Father and Daughter: అసలు వీడు తండ్రేనా..? కన్నకూతురిపైనే కన్నేశాడు..! వీడికి ఎలాంటి శిక్ష వేసినా తప్పులేదు..!

ప్రతీకాత్మక చిత్రం

Father And Daughter: కన్నతండ్రి అంటే కూతుర్ని కంటికి రెప్పలా కాపాడాలి. తల్లి జన్మనిస్తే.. తండ్రి పెంచి పెద్దచేస్తాడు. ఆడపిల్లలకు వయసొచ్చిన తర్వాత వారికి రక్షణగా నిలబడతాడు. కానీ కామాంధుడు మాత్రం తండ్రి అనే పదానికే మాయని మచ్చతెచ్చాడు.

 • Share this:
  కన్నతండ్రి అంటే కూతుర్ని కంటికి రెప్పలా కాపాడాలి. తల్లి జన్మనిస్తే.. తండ్రి పెంచి పెద్దచేస్తాడు. ఆడపిల్లలకు వయసొచ్చిన తర్వాత వారికి రక్షణగా నిలబడతాడు. కానీ కామాంధుడు మాత్రం తండ్రి అనే పదానికే మాయని మచ్చతెచ్చాడు. కన్న కూతురిపైనే కన్నేసి ఆమెను గరభవతిని చేశాడు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని అనంతపురం జిల్లా (Anantapuram District) గుంతకల్లులోని భాగ్యనగర్ కు చెందిన నిందితుడు పెయింటర్ గా పనిచేస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. మద్యానికి బానిసైన అతడు పదిహేనేళ్ల వయసున్న తన పెద్దకుమార్తెపై కన్నేశాడు. బాలికను బెదిరించి పలుసార్లు లైంగికదాడికి పాల్పడ్డాడు. గత కొన్ని నెలలుగా ఈ దారుణానికి పాల్పడుతున్నాడు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. ఐతే కూతురు ప్రవర్తనపై అనుమానం వచ్చిన తల్లి అతడ్ని గట్టిగా మందలించింది. ఐతే నన్నే తిడతావా అంటూ ఆమెపైనా దాడి చేశాడు.

  ఐతే బాలిక అనారోగ్యంగా ఉండటంతో అనుమానం వచ్చి గుంతకల్లు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు గర్భవతి అని నిర్ధారించారు. ఐతే అబార్షన్ చేయాలని కోరడంతో డాక్టర్లు ఒప్పుకోలేదు. పోలీసులను పిలుస్తామని చెప్పడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు.

  ఇది చదవండి: భర్తతో భార్య గొడవ.. మధ్యలో ప్రియుడు ఎంట్రీ.. తల్లిబాగోతాన్ని బయటపెట్టిన కొడుకు..


  ఇదిలా ఉంటే బుధవారం బాలికను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లి మరోసారి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ కూడా గర్భవతిగా తేలడంతో డాక్టర్లు పోలీసులకు సమాచారమిచ్చారు. కర్నూలు పోలీసులు గుంతకల్లు పోలీసులకు చెప్పడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు నిందితుడిపై గుంతకల్లు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో అత్యాచారం, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలికను వైద్య పరీక్షల కోసం అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

  ఇది చదవండి: 17 ఏళ్ల కూతురు అనుమానాస్పద మృతి.. సీక్రెట్ గా దహనం.. అతడితో తల్లి ఎఫైర్ కారణమా..?  ఇటీవల చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం గురవరాజు పల్లెలో ఇలాంటి ఘటనే జరిగింది. గ్రామానికి ఖాదర్ బాషా, నజియా దంపతులకు ఖాదర్-నజియా దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె ఉంది. ఖాదర్ బాషా ఆటో నడుపుతూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఐతే సులభంగా డబ్బులు సంపాదించాలనే అత్యాశతో ఎర్రచందనం స్మగ్లర్ గా మారాడు. ఈ క్రమంలో రెండుసార్లు పోలీసులకు పట్టుబడి జైలుకెళ్లాడు. ఈ మధ్యనే బెయిల్ పై వచ్చిన ఖాదర్.., భార్య, కుమార్తెపై అనుమానం పెంచుకున్నాడు. మద్యానికి బానిసై భార్యా, కూతుర్ని వేధించడం మొదలుపెట్టాడు. ఖాదర్ భాష వేధింపులు భరించలేని భార్య నజియా కుమార్తెను తీసుకుని పుట్టింటికి వెళ్ళి పోయింది.

  ఇది చదవండి: నెలరోజులుగా చెట్టుకు వేలాడుతున్న డెడ్ బాడీ... అసలు మిస్టరీ ఇదేనా..?


  కొన్నిరోజులు తాను మారిపోయినట్లు నటించిన ఖాదర్.., భార్యాబిడ్డలను ఇంటికి తీసుకొచ్చాడు. కుమార్తె మొబైల్ ఫోన్ చూసి అనుమానం పెంచుకున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావో చెప్పాలంటూ చితకబాదాడు. భార్యతో గొడవపడిన కూతురికి వైద్య పరీక్షలు చేయిస్తానని ఇంట్లో చెప్పి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి తూకివాకం గ్రామం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. అత్యాచారానికి యత్నించాడు. తాను ఇలా చేసినట్లు ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి ఇంటికి తీసుకొచ్చాడు. ఐతే ఇంటికి వచ్చిన కుమార్తె ప్రవర్తనలో మార్పురావడంతో తల్లి నజియా గట్టిగా నిలదీసింది. దీంతో ఆ బాలిక జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. తన అకృత్యం భార్యకు తెలియడంతో ఖాదర్ బాషా ఇంట్లో నుంచి పరారయ్యాడు.
  Published by:Purna Chandra
  First published: