KURNOOL FIVE MEMBERS GANG ARRESTED DOING HONEY TRAP AND BLACKMAILING IN KURNOOL DISTRICT OF ANDHRA PRADESH FULL DETAILS HERE PRN
Honey Trap: ఫోన్లో మహిళల వలపు వల.., ఇంటికి పిలిపించి ఏకాంతంగా ఉన్నసమయంలో...
ప్రతీకాత్మక చిత్రం
Black Mailing: వ్యక్తికి కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి హలో అనగానే.. అవతలి వైపు నుంచి అమ్మాయి గొంతు వినిపించింది. ఆ తర్వాత మొదలైంది అసలు సినిమా...
తవరకైనా వెళ్తున్నారు. వ్యక్తిత్వాలను దిగజార్చుకుంటున్నారు. పురుషులకు వలపు వల వేసి బ్లాక్ మెయిల్ చేస్తూ డబ్బులు దండుకుంటున్నారు. ఈజీ మనీకి అలవాటు పడి కొందరి వద్ద నుంచి లక్షల్లో దోచేశారు. ఇలా ఇటీవల కర్నూలు జిల్లాకు చెందిన ఓ వ్యక్తికి కొత్త నెంబర్ నుంచి ఫోన్ కాల్ వచ్చింది. లిఫ్ట్ చేసి హలో అనగానే.. అవతలి వైపు నుంచి అమ్మాయి గొంతు వినిపించింది. “మీరు నాకు బాగా తెలుసు.. చాలా సార్లు మాట్లాడాలని ప్రయత్నించినా కుదర్లేదు. మీరు అందంగా ఉంటారు. తెలిసినవాళ్ల దగ్గర మీ ఫోన్ నెంబర్ సంపాదించా.. ఓసారి ఇంటికి వస్తే ఏకాంతంగా మాట్లాడుకుందాం..” అని ఇంటికి పిలిపించుకుంది. ఇంటికెళ్లిన తర్వాత తియ్యగా మాట్లాడి గదిలోకి తీసుకెళ్లిన అమ్మాయి.. అతడ్ని అర్ధనగ్నంగా ఉండగా ఫోటోలు తీసింది. డబ్బులివ్వకుంటే ఫోటోలు సోషల్ మీడియాలో పెడతామని బ్లాక్ మెయిలింగ్ కు దిగింది. దీంతో కంగారుపడిపోయిన అవతలి వ్యక్తి ఎక్కడ పరువు పోతుందోనని భయపడి లక్షలకు లక్షలు ఆమ్మాయికి ఇచ్చాడు.
కర్నూలు నగరంలోని బంగారుపేటకు చెందిన శకుంతల, అంజనమ్మ అనే మహిళలు, ఆటో డ్రైవర్ కిశోర్, ప్లంబర్ నాగరాజు, దాసు మరో వ్యక్తి కలిసి ముఠాగా ఏర్పడ్డారు. బాగా డబ్బున్నవాళ్లను ట్రాప్ చేసి వారి దగ్గర డబ్బులు వసూలు చేయాలనేది ఈ ముఠా ప్లాన్. ఈ ముఠాలో దాస్ అనే వ్యక్తి బాగా డబ్బున్నవాళ్ల నెంబర్లు సేకరించి అంజనమ్మ, శకుంతలకు ఇచ్చారు. వీళ్లిద్దరూ ఆ నెంబర్లకు ఫోన్ చేసి తీయ్యని మాటలతో ముగ్గులోకి దింపేవారు. ఇంటికి పిలిపించుకొని రూమ్ లోకి తీసుకెళ్లి వారిని అర్ధనగ్నంగా ఫోటోలు తీసి బెదిరించేవారు. ఇలా చాలా మందిని మోసం చేసి లక్షల్లో దండుకున్నారు.
ఇటీవల కర్నూలులోని లేబర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి ఫోన్ చేసి ముగ్గులోకి దించారు. అతడ్ని బెదిరించి రూ.1.20 లక్షలు వసూలు చేశారు. ఆలాగే 15 రోజుల క్రితం రామ్ రహీమ్ నగర్ కు చెందిన మరో వ్యక్తిని ట్రాప్ చేసి ఇంటికి పిలిపించారు. ఏకాంతంగా ఉన్న సమయంలో అతడి ఫోటోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. అతడి నుంచి రూ.8 లక్షలు విలువైన ప్రామిసరీ నోట్లు, చెక్కులు తీసుకున్నారు.
బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ముఠాను చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఐదుగుర్ని అదుపులోకి తీసుకోని వారిదగ్గర మొబైల్ ఫోన్లు, చెక్కులు, ప్రామిసరీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజలెవరూ ఇలాంటి వారి ట్రాప్ లో పడొద్దని.. కొత్త నెంబర్ల నుంచి కాల్ చేసి తియ్యగా మాట్లాడితే మోసపోవడం గ్యారెంటీ అని పోలీసులు హెచ్చరించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.