Home /News /andhra-pradesh /

KURNOOL FATHER AND SON DIED IN A ROAD ACCIDENT IN KURNOOL KNL NJ ABH

Kurnool : బంధువులను పరామర్శించడానికి వెళ్లి పరలోకాలకు..! తండ్రికొడుకులను వెంటాడిన మృత్యువు..!

బంధువులను పరామర్శించడానికి వెళ్లి పరలోకాలకు

బంధువులను పరామర్శించడానికి వెళ్లి పరలోకాలకు

బంధువులను పరామర్శించడానికి వెళ్లి వస్తూ తండ్రికొడుకులు మృత్యువాత పడ్డారు. తల్లిని చంపాడనే కోపంతో కొడుకు తన తండ్రిని కిరాతకంగా చంపాడు. ఇప్పటికీ నంద్యాలలో కొనసాగుతోన్న ఫ్యాక్షన్‌ గొడవలు..ఇలాంటి కర్నూలు జిల్లా క్రైమ్‌ వార్తల రౌండప్‌ ఒకసారి చూద్దాం.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Kurnool, India
    T.Murali krishna, News 18, Kurnool

    బంధువులను పరామర్శించడానికి వెళ్లి వస్తూ తండ్రికొడుకులు మృత్యువాత పడ్డారు. తల్లిని చంపాడనే కోపంతో కొడుకు తన తండ్రిని కిరాతకంగా చంపాడు. ఇప్పటికీ నంద్యాలలో కొనసాగుతోన్న ఫ్యాక్షన్‌ గొడవలు. .ఇలాంటి కర్నూలు జిల్లా క్రైమ్‌ వార్తల రౌండప్‌ ఒకసారి చూద్దాం.

    పరామర్శించడానికి వెళ్లి వస్తూ పరలోకాలకు..!
    బంధువుల ఆరోగ్యం బాగోలేదని పరామర్శించడానికి వెళ్లి…తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురై తండ్రికొడుకులిద్దరు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కర్నూలు జిల్లా బనగానపల్లె మండలంలో జరిగింది. మృతులు పలుకూరు గ్రామానికి చెందిన పాములేటి(70)… ఆయన రెండో కుమారుడు రాముడుగా గుర్తించారు. తమ సమీప బంధువులు అనారోగ్యానికి గురి కావడంతో.. పరామర్శించడానికి వెళ్లి వస్తూ చెరువు పల్లె -నందవరం రోడ్డులో ఎదురుగా వస్తున్న మరో బైకును ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తండ్రి కొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.

    కన్న తండ్రిని అతి దారుణంగా చంపిన కొడుకు
    భార్యని చంపిన కేసులో అరెస్టు అయిన చిన్న దేవరకొండ చెందిన ఎర్ర పుల్లయ్య(55) ఈ నెల 11వ తేదీన జైలు నుంచి బెయిల్‌పై బయటకు వచ్చాడు. కోడుమూరులోని తన కుమార్తె దగ్గరికి వెళ్లి పలకరించి..అక్కడ నుంచి వస్తున్న పుల్లయ్యను అతని కుమారుడు గమనించాడు. తన తల్లిని హత్య చేశాడనే కోపంతో కత్తితో అతిదారణంగా గొంతుకోసి చంపాడు.

    నంద్యాలలో రోజురోజుకు పెరిగిపోతున్న ఫ్యాక్షన్ గొడవలు
    నంద్యాల మండలం కొత్తపల్లిలో దారుణం చోటు చేసుకుంది. పాత కక్షలతో ఇరు వర్గాల ఘర్షణలో శేషురెడ్డి అనే వ్యక్తిపై ప్రత్యర్ధులు కత్తి, ఇనుప రాడ్డు, రాళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో శేషురెడ్డి తలకు తీవ్ర గాయాలు కావడంతో నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    ఎమ్మిగనూరు- ఆదోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం..!
    ఎక్సెల్ బైక్ పై వెళ్తున్న వ్యక్తిని గుర్తు తెలియని వాహనం వెనక వైపు నుంచి ఢీకొనడంతో బైక్‌పై వెళ్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పత్తికొండ వాసిగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆదోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

    Read also; Nagarkurnool: ఈ పోలీసు పాములను పడతాడు: ఇప్పటి వరకు 6,638 పాములు పట్టిన హోంగార్డు



    పదవ తరగతి విద్యార్థినిపై తోటి విద్యార్థుల అసభ్యకర ప్రవర్తన
    ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై తోటి విద్యార్థులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ అల్లరి ముకలో ఒకరు విద్యార్థినిపై బలవంతంగా ముద్దు పెట్టాడు. విద్యార్థిని కేకలు వేయడం, పక్కనే ఉన్న విద్యార్థులు తిరగబడడంతో ఆ అల్లరి మూక అక్కడ నుంచి పరారయ్యింది. అయితే బాధిత విద్యార్థిని తల్లిదండ్రుల ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో… కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
    Published by:Abhiram Rathod
    First published:

    Tags: Andhrapradesh, Crime news, Kurnool, Local News

    తదుపరి వార్తలు