(T.Murali Krishna, News 18, Kurnool)
ఈ రోజుల్లో కాలేజీల్లో చదివే యువత వీకెండ్స్ వస్తే చాలు ఏదో ఒక రెస్టారెంట్‌కు వెళ్లి పార్టీ చేసుకోవడం పరిపాటి. ఇంక బర్త్‌డేలు, వేరే ఏదైనా స్పెషల్ అకేషన్ ఉందంటే ఇంక చెప్పేపని లేదు.. పార్టీ పార్టీ అంటూ గోల పెట్టేస్తారు. ఆ పార్టీ ఏమైనా వీధిచివర బడ్డీకొట్టులోనో, బేకరీలోనో అయితే పర్వాలేదు…రెస్టారెంట్కెళ్లాల్సిందే.. మంచిగా ఏసీ గదిలో కూర్చుని మెనూకార్డు చూస్తూ దొరికింది ఛాన్సు అంటూ తెల్సినవి..తెలియనివి అన్ని ఆర్డర్ పెట్టేస్తారు. పార్టీ ఇచ్చేవాడి జేబు చిల్లుపడాల్సిందే..!
అయితే ఈ సారి మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైనా పార్టీ అంటే కర్నూలులోని ఫుడీమాంక్ (Foodie monk) కు తీసుకెళ్లండి. మీ జేబులో డబ్బు ఆదా అవుతుంది..మీ వాళ్ల కోరుకున్న బెస్ట్ రెస్టారెంట్ ఫుడ్ దొరుకుతుంది. ఇంతకీ ఏంటి ఈ ఫుడ్ మాంక్ ఏంటి? అక్కడ స్పెషాలిటీ ఏంటి?
రెస్టారెంట్ స్టయిల్ ఫుడ్ మనకు స్ట్రీట్‌లో దొరికితే... మనకెంతో నచ్చిన స్టిక్స్, మోమోస్‌ను ఆరుబయట చల్లని వాతావరణంలో కూర్చుని పక్కన నది పరవళ్లు చూస్తూ తింటుంటే.. అబ్బా వింటుంటేనే ఎంతో హాయిగా ఉంది కదా.. ఇదే అనుభూతి కావాలంటే కర్నూలులో ఓ ప్లేస్ ఉంది.
ఈ మధ్యకాలంలో మొబైల్ క్యాంటీన్ల హవా ఎక్కువైంది. ప్రస్తుతం కర్నూలులో కేంద్రం నడిబొడ్డులో ఉన్నటువంటి వినాయక పరిసర ప్రాంతాలలో అనేక రకాల చిరు తిండ్లు బండారాలు చాలా ఎక్కువగానే ఉంటాయి. నేటితరం యువత పూర్వపు ఆహార పదార్థాల కంటే ప్రస్తుతం మార్కెట్లో రెడీమేడ్‌గా త్వరగా తయారుచేసే ఆహార పదార్థాలు, పానీయాలకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు.
ఈ మధ్యకాలంలో వస్తున్న హోటల్స్, మొబైల్ కాంటీన్స్…. వాటిలో ఎక్కువగా ఆహార పదార్థాల రుచికంటే వాటికి సంబంధించిన మెనుతో పాటు మంచి కొటేషన్స్ ఆహార ప్రియులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఆహారం తినడం సహజమైతే ఆహారం తయారు చేయడం ఒక గొప్ప కలగా ఉంటుంది అని ఫుడీ మాంక్ నిర్వాహకులు అంటున్నారు.
ఫాస్ట్ ఫుడ్ అంటే మాములుగా ఫ్రైడ్‌రైస్, న్యూడిల్స్, మంచూరియా…ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ ప్రతిచోట మనకు అందుబాటులో ఉంటాయి. కానీ వాటితో పాటు యూత్ ఎక్కువగా ఇష్టపడే జంక్ ఫుడ్ స్టిక్స్. ఆలూ చిప్స్‌ను ఓ మెషిన్‌తో సర్కిల్స్‌గా కట్ చేసి..కర్రకు గుచ్చి డీ ఫ్రై చేస్తారు. ఆ తర్వాత దానిపై ఫుడ్ లవర్స్ టేస్ట్‌కు తగ్గట్లుగా డెకరేట్ చేస్తారు. ఇప్పుడు కర్నూలులో ఈ ఆలూ స్టిక్స్ బాగా ఫేమ్ అయ్యాయి.
ఫుడీ మాంక్లో దొరికే స్పెషల్ ఐట్సమ్:
పెరి పెరీ స్టిక్స్ (peri peri sticks), మయోనిస్ స్టిక్స్ ( Mayonise sticks), చీజ్ జలపెనో స్టిక్స్ (cheese jalepeno stick), బార్బిక్యూ స్టిక్.. ఇవన్నీ కూడా కేవలం రూ.50 లకే లభిస్తున్నాయి. ఈ రెస్టారెంట్ స్టయిల్ ఫుడ్ అంత తక్కువకు అందిస్తుండటంతో.. ఆరుబయట ప్రశాంతంగా కూర్చుని నచ్చిన వాటిని తింటూ కర్నూలు వాసులు ఎంజాయ్ చేస్తున్నారు.
ఒక్క స్టిక్స్ మాత్రమే కాదు.. ఇక్కడ రకరకాల ఫ్రైస్, మోమోస్ కూడా అందుబాటులో ఉన్నాయి. ప్రైస్‌లో స్పెషల్ గా స్మైలీస్, ఫ్రెంచ్ ఫ్రైస్, చికెన్ పాప్‌కార్న్, చికెన్ నగ్గెట్స్ ఉన్నాయి. మోమోస్‌తో వెజ్ మోమోస్, చికెన్ మోమోస్, క్రంచీ వెజ్ మోమోస్, మంచూరియన్ మోమోస్.. ఇలా చాలా రకాల ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి.
టేస్టుతో పాటు… తక్కువ ధరలో నాణ్యమైన ఫుడ్ ఉంటుందని ఆహార ప్రియులు తెలుపుతున్నారు.
బయట రెస్టారెంట్ల కంటే… ఇలా మొబైల్ క్యాంటీన్లో ఫుడ్ చాలా తాజాగా టేస్టీగా ఉంటున్నాయంటున్నారు కస్టమర్లు. ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలతో కలిసి ..కర్నూలు నడిబొడ్డున కేసీ కెనాల్‌ను చూస్తూ.. ఇష్టమైన ఫుడ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. తక్కువ ధరకే అందరికీ అందుబాటులో ఉండే విధంగా రుచికరమైన ఫుడ్ అందించడమే తమ ధ్యేయమంటున్నారు నిర్వాహకులు విష్ణు.
ఫోన్ నెంబర్: 9000031227, విష్ణు
అడ్రస్ : ఫుడీ మాంక్, కర్నూలు వినాయక ఘాట్ ఎదురుగా, సెంట్రల్ ప్లాజా, కర్నూలు, ఆంధ్రప్రదేశ్.
కర్నూలు క్యాంపు రోడ్డులోని ఆర్చి ఎంట్రన్స్‌కు ఎడమవైపుగా ఈ ఫుడీమాంక్ ఉంటుంది. బస్టాండ్ నుంచి లోకల్ ఆటోలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhrapradesh, Food, Kurnool, Local News