Home /News /andhra-pradesh /

KURNOOL GADICHARLA HARI SARMOTHAVA RAO LIBRARY IN KURNOOL KNL NJ ABH

Kurnool: అక్కడ దొరకని పుస్తకమంటూ ఉండదు.. నాలెడ్జ్ కు కేరాఫ్ అడ్రస్ ఆ లైబ్రరీ.. ఏపీలో ఎక్కడుందంటే..!

కర్నూలు

కర్నూలు జిల్లా కేంద్ర బిందువుగా నిలుస్తునటువంటి కేంద్ర గ్రంథాలయం…ఎందరో విద్యార్థులకు దిక్యూచిలా కనిపిస్తోంది. నిరుద్యోగులకు మార్గదర్శిలా నిలుస్తోంది ఈ లైబ్రరీ. కర్నూలు జిల్లా కేంద్ర గ్రంధాలనికి గాడిచర్ల గ్రంధాలయం అనే పేరు ఎలా వచ్చింది.?

కర్నూలు జిల్లా కేంద్ర బిందువుగా నిలుస్తునటువంటి కేంద్ర గ్రంథాలయం…ఎందరో విద్యార్థులకు దిక్యూచిలా కనిపిస్తోంది. నిరుద్యోగులకు మార్గదర్శిలా నిలుస్తోంది ఈ లైబ్రరీ. కర్నూలు జిల్లా కేంద్ర గ్రంధాలనికి గాడిచర్ల గ్రంధాలయం అనే పేరు ఎలా వచ్చింది.?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Kurnool, India
  T.Murali Krishna, News 18, Kurnool

  Kurnool Library: కర్నూలులోని పాత బస్టాండ్ వద్ద నాగప్ప వీధిలో సువిశాలామైన ప్రాంగణంలో రెండు అంతస్తుల భవనం…. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలతో సేవలు అందిస్తున్న జిల్లా గ్రంధాలయం(library). ఈ గ్రంథాలయాన్ని అందరూ గాడిచర్ల గ్రంథాలయం అని పిలుస్తుంటారు.

  గాడిచెర్ల ఎవరు?
  గాడిచెర్ల హరిసర్వోత్తమ రావు (14 సెప్టెంబరు 1883 - 29 ఫిబ్రవరి 1960) భారత స్వాతంత్రోద్యమ సమయంలో ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఫ్రీడమ్‌ ఫైటర్‌. బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్ సిద్ధాంతాల నుండి ప్రేరణ పొంది… చాలా చిన్న వయస్సులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో(movement) చేరాడు. నిజాం రాజు ఈ ప్రాంతాన్ని బ్రిటీష్(British) వారికి అప్పగించినందున ఈ ప్రాంతాన్ని సీడెడ్ అని అందరూ అపహాస్యం చేసినప్పుడు.ఈ ప్రాంతానికి రాయలసీమ అని పేరు పెట్టిన వ్యక్తి ఆయన.

  గ్రంథాలయ ఉద్యమ త్రిముర్తుల్లో ఒకరు..!
  గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఆంధ్రప్రదేశ్‌లోని (Andrapradesh) గ్రంథాలయ ఉద్యమంలో గ్రంథాలయోద్యమ త్రిమూర్తుల్లో( ఇయ్యంకి వెంకట రామయ్య , పాతూరి నాగభూషణం, గాడిచర్ల హరిసర్వోత్తమరావు) ఒకరు దాని అధ్యక్షుడిగా కూడా పనిచేశారు గాడిచెర్ల హరిసర్వోత్తమరావు. తన మిత్రుడు నరసింగరావుతో కలిసి నంద్యాలలో ఎడ్వర్డ్ కార్పొరేషన్ లైబ్రరీని (ప్రస్తుతం victoria reading room అని పిలుస్తారు) స్థాపించినప్పుడు గ్రంథాలయ ఉద్యమం ప్రారంభమైంది. అతను అనేక ప్రచురణలు మరియు వార్తాపత్రికలను కూడా ప్రారంభించాడు. వాటిలో కొన్ని ఆంధ్రకేసరి (ఆంధ్ర సింహం), నవయుగం (న్యూ డాన్), ఆంధ్ర పత్రిక, మాతృ సేవ (మాతృ సేవలో), ఆంధ్ర వార్త (ఆంధ్ర వార్తలు), పంచాయతీ రాజ్యం (స్థానిక పరిపాలన).

  గాడిచర్ల గ్రంథాలయం పేరు ఎలా వచ్చింది?
  గాడిచెర్ల ఫౌండేషన్ ప్రధాన కార్యాలయం భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలులో ఉంది. ప్రతి సంవత్సరం వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వ్యక్తులకు "గాడిచెర్ల ఫౌండేషన్ అవార్డు" అందజేస్తుంది. ఆ విదంగా గాడిచర్ల ఫౌండేషన్ ద్వారా భవన నిర్మాణం చేయడం వల్లన గాడిచర్ల గ్రంధాలయం అని పేరు వచ్చింది.
  ఈ గ్రంథాలయంలో ముఖ్యంగా 6 విభాగాలున్నాయి..

