హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Kurnool: కదిలే అంబారీపై లంబోదరుడు సవారీ.. ఈ గణపతి ప్రత్యేకత ఏంటో తెలుసా..?

Kurnool: కదిలే అంబారీపై లంబోదరుడు సవారీ.. ఈ గణపతి ప్రత్యేకత ఏంటో తెలుసా..?

కదిలే

కదిలే ఏనుగుపై లంబోదరుడు

Ganesh Chaturthi: దేశ వ్యాప్తంగా గణేష్‌ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇక కర్నూలులో వినూత్నంగా ఏర్పాటు చేసిన గణేషుడి విగ్రహం ప్రత్యేకంగా నిలుస్తోంది. వస్త్ర దుకాణం వ్యాపారాలు ఏర్పాటు చేసిన గణనాథుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. ప్రత్యేకత ఏంటంటే?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India

  Murali Krishna, News18, Kurnool.

  Ganesh Chaturthi: దేశ వ్యాప్తంగా గణేష్‌ ఉత్సవాలు (Ganesh Chaturthi  Celebrations) ఊపందుకున్నాయి. వాడవాడలా వివిధ రూపాల్లో విఘ్ననాథుడు కొలువుదీరాడు. రకరకాల బొజ్జ గణపయ్యలను పూజించి మొక్కలు తీర్చుకుంటున్నారు. అటు కర్నూలులోనూ వినూత్నంగా గణేషుని విగ్రహాలను ఏర్పాటుచేశారు. ముఖ్యంగా కర్నూలులో వస్త్ర దుకాణం వ్యాపారాలు ఏర్పాటు చేసిన గణనాథుడు అందరినీ ఆకట్టుకుంటున్నాడు. మించిన్ బజార్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 45 ఏళ్లుగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఎప్పటిలానే ఈ ఏడాది కూడా వినూత్నంగా పార్వతీ తనయుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కదిలే ఏనుగుపై కూర్చుని భక్తులను దివిస్తున్న వినాయకుని ప్రతిమ అందిరినీ ఆకట్టుకుంటోంది. ఈ గణేషుని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటున్నారు.

  మించిన్ బజార్‌లో ప్రతి సంవత్సరం వివిధ రూపాలలో వినాయకుని ప్రతిమలు ఏర్పాటు చేస్తుంటారు. అలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా సేలం నుంచి తెప్పించిన ఈ వినాయకుడి విగ్రహం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టితోనే తయారు చేసినటువంటి వినాయకుడు విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

  విగ్రహం దగ్గర ఏర్పాటు చేసిన ఏనుగు అటు ఇటు తల ఊపుతున్నట్లుగా ఉంటుంది. ఇదే ఇక్కడ ప్రత్యేకం. మండపాన్ని కూడా అంగరంగ వైభవంగా అలంకరించారు. ప్రతి రోజు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి కార్యక్రమంలో పాల్గొన్న వారికి ప్రత్యేక బహుమతులు కూడా అందజేస్తున్నారు. చిన్నారుల నృత్యాలు భక్తులను అలరిస్తున్నాయి. ఈ వినాయకుడిని ఏర్పాటు చేయడం కోసం మించిన్ బజార్ శ్రీ గణేష్ భక్తబృందం ఐదు లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిపారు.

  ఇదీ చదవండి : అక్కాబావ ఫ్యామిలీ రెస్టారెంట్‌..! తక్కువ రేటుకే తిన్న వాళ్లకు తిన్నంత.. ఎక్కడో తెలుసా

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా కుల మతాలకతీతంగా హిందువులు ముస్లింలు కలిసి జరుపుకునే ఒక పెద్ద పండుగగా వినాయకచవితిని చెప్పుకోవచ్చు. నిమజ్జనం రోజు కూడా ముస్లిమ్స్ హిందువులకు సపోర్ట్ చేస్తూ అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు.  తాగునీరు ఏర్పాటు చేయడం గానీ కన్నుల పండుగగా ఉంటుంది. ఎంతో ఆప్యాయతతో కలిసికట్టుగా వినాయక చవితి పండుగను జరుపుకుంటారు.

  ఇదీ చదవండి : ఈ మహానగరానికి ఏమైంది..? భయపెడుతున్న వరుస ప్రమాదాలు.. ఖాకీలను వెంటాడుతున్నాయిత.. ఎక్కడో తెలుసా

  ఇలా కర్నూలు జిల్లాలో దాదాపు 2000 విగ్రహాలు ఏర్పాటు చేసి తొమ్మిది రోజుల పాటు భక్తి శ్రద్ధలతో పూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఒక్కో గణేషుని మండపం వద్ద ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసి పిల్లలకు వినాయక చవితి యొక్క విశిష్టతను తెలియజేసే ప్రొగ్రామ్స్‌ను చేస్తున్నారు.


  అడ్రస్‌: మించిన్‌ బజార్‌, అమ్మవారిశాల, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌- 518001.

  ఎలా వెళ్లాలి :- కర్నూలులోని కొండారెడ్డి బురుజు దగ్గర గల మించిన్ బజార్లోని అమ్మవారి శాల ఎదురుగా ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Ganesh Chaturthi​ 2022, Kurnool, Local News

  ఉత్తమ కథలు