హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఇదే చివరి సెల్ఫీ అంటూ పోస్టింగ్..! భార్య ఆ మాట అనడంతోనే అలా చేశాడా..?

ఇదే చివరి సెల్ఫీ అంటూ పోస్టింగ్..! భార్య ఆ మాట అనడంతోనే అలా చేశాడా..?

కర్నూలు జిల్లాలో పిల్లలతో సహా తండ్రి అదృశ్యం

కర్నూలు జిల్లాలో పిల్లలతో సహా తండ్రి అదృశ్యం

Nandyal: చిన్న పాటి గొడవ ఆ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసింది.ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న వారి కుటుంబంలో అనుమానం అనే పెనుభూతం అగ్గిరాజేసింది.భార్య భర్తలు ఇద్దరి మధ్య చిన్న పాటి మనస్పర్థల కారణంగా పిల్లలకు దిక్కుతోచలేదు.

 • News18 Telugu
 • Last Updated :
 • Nandyal | Kurnool | Andhra Pradesh

  Murali Krishna, News18, Kurnool

  చిన్న పాటి గొడవ ఆ కుటుంబాన్ని చిన్నా భిన్నం చేసింది. ఇద్దరు పిల్లలతో హాయిగా సాగిపోతున్న వారి కుటుంబంలో అనుమానం అనే పెనుభూతం అగ్గిరాజేసింది.భార్య భర్తలు ఇద్దరి మధ్య చిన్న పాటి మనస్పర్థల కారణంగా పిల్లలకు దిక్కుతోచలేదు. దీంతో భార్య పుట్టింటికి వెళ్లిపోవటంతో భార్త మనస్థాపం చెంది ఈ చేశాడో తెలుసా..! నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలోని లింగం దిన్నె గ్రామానికి చెందిన బండి విజయ్ కుమార్​కు 15 సంవత్సరాల క్రితం మౌనిక అనే మహిళతో 15 ఏళ్ల క్రితం పెద్దలు కుదిరిచ్చిన వివాహం జరిగింది. వారికి కుమార్తె, కుమారుడు సంతానం పిల్లల చదువు కోసంఆళ్లగడ్డ పట్టణంలో స్థిరపడ్డారు ఆలా ఇద్దరు పిల్లలతో కలిసి హాయిగా సాగిపోతున్న వారి సంసారంలో అనుమానం అనే పెనుభూతం అగ్గిరాజేసింది.

  భార్య మౌనికపై అనుమానంతో భర్త బండి విజయ్ కుమార్ తరచూ వేధిస్తుండడంతో మనస్తాపం చెంది తన ఇద్దరు పిల్లలను భర్త దగ్గర వదిలి తన పుట్టింటికి వెళ్లిపోయింది. ఎంతకీ భార్య మౌనిక కాపురానికి తన దగ్గరకు రాకపోవడంతో తీవ్ర మనస్థాపం చెందిన బండి విజయ్ కుమార్ తన పిల్లలు ప్రియా నందిని, ప్రభుచరణ్ ఇద్దరిని తీసుకుని ఈ నెల 22వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయారు. ఇద్దరు పిల్లలతో కలిసి ఇంటి నుంచి వెళ్ళిపోయిన విజయ్ కుమార్ పిల్లలు ఇద్దరితో కలిసి సెల్ఫీ ఫోటో తీసుకుని ఇదే మా చివరి ఫోటో అంటూ ఆ ఫోటోను తమ బందువులకు వాట్సాప్ ద్వారా పంపారు.

  ఇది చదవండి: చిన్నపాటి నిర్లక్ష్యం.. నిండుప్రాణం తీసింది.. మరీ ఇంత ఘోరమా..?

  ఆ తరువాత మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నారు. దీంతో ఆందోళన చెందిన కుటుంబసభ్యులు ఆళ్లగడ్డ పోలీసులను అశ్రయించారు. బాధితుల ఫిర్యాదు మేరకు క్రైం crno:217/2022 మిస్సింగ్ కేసుకుండా కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు.... దర్యాప్తులో భాగంగా విజయ్ కుమార్ మొబైల్ ఫోన్ సిగ్నల్ ట్రేస్ ఔట్ చేయగా విజయ్ కుమార్ సెల్ ఫోన్ సిగ్నల్ చివరిగా లోకేషన్ కడప చూపించినది. ఆ తరువాత ఎలాంటి ఆధారాలు దొరకలేదని పోలీసులు తెలిపారు.

  ఒకవేళ కడప చుట్టుపక్కల ప్రాంతంలో వీరి ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా తమకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆళ్లగడ్డ పట్టణ పోలీసులు తెలిపారు.ఆచూకీ తెలిసిన వారు వెంటనే.. సీఐ- 9121101164, ఎస్సై Cell : 9121101203 నెంబర్లకు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Kurnool, Local News

  ఉత్తమ కథలు