  1. Lending section

  2. Periodical section

  3. Internet section

  4. Serve Section (Reference section )

  5. Study lab

  6. Old Periodical Section


  1. Lending Section

  విద్యార్థులు ఈ సెక్షన్ లో దొరికే పుస్తకాలు తీసుకుని ఇక్కడే కూర్చుని చదువుకోవచ్చు. 25 మంది కూర్చుని చదువుకునే విదంగా చైర్స్ మరియు రూములో ఏసీ అమర్చారు. అంతే కాకుండా విద్యార్థులు ఎవరైనా. ఇందులో ఏ విద్యార్ధి ఐనా సరే వారి వివరాలు నమోదు చేసి 100 రూపాయలు డిపాజిట్ చేసి వారికీ నచ్చిన ఏ పుస్తకమైన, నవలైనా ఏదైనా పుస్తకం ఇంటికి తీసుకెళ్లి పూర్తిగా చదివి మళ్ళీ 15 రోజుల తరువాత తెచ్చి ఇచ్చే విదంగా ఒక సిస్టమ్ ఏర్పాటు చేసారు. అంతే కాకుండా ఒకవేళ ఎవరికైనా అది నచ్చకపోతే వారి డిపాజిట్ వెనక్కి తీసుకునే విదంగా వీలు కలిపించారు. అదే విదంగా ఈ సెక్షన్ ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఉంటుంది.

  2. Perodical Section

  ఇది lending section పక్కన ఉన్నటువంటి గది. ఇందులో రిటైర్డ్ ఆఫీసర్స్, ఓల్డ్ సినియర్ సిటిజన్స్ 30 మంది కూర్చుని చదువుకునేందుకు వీలుగా రోజుకు 40 రకాల వివిధ బాషలకు చెందిన న్యూస్ పేపర్స్ నవలలు ఏర్పాటు చేయడం విశేషం.ఈ సెక్షన్ కూడా రోజు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పని చేస్తుంది..

  3. Internet section
  ఇంటర్ నెట్ విభాగంలో విద్యార్థులకు ఉపయోగ పడేలా తక్కువ ధరకే కంప్యూటర్లను ఉపయోగించుకునేందుకు వీలుగా ముఖ్యంగా లెడింగ్ విభాగంలో 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకున్న వారికీ గంటకు 10 రూపాయలు చొప్పున, ఏదైనా ప్రింట్ తీసుకోవాలనుకున్న వాళ్లకు బయటకంటే తక్కువ ధరకే ఇంటర్‌నెట్‌ వాడుకునే వెసులుబాటు ఉంది.

  4. Serve Section (Reference section)

  ఈ విభాగంలో ముఖ్యంగా కాంపిటేటివ్ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు అన్ని రకాల రెడీ మేడ్ లేటెస్ట్ ప్రింటెడ్ బుక్స్ మరియు ఏసీ సౌకర్యంతో 50 మంది విద్యార్థులు కూర్చుని చదువుకునేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పేద మధ్యతరగతి విద్యార్థులు రోజు ఇక్కడ చదువుకోవచ్చు.

  5. Study lab
  ఈ విభాగం రిఫరెన్స్ సెక్షన్ కి ఎదురుగా ఉంటుంది.. ప్రైవేట్ స్టడీ హల్స్ కి ధీటుగా అత్యాధునిక హంగులతో పేద, మధ్య తరగతి విద్యార్థులకు దాదాపు ఒకేసారి 100 మంది కూర్చుని చదువుకునేందుకు వీలుగా దీనిని నిర్మించారు.

  6.old perodical section

  ఇక్కడ ఎవరైనా రిఫరెన్స్ కోసం వస్తే వారికీ తగిన సమాచారం అందించడనికి ఈ సెక్షన్ నిర్వహిస్తున్నారు. ఈ సెక్షన్ మాత్రం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పనిచేస్తుంది

  ఇలా ఎన్నో చక్కటి వస్తులతో అత్యాధునిక హంగులతో మరి ముఖ్యంగా పేద విద్యార్థులకు ఇంత చక్కటి సౌకర్యాన్ని కలిపిస్తుంది కర్నూలు జిల్లా కేంద్ర గ్రంధాలయం. ఇప్పుడు కొత్తగా విద్యార్థులకు ఉచితంగా భోజనం కూడా ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం సమయంలో లైబ్రరీలో చదువుకుంటున్న విద్యార్థులకు భోజన సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు.  Read this also; Kurnool: హర్ ఘర్ తిరంగా రెప రెపలు.. కర్నూలులో భారీ జాతీయ జెండా.. ప్రత్యేకత ఏంటంటే?  టైమింగ్స్‌ : ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు, ప్రతి శుక్రవారం గ్రంధాలయానికి సెలవు.
  అడ్రస్‌ : పాత బస్టాండ్‌ రోడ్డు, ఎన్‌ఆర్‌ పేట, కర్నూలు, ఆంధ్రప్రదేశ్‌ - 518002.
  ఎలా వెళ్లాలి?
  కర్నూలు బస్టాండ్‌ నుంచి ఐదు నిమిషాల్లో లైబ్రరీకి వెళ్లొచ్చు. లోకల్ ఆటోలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Andhrapradesh, EDUCATION, Kurnool, Local News

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు