం జరగదు. ఈ గ్రామంలో దాదాపు 1,100 కుటుంబాలు నివాసం ఉంటుండగా.. 4,750 మంది జనాభా ఉన్నారు. గ్రామంలో 120 ఆవులు, 20కి పైగా గెదెలున్నాయి. రోజుకు దాదాపు వెయ్యి లీటర్ల పాలు ఉత్పత్తి అవుతాయి. ఈ పాలను గ్రామస్తులకు గానీ, డెయిరీలకు గానీ విక్రయించరు. అసలు పాలు అమ్మడం అనే మాటే వారికి నచ్చదు. గ్రామంలో ఎవరైనా పాలు కావాలని అడిగితే మాత్రం పైసా తీసుకోకుండా పోస్తారు.

    ఆయన శాపమే కారణమా..?
    గంజిహళ్లి ప్రజలు ఆచరించే ఈ సంప్రదాయం వెనుక ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ ఉంది. దాదాపు నాలుగు దశాబ్దాల క్రితం గ్రామంలో బడే సాహెబ్‌ తాత అనే పెద్దాయన ఉండేవారు. గ్రామంలో ఆయన పేరిట ఇప్పటికీ ఓ దర్గా ఉంది. అప్పట్లో ఆయనకు నాగిరెడ్డి అనే రైతు ఉచితంగా పాలు పంపేవాడు. ఒకరోజు బడే సాహెబ్‌ తాత కుమారుడు హుసేన్‌ సాహెబ్‌ పాల కోసం గిన్నెతో నాగిరెడ్డి ఇంటికి వెళ్లగా.. పాలిచ్చే ఆవు చనిపోవడంతో ఖాళీ గిన్నెతో తిరిగొచ్చాడు. ఇంటికెళ్లిన హుసెన్ సాహెబ్.. బడే సాహెబ్ కు జరిగిన విషయం చెప్పాడు. దీంతో గ్రామంలో ఎవరింటికైనా వెళ్లి పాలు తీసుకురమ్మని చెప్పగా.. గ్రామంలో అవులున్నవారెవరూ పాలు పోయలేదు.

    ఇది చదవండి: ఏపీలో తగ్గని పాజిటివిటీ రేటు.. అదొక్కటే ఊరట


    దీంతో బడే సాహెబ్ తాతా.. చనిపోయిన ఆవును బతికించాడట.. ఆ రోజు నుంచి గ్రామంలో ఎవరూ పాలు అమ్మవద్దని.. ఎవరైనా ఉచితంగా పోయాల్సిందేనని.. అలా కాదని పాలు అమ్మితే వారి ఇల్లు నాశనమైపోతుందని శపించాడట. అంతేకాకుండా ఆవుల్ని చంపడం, వాటి మేతను నాశనం చేయడం వంటి పనులు చేయవద్దని చెప్పాడట. దీన్ని అతిక్రమించి కొందరు పాలు అమ్మడంతో ఆ కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోయారని గ్రామస్తులు చెబుతారు. దీంతో అప్పటి నుంచి గ్రామంలో ఎవరూ పాలు అమ్మడం లేదు. గ్రామంలోని హోటళ్లు, టీ స్టాల్ నిర్వహాకులు కూడా ఇతర గ్రామాల నుంచి పాలు తెచ్చుకుంటుంటారు.

    ఇది చదవండి: రేపటి నుంచి కంప్లీట్ లాక్ డౌన్.. వారం రోజులు అన్నీ బంద్.. ఎక్కడంటే..!

    Published by:Purna Chandra
    First published: