హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: దేశమంతటా గణేష్‌ నిమజ్జనాలు ముగిశాయి.. ఈ గణపయ్యను మాత్రం విసర్జన చేయలేదు.. ఎందుకో తెలుసా?

Kurnool: దేశమంతటా గణేష్‌ నిమజ్జనాలు ముగిశాయి.. ఈ గణపయ్యను మాత్రం విసర్జన చేయలేదు.. ఎందుకో తెలుసా?

అక్కడ

అక్కడ గణేషుడ్ని నిమజ్జనం చేయరా..?

Ganesh Immersion: దేశ వ్యాప్తంగా గణేష్‌ ఉత్సవాలు వైభంగా ముగిశాయి.. సంబరాల నడుమ లంబోదరుడికి వీడ్కోలు పలికారు. అయితే ఈ గణనాథుడిని మాత్రం నిమజ్జనం చేయలేదు.. ఎందుకు.. అంతేకాదు మిమ్మల్ని చేతులెత్తి ఆశ్వీరదిస్తాడు.!

 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool

  Ganesh Immersion: నవ రాత్రులు ప్రత్యేక పూజలు అందుకున్న వినాయకుడు (Lord Ganesha).. ఉత్సవాలు ముగిశాయి.  సంబరాల నడుమ లంబోదరుడికి వీడ్కోలు పలికారు. అయితే కర్నూలు (Kurnool) లోని ఈ గణనాథుడిని మాత్రం నిమజ్జనం (Ganesh Immersion) చేయలేదు.. ఎందుకంటే ఈ గణపయ్యకు మీరు నమస్కారం పెడితే చాలు మిమ్మల్ని చేతులెత్తి ఆశ్వీరదిస్తాడు. ఎలానో తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే..!

  కర్నూలు నగరంలోని పదో తరగతి (10th Class) మాంటిస్సోరి ఇండస్ పాఠశాల విద్యార్థులు తమ సృజనాత్మకతతో రోబోటిక్‌ లంబోదరుడిని (Robotic Ganesh) రూపొందించారు. ఆ స్కూల్‌లోని రోబోటిక్ ఉపాధ్యాయుడు మహేష్  సహకారంతో రెండు నెలలు కష్టపడి విద్యార్థులు ఈ రోబోటిక్ వినాయకుని తయారు చేశారు.

  వినాయక ఉత్సవాల్లో ఈ చిట్టి వినాయకుడు ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. ప్రత్యేకంగా లేగో మైండ్ స్టోన్ అనే ప్రొడక్ట్ ద్వారా ఈ రోబోటిక్ వినాయకుని తయారు చేశామని విద్యార్థులు తెలిపారు. ఈ లంబోదరునికి మీరు దండం పెడితే చాలు మిమ్మల్ని మనసారా ఆశీర్దించేస్తాడు. అదే ఈ బొమ్మలోని స్పెషాలిటీ. భక్తులను ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం కూడా అదే. అదంతా కూడా సెన్సార్‌ ద్వారానే జరుగుతుంది.

  ఇదీ చదవండి: పోలీసు జాగిలం రానా మృతి..! తోటి పోలిస్‌ డాగ్స్‌ ఏం చేశాయో చూడండి

  ఎలక్ట్రానిక్ సెన్సార్ దగ్గర రోబోటిక్ వినాయకుడికి ప్రజలు ఎవ్వరైనా దండం పెడితే వెంటనే సెన్సార్ యాక్టివ్ అయ్యి చేయి పైకి లేచి ఆశీర్వదించే పొజిషన్‌లోకి వస్తుంది. అదే సమయంలో తొండం కూడా కదిలేలా దీన్ని డిజైన్‌ చేశారు. ఈ బొమ్మను చూసిన భక్తజనం, ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. విద్యార్థుల తల్లిదండ్రులైతే వాళ్ల పిల్లల మేధోసంపత్తికి మురిసిపోతున్నారు. విద్యార్థులు తమ ప్రతిభతో అందరిని ఆకర్షించారు.

  ఇదీ చదవండి: ఏపీకి పెట్టుబడుల ప్రవాహం.. దేశంలో నెంబర్ వన్ స్థానం.. కొత్త పెట్టుబడులు ఇవే..

  ఈ క్రమంలో తమకు ఈ రోబోటిక్ వినాయకుడిని తయారు చేసేందుకు సహాయ సహకారాన్ని అందించినటువంటి పాఠశాల రోబోటిక్ శిక్షణ ఉపాధ్యాయులు మహేష్‌కి విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. నేటి సమాజంలో పిల్లలు ఖాళీ సమయం దొరికినప్పుడల్లా మొబైల్‌ పట్టుకుని కూర్చుకుంటారు. కానీ కొంతమంది పిల్లలు తమ ఖాళీ సమయాన్ని నైపుణ్యాలను మెరుగుపరుచుకునేంఉదకు వాడుకుంటారు. అలాంటి విద్యార్థుల ఆసక్తిని గమనించి మంచి ప్రోత్సాహం అందిస్తే విద్యార్థి దశ నుంచే వారిలో పరిశోధనలపై ఆసక్తి పెరుగుతుందని టీచర్‌ మహేష్‌ తెలిపారు.

  ఇదీ చదవండి: వివేకా హత్య కేసులో సీబీఐ చేతులెత్తేసిందా..? విచారణ ఈ నెల 22కు వాయిదా..?

  విద్యార్థులకు చిన్ననాటి నుంచే పరిశోధనాశక్తిని పెంపొందించేందుకు తమ పాఠశాలలో ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు మహేష్‌ తెలిపారు. ఆ క్లాసెస్‌ వల్ల విద్యార్థులు మరింత మెరుగ్గా ఆలోచిస్తున్నారు…తమలోని క్రియేటివితో ఈ రోబోటిక్‌ గణేష్‌ని తీర్చిదిద్దారు. విద్యార్థులు ఇలా భవిష్యత్‌లో మరెన్నో ప్రయోగాలు చేయాలని కోరుకుందాం.

  ఫోన్‌ నెంబర్‌: కె. మహేష్, 7416342466

  స్కూల్‌ అడ్రస్‌:మాంటెస్సోరి ఇండస్ స్కూల్‌, డిన్నదేవరపాడు రోడ్, కర్నూలు

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ganesh Chaturthi​ 2022, Ganesh immersion, Ganesh Visarjan 2022, Kurnool

  ఉత్తమ కథలు