Home /News /andhra-pradesh /

Andhra Pradesh: అక్కడ వానపడితే వజ్రాల పంటే... రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు..

Andhra Pradesh: అక్కడ వానపడితే వజ్రాల పంటే... రాత్రికి రాత్రే కోటీశ్వరులవుతారు..

కర్నూలు జిల్లాలో రూ.30 లక్షలు విలువ చేసే వజ్రం లభ్యం

కర్నూలు జిల్లాలో రూ.30 లక్షలు విలువ చేసే వజ్రం లభ్యం

ఆ ఊళ్లో వర్షాలు పడితే వజ్రాల పంట పండుతుంది. రాత్రికి రాత్రే రైతులు కోటీశ్వరులైపోతారు.

  ఆ ఊళ్లో వర్షాలు పడితే వజ్రాల పంట పండుతుంది. రాత్రికి రాత్రే రైతులు కోటీశ్వరులైపోతారు. వానాకాలం వస్తే ఆ ఊరే కాదు. చుట్టుపక్కల గ్రామాలు, మండలాలు, జిల్లాల నుంచి ఆశావాహులు ఇక్కడ వాలిపోతారు. రోజుల తరబడి వజ్రాల కోసం వెతుకులాడుతుంటారు. ఆ ప్రాంతమే కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలోని జొన్నగిరి ప్రాంతం. గతంలో చాలా మంది రైతులు భూమిలో దొరికిన వజ్రాలతో కోటీశ్వరులయ్యారు. తాజాగా జొన్నగిరిలో మరో వ్యక్తికి అదృష్టం కలిసొచ్చింది. పొలంలో లక్షలు విలువ చేసే వజ్రం లభ్యమైంది. స్థానిక వ్యాపారి ఒకరు ఆ వజ్రాన్ని రూ.30 లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ అరుదైన వజ్రాన్ని కొనుగోలు చేయడానికి స్థానికంగా ఉండే వజ్రాల వ్యాపారులు పోటీ పడ్డారు. అయితే కోట్లాది రూపాయల విలువ చేసే వజ్రాన్ని ఆ వ్యాపారి తక్కువ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

  గతంలో కూడా చాలా మందికి జొన్నగిరిలో వజ్రాలు లభ్యమయ్యాయి. ఈ ఏడాది మే నెలలో ఓ రైతుకు కోట్లాది రూపాయలు విలువ చేసే వజ్రం దొరికింది. పొలంపనులు చేస్తుండగా వజ్రం దొరకడంతో దానిని పరీక్షించారు. అది 30 క్యారెట్ల వజ్రంగా తేలడంతో వ్యాపారులు అతడి వద్దకు పరుగులు పెట్టారు. దాదాపు రూ.3కోట్లు విలువ చేసే వజ్రాన్ని రూ.కోటి 20లక్షలు కొనుగోలు చేశారు.

  ఇది చదవండి: ఆనందయ్యకు ఎమ్మెల్సీ పదవి...? గవర్నర్ సిఫార్సు.. అసలు నిజం ఇదే...!  వర్షం పడితే వజ్రాలే..
  వర్షాలు పడుతున్న కొద్దీ మట్టి పొరల్లో దాగిన ఎంతో విలువైన వజ్రాలు బయటపడతాయి. వజ్రాలను వెతకటానికి వేరే జిల్లా నుండే కాక వేరే రాష్ట్రాల నుండి కూడా పెద్దఎత్తున జనాలు ఇక్కడికి వస్తుంటారు. కర్నూలు, గుంటూరు, కడప జిల్లాలకు చెందిన వారితో పాటు జొన్నగిరి చుట్టుపక్క గ్రామాల రైతులు వాళ్ల అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఉదయం నుండి వజ్రాల వేట కొనసాగిస్తారు. దొరికిన వారు లక్షాధికారి అవుతారు. దొరకని వారు తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వెతుకుతూనే ఉంటారు.

  ఇది చదవండి: ఈ విషయంలో కూడా భార్యతో గొడవపడాలా...? అకారణంగా ప్రాణం పోయిందే..!


  ఐతే స్థానికులకు వజ్రాలు దొరికి వాటిని లక్షలు, కోట్లలో విక్రయిస్తున్నా పోలీసులుగానీ, రెవెన్యూ సిబ్బందిగానీ పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. అక్రమంగా జరుగుతున్న ఈ వ్యాపారంలో ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతున్నా పట్టించుకోవడం లేదు. వజ్రాల వేలం పాటలు రహస్యంగా జరుగుతుండటం.. వజ్రం దొరికిందన్న ప్రచారం తప్ప ఎక్కడా రుజువులు లేకపోవడంతో అధికారులు కూడా ఏమీ చేయలేకపోతున్నారు. పైగా స్థానికులు గానీ, వ్యాపారులుగానీ ఈ అంశంపై నోరువిప్పకపోవడం మరో అడ్డంకిగా మారింది. వానాకాలం ముగిసేనాటికి భూమితల్లి ఎంతమందిని కోటీశ్వరులను చేస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

  మీ నగరం నుండి (కర్నూలు)

  ఆంధ్రప్రదేశ్
  కర్నూలు
  ఆంధ్రప్రదేశ్
  కర్నూలు
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Farmer

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు