హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

కాపు కాచి కారం, కత్తులతో దాడి..! పాత కక్షలే కారణమా...!

కాపు కాచి కారం, కత్తులతో దాడి..! పాత కక్షలే కారణమా...!

నంద్యాల జిల్లాలో యువకుడిపై దాడి

నంద్యాల జిల్లాలో యువకుడిపై దాడి

ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) డోన్ నియోజకవర్గం కొండపేటలో రెండు గ్యాంగులు కారం చల్లుకుని కత్తులు, కర్రలతో రెచ్చిపోయి పరస్పరం ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Nandyal | Kurnool | Andhra Pradesh

Murali Krishna, News18, Kurnool

ఉమ్మడి కర్నూలు జిల్లా (Kurnool District) డోన్ నియోజకవర్గం కొండపేటలో రెండు గ్యాంగులు కారం చల్లుకుని కత్తులు, కర్రలతో రెచ్చిపోయి పరస్పరం ఒకరిపై ఒకరు దాడికి పాల్పడ్డాడు. డోన్ పట్ణణానికి చెందిన యువకులు షేక్ మసూద్, రవి అనే యువకులు తమ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా తీసుకున్న అప్పు తిరిగి ఇవ్వలేదని డోన్ పట్టణంలోని కొండపేట కాలానికి చెందిన బోయ సాయి, చిన్న మరి కొంతమంది కలిసి కాపు కాచి కంట్లో కారం చల్లి దాడి చేసారు. ఈ దాడిలో గాయపడిన షేక్ మసూద్, బోయ సాయికి తీవ్రంగా గాయాలు కావటంతో స్థానికులు వారిని డోన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన షేక్ మసూద్ పరిస్థితి విషమంగా ఉంది. వెంటేనే అతనిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ ఘటనపై పోలీసులు ఇరు వర్గాలవారిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. నంద్యాల జిల్లా (Nandyal District) లో ఇలాంటి ఘటనలు పట్టపగలే నడిరోడ్లపై ఇలానే జరుగుతుండటంతో ప్రజలు తీవ్ర భయందోళనకు గురవుతున్నారు. గడిచిన 5 నెలలో 10కి పైగా ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతుండడం ప్రజలను విస్మయానికి గురి చేస్తుంది.

ఇది చదవండి: ధర పెరగడం కూడా సమస్యే..! మిర్చిరైతులకు వింత సమస్య..!

ముఖ్యంగా డోన్ నియోజకవర్గం అందులోని రాష్ట్ర ఆర్ధిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి (Buggana Rajendranath Reddy) నియోజకవర్గంలోనే పరిస్థితి ఈ తరహాలో ఉంటే మిగతా సామాన్యుల పరిస్థితి ఇంకేవిధంగా ఉంటుందో అని పట్టణ వాసులు భయందోళనకు గురవుతున్నారు. పోలీసులు సైతం ఇలాంటి వాటిపై గట్టి నిఘా ఉంచి ఇలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలనికోరుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Kurnool, Local News

ఉత్తమ కథలు