హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: పరువు కోసం పగ.. చివరికి ఎంత పనిచేశారో చూడండి..

Kurnool: పరువు కోసం పగ.. చివరికి ఎంత పనిచేశారో చూడండి..

కర్నూలు జిల్లాలో యువకుడిపై హత్యాయత్నం

కర్నూలు జిల్లాలో యువకుడిపై హత్యాయత్నం

Kurnool: ఇటీవలి ప్రేమ వివాహం చేసుకున్నారు అనే కోపంతో యువకుడిపై యువతీ బంధువులు కత్తులతో దాడి చేయడం జిల్లాలో తీవ్ర దుమారం రేపింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool | Andhra Pradesh

Murali Krishna, News18, Kurnool

ఇటీవలి ప్రేమ వివాహం చేసుకున్నారు అనే కోపంతో యువకుడిపై యువతీ బంధువులు కత్తులతో దాడి చేయడం జిల్లాలో తీవ్ర దుమారం రేపింది. ఈ నేపథ్యంలోనే బాధితురాలు సుకన్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని 10 మంది నిందితులను అదుపులోకి తీసుకుని వివరాలను మీడియాకు వివరించారు. కులాంతర వివాహం చేసుకున్నాననే అక్కసుతో నవంబర్ 24 వ తన భర్తను చంపేందుకు తన తండ్రి మరికొందరు కుట్ర చేశారంటూ యువతి చేసిన ఫిర్యాదు మేరకు పది మందిని అరెస్టు చేసినట్లు ఆదోని డీఎస్పీ వినోద్‌కుమార్‌ తెలిపారు. కర్నూలు జిల్లా (Kurnool District) పెద్దకడబురు మండలం హెచ్.మురవణి గ్రామానికి చెందిన వీరేష్ అదే గ్రామానికి చెందిన సుకన్య గత కొన్నేలుగా ప్రేమించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు అయితే వీరి ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్ళికి పెద్దలు పెద్దలు నిరాకరించారు. కానీ వీరేష్ సుకన్యలు మాత్రం పెద్దలను ఎదిరించి వివాహం చేసుకున్నారు. దీంతో అమ్మాయి తరుపు బంధువులు వారి మీద కోపంతో పథకం ప్రకారం వీరేష్ను హత్య చేయాలని కుట్ర పన్ని వీరేష్ ను విచక్షణ రహితంగా వేటకొడవలతో దాడి చేసి పొలాల్లో పడేశారు.

ఇది చదవండి: బెజవాడలో ఎవరిష్టం వాళ్లది..! ఏం చేసినా పట్టించుకోరా..?

అటుగా వెళుతున్న కొంతమంది స్థానికులు గమనించి బాధితుడుని ఎమ్మిగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న వీరేష్ పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలియజేయడంతో. వీరేష్ భార్య అయినటువంటి సుకన్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఇది చదవండి: రైలు పట్టాలపై సినిమాటిక్ సీన్.. నిజంగా నువ్వు దేవుడు సామీ

కేసు నమోదు చేసుకున్న పోలీసులు దాడి చేసిన వారైనా అమ్మాయి తరపు బంధువులు 10 మంది పై అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేశారు.హత్యాయత్నానికి పాల్పడిన సుకన్య తండ్రి ఉశేని, గుమ్మలలాజర్‌, మోహన్‌, పెద్ద గుంటెప్ప, సుందరరాజు, హనోక్‌, అనీల్‌, కొలిమి నరసన్న, సుదర్శన్‌, జెలికె గుంటెప్పలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు అదోని డీఎస్పీ వినోద్ కుమార్ తెలిపారు.

ప్రస్తుతం బాధితుడు వీరేష్ కర్నూలు ఆసుపత్రిలో చికిత్స పొందుతు కోలుకుంటున్నాడు అని ఆదోని డి.ఎస్.పి వినోద్ కుమార్ తెలిపారు...అదే విధంగా ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ప్రత్యేక చర్యలు చెప్పడతామని తెలిపారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు